I Hate Marriage Review: ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ, డాక్టర్ పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి, ప్రభావతి తదితరులు
- DIRECTOR: పరమేష్ రేణుకుంట్ల
- MUSIC: వరికుప్పల యాదగిరి
- PRODUCER: దయానంద్ మాడమ్, కార్తీక్ వెంపటి
ప్రేమ, పెళ్లి, బంధాల చుట్టూ తెలుగులో ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి తరం యువత ఆలోచనలు, సహజీవనం, వివాహ వ్యవస్థపై మారుతున్న దృక్పథాలను ప్రధానంగా తీసుకుని రూపొందిన చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’. ట్రైలర్‌లోని బోల్డ్ డైలాగ్స్, సెన్సార్ నుంచి వచ్చిన ‘A’ సర్టిఫికెట్ ఈ సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ యూత్‌ఫుల్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం.
‘ఐ హేట్ మ్యారేజ్’ కథ:
సినిమా దర్శకుడు కావాలనే బలమైన లక్ష్యంతో ఉండే రామ్ (సుగి విజయ్)కు ప్రేమ, పెళ్లి లాంటి బంధాలపై అస్సలు నమ్మకం ఉండదు. తల్లి ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా సున్నితంగా తిరస్కరిస్తుంటాడు. మరోవైపు హైదరాబాద్‌లోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే ముగ్గురు యువతుల ఆలోచనలు మూడు రకాలుగా ఉంటాయి. ఉద్యోగం చేస్తూ పెళ్లికి దూరంగా స్వేచ్ఛగా బతకాలనుకునే ఆధునిక అమ్మాయి మీనాక్షి (హారిక రాజేందర్), పల్లెటూరి నుంచి నగరానికి వచ్చి మోసపోయినా తన లక్ష్యం కోసం పోరాడే భారతి (సాహితి కృష్ణ), ఇక మూడో అమ్మాయి జాహ్నవి (జుప్సీ భద్ర). ప్రేమ, రొమాన్స్, సరదాలు బాయ్‌ఫ్రెండ్‌తో ఉండాలి కానీ, పెళ్లి మాత్రం తండ్రి చూపించిన అబ్బాయితోనే చేసుకోవాలనేది జాహ్నవి సిద్ధాంతం. ఈ క్రమంలో రామ్ వ్యక్తిత్వం నచ్చి, కొన్ని ప్రత్యేక షరతులతో అతనితో రిలేషన్లోకి అడుగుపెడుతుంది జాహ్నవి. వీరిద్దరి ప్రయాణాన్నే రామ్ సినిమా కథగా మలిచి ఓ నిర్మాతను ఒప్పిస్తాడు. అయితే సినిమా సెకండాఫ్ ఎలా ముగించాలనేది సస్పెన్స్‌గా మారుతుంది. కట్ చేస్తే.. రామ్ నిజంగానే జాహ్నవితో ప్రేమలో పడతాడు. మరి జాహ్నవి అతని ప్రేమను అంగీకరించిందా? అసలు రామ్‌కు ఆమె పెట్టిన కండీషన్స్ ఏంటి? కన్యత్వం, హైమెనోప్లాస్టీ, హాస్టల్ జీవితాల వెనుక ఉన్న చేదు నిజాలేంటి? చివరకు ఈ ముగ్గురు యువతుల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ:
రెగ్యులర్ లవ్ స్టోరీల ఫార్మాట్‌ను పక్కనపెట్టి, నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను ఎక్కడా మొహమాటం లేకుండా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల. వివాహ బంధంలో ఇరుక్కోకుండా సహజీవనం చేస్తూ స్వేచ్ఛగా బతకాలనుకునే ఆలోచనలను, అలాగే ఎన్నో ఆశలతో గ్రామాల నుంచి నగరాలకు వచ్చి హాస్టళ్లలో ఉండే యువతులు ఎలా తప్పుదారి పడుతున్నారు అనే అంశాలను చాలా బోల్డ్‌గా చర్చించారు. అదే సమయంలో అందరూ చెడిపోరని, బాధ్యతతో తమ లక్ష్యాల వైపు అడుగులు వేసేవారు కూడా ఉంటారని బ్యాలెన్స్ చేస్తూ చూపించిన తీరు మెచ్చుకోదగ్గది. కూతురి సంతోషం కోసం ఏదైనా చేసే తల్లిదండ్రులు, ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడానికి మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తారనే బలమైన ప్రశ్నను సంధించడం