‘Premane Oorilo’ Movie Review: ప్రేమనే ఊరిలో రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: శ్రీరామ్, రంగయాన రఘు, తపస్విని పూనాచా, రమికా శివు, గోవిందే గౌడ, సువీష్ చంద్ర తదితరులు
- DIRECTOR: మనోజ్ కుమార్
- MUSIC: సునాద్ గౌతమ్
- PRODUCER: మమతా దేవేంద్ర ఎం, సురేష్ కొండేటి
కన్నడ నాట ప్రేక్షకాదరణ పొందిన ‘ప్రేమద ఊరలి’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమనే ఊరిలో’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆర్భాటాలు లేని స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం, సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా మన ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
ప్రేమనే ఊరిలో కథ
భార్యను కోల్పోయిన నాగన్న (రంగయాన రఘు), తన ఏకైక కుమారుడు సంతోష్‌ను (శ్రీరామ్) ఎంతో గారాబంగా పెంచుతాడు. చదువు అబ్బకపోయినా తండ్రి బాటలోనే నడుస్తూ సంతోష్ ఊర్లోనే వ్యవసాయం చేస్తుంటాడు. అయితే, తన కోడలిగా బాగా చదువుకున్న అమ్మాయి రావాలన్న నాగన్న పట్టుదల వల్ల సంతోష్ వయసు ముప్ఫై దాటినా పెళ్లి కాదు. ఇదే సమయంలో, సంతోష్ మరదలు వసంత (రమికా శివు) అతడిని గాఢంగా ప్రేమిస్తుంది. తన మనసులోని మాటను బావతో పంచుకోవాలనుకునే సమయానికే, ఊహించని రీతిలో రుక్మిణి (తపస్విని పూనాచా) అనే యువతిని సంతోష్ పెళ్లాడి ఇంటికి తీసుకొస్తాడు. అసలు నాగన్న తన కొడుకుకు రుక్మిణితోనే వివాహం ఎందుకు జరిపించాడు? తొలిరాత్రి వేళ బయటపడిన ఆ ఆశ్చర్యకరమైన నిజమేంటి? రుక్మిణి ఎందుకు ఆ ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది? ఈ ముగ్గురి జీవితాలు చివరకు ఎలాంటి మలుపు తిరిగాయి? అన్నదే మిగతా కథ.
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
విశ్లేషణ
బంధాల్లో కలతలు రేపడానికి చిన్నపాటి అనుమానం చాలు, కానీ అదే బంధాన్ని నిలబెట్టడానికి వినే మాటల కంటే మనసుల మధ్య పరస్పర నమ్మకం ముఖ్యం అనే ఆలోచనను ప్రధానంగా తీసుకుని దర్శకుడు మనోజ్ కుమార్ ఈ చిత్రాన్ని మలిచారు. రక్తపాతం, అనవసరపు హంగులు లేకుండా సాఫీగా సాగే గ్రామీణ వాతావరణం సినిమాకు ప్రధాన బలం. ప్రథమార్ధంలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, పల్లెటూరి స్నేహితుల ఆటపాటలు, మరదలి అల్లరితో కథ సరదాగా సాగిపోతుంది. మరోవైపు రుక్మిణి నేపథ్యాన్ని చూపిస్తూ ఇద్దరి ప్రయాణాలు ఎలా ముడిపడతాయన్న ఆసక్తిని రేకెత్తించి, విరామానికి కథను ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మలుస్తారు.
ద్వితీయార్థం పూర్తిగా భావోద్వేగాల మయంగా మారుతుంది. ముఖ్యంగా నాగన్న సోదరి పాత్ర తాలూకు సన్నివేశాలు, అన్నదాతల ప్రాముఖ్యతపై వచ్చే సంభాషణలు హృదయానికి హత్తుకుంటాయి. ముగింపు 20 నిమిషాలు కుటుంబ విలువలను, మహిళల ఆత్మగౌరవాన్ని చక్కగా ఆవిష్కరిస్తాయి. అయితే కథనం అక్కడక్కడా పాతకాలపు ధోరణిలో నడవడం, ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు సాగదీసిన భావన కలిగించడం కొంత లోపంగా కనిపిస్తాయి. సరైన ప్రచారం కల్పించి ఉంటే ఈ చిన్న చిత్రం మరింత ఎక్కువ మందికి చేరే అవకాశం ఉండేది.
నటీనటుల ప్రతిభ విషయానికి వస్తే రంగయాన రఘు తండ్రి నాగన్న పాత్రలో జీవించారు. కొడుకుపై ఉన్న మమకారం, గతాన్ని దాస్తూ పడే అంతర్మథనం వంటి భావోద్వేగాలను అద్భుతంగా పలికించి సినిమాకు మూలస్తంభంగా నిలిచారు. శ్రీరామ్ పల్లెటూరి యువ రైతుగా సహజమైన నటన కనబరిచారు. ఎక్కడా హీరోలా కాకుండా గ్రామీణ వాతావరణానికి తగినట్టు ఒదిగిపోయారు. రమికా శివు మరదలు వసంత పాత్రలో అల్లరి పిల్లగా నవ్విస్తూనే, ప్రేమలో ఎదురయ్యే నిరాశను తన కళ్ల ద్వారా చక్కగా ప్రదర్శించారు. తపస్విని పూనాచా రుక్మిణి పాత్రకు హుందాతనాన్ని జోడించి, క్లిష్టమైన సన్నివేశాల్లో పరిణతితో కూడిన అభినయాన్ని కనబరిచారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే సునాద్ గౌతమ్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలలోని భావోద్వేగ బలాన్ని రెట్టింపు చేసింది. పాటలు కూడా సందర్భానుసారంగా బాగున్నాయి. రాజ్‌కాంత్ ఎస్కే కెమెరా పనితనం పల్లెటూరి సహజ సౌందర్యాన్ని, పచ్చటి పొలాలను తెరపై ఎంతో ఆహ్లాదకరంగా చూపించింది. హర్షిత్ ప్రభు ఎడిటింగ్ మొదటి భాగంలో కాస్త మెరుగ్గా ఉండాల్సింది అయినప్పటికీ ద్వితీయార్థంలో వేగం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చక్కగా కుదిరాయి.
ఫైనల్లీ ప్రేమనే ఊరిలో ఓ మంచి ఫ్యామిలీ మూవీ
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!