Ee Paata Korinavaru Movie Review: ఈ పాట కోరినవారు మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా, సన్నీ, గిరి తదితరులు
- DIRECTOR: చంద్రసిద్ధార్థ్
- MUSIC: జే రెక్స్
- PRODUCER: చంద్రసిద్ధార్థ్
తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో రూపొందిన చిత్రమిది. ‘ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా, ఆటగదరా శివా’ లాంటి విలక్షణమైన, అర్థవంతమైన సినిమాలు తీసిన చంద్ర సిద్ధార్థ్ ఈ ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’కి దర్శకత్వం వహించారు. హర్ష, అమైరా గోస్వామి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026 న థియేటర్లలోకి వచ్చింది. ‘ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ మ్యూజికల్ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
ఈ పాట కోరినవారు కథ:
సాగర్ (హర్ష) అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన తన అన్నయ్య శివాజీ (రవివర్మ) సంపాదించి పంపుతుంటే ఏపీలోని ఓ గెస్ట్ హౌస్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. అతన్ని చూసుకోవడానికి దాము (అశోక్ వర్ధన్), నీలి (రేఖా నిరోషా) అనే ఇద్దరు కేర్ టేకర్లు ఉంటారు. అయితే, సాగర్ జీవితం సజావుగా సాగుతున్న సమయంలో.. రోజూ రాత్రి 10.30 గంటలకు రేడియోలో ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి…’ అంటూ ఓ పాట ప్రసారమవుతూ అతన్ని కలవరపెడుతుంది. ఆ పాట విన్నప్పుడల్లా అతనికి భయం, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. తన చుట్టూ ఏదో అదృశ్య శక్తి తిరుగుతోందని అనుమానిస్తాడు. ఆ పాట వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి విజయవాడలోని రేడియో స్టేషన్‌కు వెళ్లిన సాగర్‌కు ఆర్జే కావేరి (ఇనాయా సుల్తానా) ఆ పాట వేయమని వచ్చిన పోస్ట్ కార్డులను చూపిస్తుంది. ఆ అడ్రస్ పట్టుకుని కాకినాడ సమీపంలోని తిమ్మాపూర్‌కు వెళ్లిన సాగర్‌కు రమ (అమైరా గోస్వామి) పరిచయమవుతుంది. అసలు ఆ మ్యూజికల్ బ్యాండ్ కు, సాగర్ కు ఉన్న సంబంధం ఏంటి? నందు (హర్ష) గతం ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూ మిగతా కథ సాగుతుంది.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
విశ్లేషణ
టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్, ఫస్ట్ హాఫ్‌ని ఆసక్తికరంగా నడిపించాడు. రేడియోలో వచ్చే ఆ పాట, సాగర్ భయపడటం వంటి అంశాలతో మంచి మిస్టరీని క్రియేట్ చేశాడు. సీనియర్ డైరెక్టర్ వంశీ తీసిన ‘అన్వేషణ, ఆలాపన’ సినిమాలను ఈ సినిమా ప్రథమార్ధం గుర్తుచేస్తుంది. ఒక థ్రిల్లింగ్ మూడ్ సెట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ ద్వితీయార్ధానికి వచ్చేసరికి సినిమా ట్రాక్ తప్పింది. మిస్టరీ నుంచి మ్యూజిక్ బ్యాండ్ సభ్యుల మధ్య ఉన్న స్నేహం, ప్రేమ, ఈర్ష్య, ద్వేషాల చుట్టూ రొటీన్ గా సాగుతుంది. హీరో తన గతాన్ని మరచిపోవడం, హీరోయిన్ దాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించడం లాంటి సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ కావు. పాత్రల మధ్య బలమైన భావోద్వేగాలు (ఎమోషనల్ డెప్త్) లేకపోవడం సినిమాకు ప్రధాన మైనస్. సెకండాఫ్ స్క్రీన్ ప్లేపై, లాజిక్స్‌పై దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.అయితే ఇది చంద్ర సిద్దార్థ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి చేసిన సినిమా. ఓటీటీలో ఇటువంటి సినిమాలకి మంచి రీచ్ ఉంటుంది. పొడవైన టైటిల్, ఆసక్తికరమైన మిస్టరీతో ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్న ‘ఈ పాట కోరినవారు..’.. సెకండాఫ్ కు వచ్చేసరికి లాజిక్ లేని నరేషన్ తో, వీక్ ఎమోషన్స్ తో నీరుగారిపోయింది. కానీ
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాతో హీరోగా పరిచయమైన హర్ష కు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అయితే ఎమోషనల్ సీన్స్‌లో తన నటనను మరింత మెరుగుపరుచుకోవాలి. హీరోయిన్ అమైరా గోస్వామి బ్యూటిఫుల్ గా కనిపించడమే కాకుండా, తన పాత్ర పరిధి మేర బాగా నటించింది. సుజనా రెడ్డి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. కేర్ టేకర్లుగా అశోక్ వర్ధన్, రేఖా నిరోషా, అన్నయ్య పాత్రలో రవివర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆర్జే కావేరిగా ఇనాయా సుల్తానా అతిథి పాత్రలో మెరిసింది.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ విభాగంలో జే రెక్స్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. థ్రిల్లర్ మూడ్‌ను తన బీజీఎంతో బాగా ఎలివేట్ చేశాడు. సామ్ సుప్రీత్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ, సెకండాఫ్‌లో కొన్నిచోట్ల ఫ్రేమ్స్ అంతగా ఆకట్టుకోవు. పులగం చిన్నారాయణ రాసిన డైలాగ్స్ సహజంగా, కథకు తగ్గట్లుగా ఉన్నాయి. చంద్ర సిద్ధార్థ్ అందించిన పాటల సాహిత్యం బాగుంది.
రొటీన్ సినిమాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ మ్యూజికల్ థ్రిల్లర్‌ను కోరుకునే వారికి, ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది!
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!