ఆలోచింపజేస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా హాస్టల్ వాతావరణం, ముగ్గురు అమ్మాయిల పాత్రల పరిచయం, రామ్-జాహ్నవిల స్నేహం, మధ్యలో పృథ్వీరాజ్ కామెడీ ట్రాక్‌తో సరదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో కథ రామ్-జాహ్నవిల ప్రేమకథపైకి, సామాజిక అంశాలపైకి మళ్లుతుంది. అయితే, కథాంశం పరంగా ఇంత ధైర్యంగా, వాస్తవికతకు దగ్గరగా ఆలోచించినప్పటికీ.. దానిని ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేగా మలచడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. మేకింగ్‌లో నాణ్యత లోపించడం, సన్నివేశాలు నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌గా మారాయి. కొన్నిచోట్ల డైలాగులు రొటీన్‌గా అనిపిస్తాయి, అక్కడక్కడా లాజిక్ మిస్ అయింది. ఎమోషన్స్, సహజత్వం మరింత బలంగా పండి ఉండి, క్లైమాక్స్‌ను ఇంకాస్త పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్ది ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. మేకింగ్‌లో చిన్నచిన్న లోపాలు, స్లో నేరేషన్ ఉన్నప్పటికీ.. ప్రేమ, పెళ్లి, కన్యత్వం విషయంలో నేటి యువత ఆలోచనలను మొహమాటం లేకుండా చర్చించిన చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాకు ప్రధాన బలం జాహ్నవి పాత్రలో నటించిన జుప్సీ భద్ర. ఆధునిక భావాలున్న నేటి తరం అమ్మాయిగా అటు గ్లామర్ పరంగానే కాకుండా, భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ చక్కటి పరిణతి చూపిస్తూ కథను తన భుజాలపై నడిపించింది. పెళ్లిని అసహ్యించుకునే కుర్రాడిగా, దర్శకుడు కావాలనే తపన ఉన్న రామ్ పాత్రలో సుగి విజయ్ తన పరిధి మేరకు బాగా నటించాడు. క్రమంగా ప్రేమలో పడే సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. బోల్డ్ మనస్తత్వం ఉన్న మీనాక్షిగా హారిక రాజేందర్, కష్టాలను ఎదుర్కొనే భారతిగా సాహితి కృష్ణ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హాస్టల్ వాచ్‌మెన్‌గా డాక్టర్ పృథ్వీరాజ్ తనదైన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించారు. రవివర్మ అడ్డూరి, ప్రభావతి తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ గురించే. ఆవుల వెంకటేష్ తన అనుభవాన్ని చూపిస్తూ, ఒక సీన్ నుంచి మరో సీన్‌కు చక్కని లింక్ కుదిర్చారు. అయితే కథనంలో వేగం ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. వరికుప్పల యాదగిరి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ‘దొంగ ముండా’ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ప్రవీణ్ ఇమ్మడి నేపథ్య సంగీతం పర్వాలేదనిపించినా, కొన్నిచోట్ల లౌడ్‌గా, టీవీ సీరియల్స్‌ను గుర్తుచేసేలా సాగింది. కెమెరా పనితనం ఓకే అనిపించినా, కొన్ని సన్నివేశాల్లో విజువల్స్‌లో రిచ్‌నెస్, క్వాలిటీ లోపించాయి. పరమేష్ రేణుకుంట్ల ఎంచుకున్న పాయింట్ బోల్డ్‌గా, కొత్తగా ఉన్నా, టేకింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
-
Lok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్!
-
Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
-
Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
-
Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!