Hyy Chikitha Review: హే చికీతా రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ తదితరులు
- DIRECTOR: ధనరాజ్ లెక్కల
- MUSIC: చరణ్ అర్జున్
- PRODUCER: ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి
అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి హీరో హీరోయిన్లుగా దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ హే చికీత. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది అన్నది ఓ సారి చూద్దాం
హే చికీత కథ:
నాగనూరు, లచ్చక్క పేట గ్రామాల నేపథ్యంతో సాగే పక్కా విలేజ్ డ్రామా ఇది. ఊర్లో చదువు సరిగ్గా అబ్బక, ముక్కు మీద కోపంతో రగిలిపోయే శివ (అభినవ్ మణికంఠ) వ్యవసాయమే జీవితంగా బతుకుతుంటాడు. అతనికి చిట్టి (దివిజ), పొట్టి (తన్మయ్ ఖుషి) అనే ఇద్దరు మరదళ్లు ఉంటారు. చిన్నప్పటి నుంచి శివ, చిట్టిల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ, ఊర్లో స్థిరమైన ఉద్యోగం ఉన్నవాడికే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చిట్టి తండ్రి భీష్మించుకు కూర్చుంటాడు. మరోవైపు వినాయక చవితి ఉత్సవాల ఊరేగింపులో స్థానిక రౌడీ గ్యాంగ్‌తో జరిగిన గొడవ శివ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కోపంలో ఒకరిని కత్తితో పొడవటంతో శివ జైలు పాలు కావాల్సి వస్తుంది. జైలు నుంచి తిరిగి వచ్చాక సమాజం నుంచి ఎదురైన మాటలు, మరదలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరగడం లాంటి పరిణామాలు అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టాయి? చదువు లేని వ్యవసాయదారుడిగా సమాజంలో చిన్నచూపు చూసిన మామ పంతాన్ని శివ ఎలా ఎదుర్కొన్నాడు? రెండు ఊళ్ల పంచాయితీగా మారిన ఈ ప్రేమకథ చివరకు ఎలా సుఖాంతమైంది? అనేదే ‘హే చికీతా’ కథ.
Also Read
విశ్లేషణ
సినిమా ప్రారంభం నెమ్మదిగా సాగినా, పల్లెటూరి వాతావరణాన్ని, కుర్రాళ్ల అల్లరిని సహజంగా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యారు. ప్రథమార్ధంలో బావామరదళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా, కుటుంబ సమేతంగా చూసేలా కథనాన్ని మలచడం విశేషం. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ కథలో మంచి ఉత్కంఠను నింపుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథ మరింత ఎమోషనల్ గా మారుతుంది. ముఖ్యంగా రైతు సేవలు, వ్యవసాయం ప్రాముఖ్యత అలానే రైతంటే సమాజంలో ఉన్న చులకన భావాన్ని ప్రశ్నించే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుడిని సంతృప్తిపరుస్తాయి. అయితే సినిమా కథ ఎందుకో కొంత రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఫస్టాఫ్ అంతా సెకండాఫ్ లో వచ్చే కథను ఎస్టాబ్లిష్ చేయడం కోసమే వాడుకున్నారు. నిడివి తక్కువ ఉండడం కొంతవరకు సినిమాకి ప్లస్ అయింది. అల్లరి చిల్లరగా తిరిగి నలుగురు కుర్రాళ్ళు బాధ్యతలు తెలుసుకొని చివరికి ఎలా ప్రయోజకులయ్యారు అనే ఆసక్తికరమైన లైన్ తో సినిమా రాసుకున్నా దానిని రాసుకున్నంత బాగా తెరమీదకు తీసుకొచ్చే విషయంలో తడపడ్డారు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే అభినవ్ మణికంఠ.’శివ’ పాత్రలో ఒదిగిపోయారు. పక్కంటి కుర్రాడిలాంటి లుక్స్‌తో, కోపంతో ఊగిపోయే యువకుడిగా, భావోద్వేగ సన్నివేశాల్లోనూ చక్కని అభినయాన్ని కనబరిచారు..చిట్టిగా దివిజ తన సంభాషణలతో, హావభావాలతో ఆకట్టుకోగా.. పొట్టి పాత్రలో తన్మయ్ కూడా ఆకట్టుకుంటుంది..దేవి ప్రసాద్ రాజన్న పాత్రలో నిలకడైన నటనను ప్రదర్శించగా, కల్లు మామ పాత్ర నవ్వులు పూయిస్తూనే చివర్లో కీలక మలుపు తిప్పుతుంది. హీరో స్నేహితులుగా నటించిన నటులంతా తమ పరిధి మేర బాగా చేశారు. సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే గరుడవేగ అంజి పల్లెటూరి అందాలను, గ్రామీణ నేపథ్యాన్ని ఎంతో నేచురల్‌గా కెమెరాలో బంధించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా విజువల్‌గా బాగుంది. చరణ్ అర్జున్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. ప్రేమకథకు, విషాద సన్నివేశాలకు తగినట్టుగా నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది..ధనరాజ్ లెక్కల.యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌కు, ‘రైతే రాజు’ అనే సామాజిక సందేశాన్ని జోడించి నేరేట్ చేసిన విధానం మెచ్చుకోదగ్గది. ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, అంజిలు రాజీ పడకుండా నిర్మించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్, కాస్ట్యూమ్స్ విలేజ్ అట్మాస్ఫియర్కు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్లీ ‘హే చికీతా’ వింటేజ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఇష్టపడేవారికి నచ్చొచ్చు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!