Leader Movie Review: లెజెండ్ శరవణన్ లీడర్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: శరవణన్, పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య తదితరులు
- DIRECTOR: ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్
- MUSIC: జిబ్రాన్
- PRODUCER: లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్
తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడే ప్రముఖ వ్యాపారవేత్త ‘లెజెండ్’ శరవణన్, లెజెండ్ అనంతరం దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ‘లీడర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 3న విడుదలైంది. మరి ఈ సినిమా శరవణన్‌కు ఆశించిన విజయాన్ని అందించిందో లేదో సమీక్షలో చూద్దాం.
లీడర్ కథ:
శక్తివేల్ (శరవణన్) తూత్తుకూడి పోర్ట్ సమీపంలో కారు మెకానిక్‌గా పనిచేస్తూ తన కూతురు ప్రాణంగా బతుకుతుంటాడు. ఆ పాపకు వినికిడి లోపం ఉంటుంది. భార్య మీరా (పాయల్ రాజ్‌పుత్) చనిపోవడంతో కూతురే లోకంగా బతికే శక్తివేల్ జీవితంలోకి ఎస్సై ఇంద్రా సత్యమూర్తి (ఆండ్రియా) ప్రవేశిస్తుంది. పోర్టులో సాల్ట్ (ప్రభాకర్) చేసే అక్రమాలను అడ్డుకునే క్రమంలో శక్తివేల్ సాయం కోరుతుంది. అయితే, ఒకానొక దశలో శక్తివేల్ కూతురిని సాల్ట్ గ్యాంగ్ కిడ్నాప్ చేయడంతో, ఒక భారీ పేలుడు పదార్థాల కంటెయినర్‌ను పోలీసుల నుంచి దొంగిలించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు శక్తివేల్ మెకానిక్ మాత్రమేనా? అతనికి ’12 మెన్ స్క్వాడ్’ అనే రా ఏజెంట్లతో ఉన్న సంబంధం ఏంటి? తన భార్యను తనే ఎందుకు చంపాల్సి వచ్చింది? అంతర్జాతీయ ఉగ్రవాది డెవిల్ (సంతోష్ ప్రతాప్)కు శక్తివేల్‌కు ఉన్న శత్రుత్వం ఏంటి? అన్నదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ
ఇది తండ్రి-కూతురు ఎమోషన్‌తో లింక్ పెట్టి రాసుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్. దర్శకుడు దురై సెంథిల్ కుమార్ ఒక రొటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ, దాన్ని నడిపించిన స్క్రీన్‌ప్లే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా ప్రారంభంలో తండ్రీకూతుళ్ల బాండింగ్‌తో నెమ్మదిగా మొదలైనప్పటికీ, పోర్టులో జరిగే క్రైమ్ సీన్ల దగ్గర నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మరియు సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. హీరో గతం గురించి వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు బాగున్నాయి. అయితే, హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ అంతగా పండలేదు. కొన్ని చోట్ల లాజిక్‌కు అందని ట్విస్టులు ఉన్నప్పటికీ, యాక్షన్ ప్రియులకు మాత్రం ఈ సినిమా మంచి విందు భోజనంలా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే శరవణన్ గత సినిమాతో పోల్చితే నటనలో చాలా మెరుగుదల కనిపిస్తుంది. రా ఏజెంట్‌గా సీరియస్ లుక్‌లో సెటిల్డ్‌గా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో కష్టపడిన తీరు కనిపిస్తుంది. మీరా పాత్రలో పాయల్ ఉన్నంతసేపు తన గ్లామర్ మరియు నటనతో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్లుగా ఆండ్రియా, శ్యామ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ఆండ్రియా ఇన్వెస్టిగేషన్ సీన్లు బాగున్నాయి.విలన్‌గా ప్రభాకర్ తన నటనతో భయపెట్టగా, లాల్ తన అనుభవంతో మెప్పించారు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే ఈ సినిమాకు అసలైన టెక్నికల్ హీరో సంగీత దర్శకుడు జిబ్రాన్. తన నేపథ్య సంగీతంతో సాదాసీదా సన్నివేశాలను కూడా నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు. వెంకటేష్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
ఫైనల్ వర్డిక్ట్: ‘లీడర్’ ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్. స్పై థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?