రివ్యూ : పరమపద సోపానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ తదితరులు
- DIRECTOR: నాగ శివ
- MUSIC: డేవ్ జాండ్
- PRODUCER: గణపర్తి నారాయణరావు
అర్జున్ అంబటి, జెనిఫర్ ఇమాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘పరమపద సోపానం’ నేడు (ఏప్రిల్ 24) థియేటర్లలోకి వచ్చింది. పూరీ జగన్నాథ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ రివెంజ్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ: హెల్త్ కమిషనర్ సత్యప్రకాశ్ హత్య కేసును ఛేదించే బాధ్యతను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అశ్వద్ధామకు అప్పగిస్తారు. అయితే, విచారణలో పోలీసులకు ఒక వింతైన సవాల్ ఎదురవుతుంది. ప్రతి హత్య జరిగిన చోట, తదుపరి బాధితుడి వేలిముద్రలు లభించడం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను తలపట్టుకునేలా చేస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి అర్జున్ (అర్జున్ అంబటి) ప్రవేశిస్తాడు. వృత్తిరీత్యా గేమ్ డిజైనర్ అయిన అర్జున్, గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల PTSD (Post-Traumatic Stress Disorder)తో బాధపడుతుంటాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించే అర్జున్ రక్షణ కోసం సీఐ నేహా (జెనిఫర్) నియమించబడుతుంది. మరి ఈ హత్యల పరంపరకు, అర్జున్ గతాన్ని వెంటాడుతున్న భయాలకు ఉన్న సంబంధం ఏంటి? ‘పాలకడలి’ అనే గ్రామం చుట్టూ అల్లబడిన రహస్యం ఏమిటి? అనే అంశాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ : దర్శకుడు నాగ శివ పూరీ జగన్నాథ్ స్కూల్ నుంచి రావడం వల్ల, కమర్షియల్ హంగులను ఎలా జోడించాలో అతనికి బాగా తెలుసు. ఒక డెబ్యూ డైరెక్టర్‌గా క్లిష్టమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎంచుకుని, దానికి సామాజిక అంశాన్ని జోడించిన తీరు అభినందనీయం. ఫస్ట్ హాఫ్ సీరియల్ కిల్లింగ్స్, ఇన్వెస్టిగేషన్ సీన్లతో గ్రిప్పింగ్‌గా సాగుతుంది. మెహబూబ్ బాషా కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు ఉపశమనాన్ని ఇస్తుంది.
సెకండ్ హాఫ్లో అసలు కథలోని ఎమోషన్స్ బయటపడతాయి. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు సినిమాకు కీలకంగా నిలిచాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉండి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ : టీవీ రంగంలో గుర్తింపు పొందిన అర్జున్, ఈ సినిమాతో తనలోని అసలైన నటుడిని బయటపెట్టాడు. PTSD బాధితుడిగా భయాన్ని, క్లైమాక్స్ యాక్షన్ సీన్లలో క్రోధాన్ని ప్రదర్శించి సినిమాను భుజాన వేసుకున్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ యాక్షన్ రోల్‌కు చక్కగా సరిపోయింది. ఇక లేడీ పోలీస్ ఆఫీసర్‌గా జెనిఫర్ హుందాగా నటించింది. కేవలం ఇన్వెస్టిగేషన్‌కే పరిమితం కాకుండా, గ్లామరస్ యాంగిల్‌లోనూ (చిన్ని చిన్ని తప్పులేవో సాంగ్) తన మార్కు చూపించింది. విలన్‌గా పిల్లా ప్రసాద్, పవర్ ఫుల్ రోల్‌లో అజయ్ రత్నం తమ అనుభవాన్ని వెండితెరపై కుమ్మరించారు.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే దేవ్ జాండ్ అందించిన సంగీతం సినిమాలోని మూడ్‌ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ సీన్లలో ఇంటెన్సిటీని పెంచింది. తక్కువ బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కథా గమనానికి అనుగుణంగా ఉన్నాయి.
ఫైనల్లీ: ‘పరమపద సోపానం’ కమర్షియల్ మాస్ ఆడియన్స్‌కు నచ్చొచ్చు…
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!