Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Mirai Movie Review Teja Sajja Super Yodhas

Mirai Review : మిరాయ్ రివ్యూ

Published Date :September 12, 2025 , 7:24 am
By Bhargav Chaganti
Mirai Review : మిరాయ్ రివ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 3.5 / 5

  • MAIN CAST: తేజ సజ్జ , రితిక నాయక్ , శ్రీయ , జగపతి బాబు తదితరులు
  • DIRECTOR: కార్తీక్ ఘట్టమనేని
  • MUSIC: హరిగౌర
  • PRODUCER: విశ్వప్రసాద్

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జ, వెంటనే వరుస సినిమాలు లైన్‌లో పెట్టి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, మిరాయ్ అనే ఒక సబ్జెక్టు ఎత్తుకున్న ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు. వాస్తవానికి, ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తేజ హీరోగా నటించగా, మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం, పదండి.

*మిరాయ్ కథ:*
ఇది ఒక తొమ్మిది గ్రంథాల చుట్టూ తిరిగే కథ. ఈ తొమ్మిది గ్రంథాలు ప్రపంచ పటంలో అనేక ప్రదేశాల్లో ఉంటాయి. ఉన్న ప్రతి చోట, ఆ గ్రంథాలకు రక్షణ కవచంలా శక్తులు ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారిని దాటుకుని ఒక్కో గ్రంథాన్ని చేజిక్కించుకుంటూ వస్తాడు మహావీర్ లామా (మంచు మనోజ్). అయితే, అమరత్వానికి సంబంధించిన తొమ్మిదవ గ్రంథాన్ని చేజిక్కించుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే, ఆ తొమ్మిదో గ్రంథానికి రక్షణ కవచమైన అంబిక (శ్రియా సరన్), మహావీర్ లామా నుంచి వచ్చే ముప్పును ఊహించి, తన బిడ్డ వేద (తేజ సజ్జ)ను అతనిని ఎదుర్కునే ఒక ఆయుధంలా పెంచుతుంది. చిన్నప్పుడే ఆమెకు దూరమైన వేదకు తాను అంబిక పుత్రుడిని ఎప్పుడు తెలిసింది? తాను పుట్టింది లామాను ఎదుర్కోవడానికి అనే విషయం ఎలా తెలుసుకున్నాడు? తెలుసుకున్న తర్వాత వేద సూపర్ యోధా ఎలా అయ్యాడు? చివరికి వేద లామాను ఎలా ఎదుర్కొన్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

Also Read

  • Honey Moon Express Review: హెబ్బా పటేల్ హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ
  • Attack Review: ఎటాక్ (హిందీ)
  • Mishan Impossible Review: మిషన్ ఇంపాజిబుల్
  • RRR Review : ఆర్ఆర్ఆర్

విశ్లేషణ:
ఈ మధ్య డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. అందులో తేజ హనుమాన్ ఏ మాత్రం మినహాయింపు కాదు. అయితే, హనుమాన్ కంటే ముందే మొదలు పెట్టామని చెబుతున్న ఈ సినిమా కథ కూడా దాదాపుగా డివోషనల్ ఎలిమెంట్స్‌తోనే కూడుకున్నది. కథలో చెప్పుకున్నట్టుగానే, 9 మహా గ్రంథాలను చేజిక్కించుకునేందుకు మహావీర్ లామా మొదలుపెట్టిన పోరాటాన్ని తేజ వేద నుంచి యోధాగా మారి ఎలా అడ్డుకున్నాడు అనేది సినిమా కథ. అయితే, యూత్ కనెక్టివిటీ కోసం తేజతో కొన్ని ఆసక్తికరమైన ఫైట్స్‌తో పాటు కామెడీ సీన్స్ కూడా రాసుకున్నాడు డైరెక్టర్. అవన్నీ బాగున్నాయి. తర్వాత మంచు మనోజ్ పాత్ర పరిచయం తర్వాత సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. మంచు మనోజ్ ఎంట్రీ తర్వాత కాసేపటికి ఒక యాక్షన్ బ్లాక్ లేదా ఆసక్తికరమైన ట్విస్ట్ ఇస్తూ సినిమా మీద మరింత ఆసక్తి పెంచేశారు. అయితే, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినట్లు ఫీల్ కలిగించినా, మిరాయి పవర్స్ అందుకున్న తర్వాత తేజ ఫైట్స్ భలే ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకపక్క దర్శకుడిగానే కాకుండా, మరోపక్క సినిమాటోగ్రాఫర్‌గా కూడా కార్తీక్ ఘట్టమనేని తనదైన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ రెండు బాధ్యతల కంటే ఎక్కువగా స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన ఆకట్టుకున్నాడు. కలింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి 9 గ్రంథాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ రక్షకులు అనే పాయింట్ దగ్గర కార్తీక్ ఘట్టమనేని ఫస్ట్ హాఫ్‌లో దాటేశాడు. తర్వాత విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు పెట్టుకున్న అది కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అయితే, సినిమాటోగ్రాఫర్‌గా మాత్రం ప్రతి ఫ్రేమ్‌లోనూ తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేశాడు కార్తీక్.

నటీనటులు: ఇక నటీనటుల విషయానికి వస్తే, హనుమాన్ తర్వాత మిరాయ్ తో మరోసారి తేజ రెండు భిన్న పార్శ్వాలు ఉన్న పాత్రలో మెరిసేడు. సాధారణంగా పవర్స్ వచ్చిన తర్వాత ఏవో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ పెట్టేస్తూ ఉంటారు దర్శకులు. కానీ, ఈ సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఒక రకంగా తేజ నటనలో చాలా పరిణతి కనిపించింది. ఇక మంచు మనోజ్ స్క్రీన్ టైం తక్కువే కానీ, తెరపై కనిపించిన ప్రతిసారి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశాడు. మనోజ్ లుక్‌తో పాటు స్టైల్ అదిరిపోయాయి. మనోజ్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంది. ఇక శ్రియాకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. రితికా నాయక్ పాత్ర హీరోయిన్‌గా మాత్రమే పరిమితమైంది. జగపతి బాబు, జైరామ్ వంటి వాళ్లు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీమ్: ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమా థియేటర్లలో ఒక మంచి విజువల్ ఫీస్ట్. ప్రేక్షకులకు ఒక ఎగ్జైటింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం ఆకట్టుకునేలాగా ఉండగా, నేపథ్య సంగీతం కరెక్ట్‌గా సెట్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి. కాకపోతే, నిడివి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి సినిమాలను కచ్చితంగా థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే.

ఫైనల్లీ, మిరాయ్ – మస్ట్ వాచ్ విజువల్ ఫీస్ట్ ఇన్ థియేటర్స్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • HanuMan follow-up film
  • Jagapathi Babu role
  • Karthik Gattamneni directorial
  • Manoj Manchu villain
  • Mirai movie review

తాజావార్తలు

  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!

  • IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..

  • Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions