The Odyssey Movie Telugu Review: ది ఒడిస్సీ తెలుగు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Matt Damon, Tom Holland, Robert Pattinson, Lupita Nyong'o, Samantha Morton, Zendaya, and Charlize Theron.
- DIRECTOR: Christopher Nolan
- MUSIC: Ludwig Göransson
- PRODUCER: Emma Thomas, Christopher Nolan, Thomas Hayslip
హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోమర్ రాసిన అమరకావ్యం ఆధారంగా దాదాపు రూ. 2000 కోట్ల భారీ బడ్జెట్‌తో నోలన్ తెరకెక్కించిన విజువల్ ఎపిక్ ‘ది ఒడిస్సీ’ . మన దేశంలో ఒక రాజమౌళి సినిమాకో లేదా హాలీవుడ్ ‘అవతార్’ చిత్రానికో వచ్చే స్థాయి హైప్ ఈ సినిమాకు కూడా లభించింది. తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.
ది ఒడిస్సీ కథాంశం
ట్రోజన్ యుద్ధంలో ఘన విజయం సాధించిన తర్వాత ఇథాకా దేశపు రాజు ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) తన సైన్యంతో కలిసి స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతాడు. కానీ గ్రీకు దేవతల ఆగ్రహానికి గురికావడంతో అతని ప్రయాణం పదేళ్లపాటు అనేక ఆపదలతో, సుదీర్ఘ పోరాటంగా మారుతుంది. ఈ సముద్ర మార్గంలో ఒంటికన్ను రాక్షసుడు (సైక్లోప్స్), మంత్రగత్తె సిర్సీల నుంచి ఒడిస్సియస్ తన సైన్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? మరోవైపు భర్త ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంతో ఎదురుచూస్తూ, రాజ్యాన్ని ఆక్రమించాలనుకునే అంతర్గత శత్రువుల నుండి రాణి పెనెలోప్ తనను తాను, రాజ్యాన్ని ఎలా రక్షించుకుంది? చివరికి ఒడిస్సియస్ తన భార్యాపిల్లలను కలుసుకున్నాడా లేదా? అన్నదే ఈ సినిమా కథ.
Also Read
విశ్లేషణ
సాధారణంగా సైన్స్ ఫిక్షన్ జోనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నోలన్, ఈసారి ఒక పురాణ గాథను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన మార్క్ నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో వేర్వేరు టైమ్లైన్లలో కథను ఎంతో ఆసక్తికరంగా నడిపించాడనే చెప్పాలి. సినిమా మొదలైన మొదటి 20 నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ఆ తర్వాత ప్రేక్షకుడు ఆ మాయా ప్రపంచంలోకి పూర్తిగా వెళ్ళిపోతాడు. ముఖ్యంగా మంత్రగత్తె సిర్సీ సీన్లు ఒక హారర్ సినిమాను తలపిస్తాయి, ఇవి మన రామాయణంలోని మాయా లేడి ఘట్టాన్ని గుర్తుచేస్తాయి. సముద్రంలో వచ్చే సుడిగుండాల సీన్లు, కొండరాళ్ల మధ్య సాగే పోరాటాలు బాగున్నాయి. నోలన్ అంటే కేవలం క్లాస్ ప్రేక్షకులే కాదు, మాస్ ఆడియన్స్‌కు కూడా పూనకాలు తెప్పించగలరని ఈ సినిమా క్లైమాక్స్‌తో నిరూపించారు. రామాయణంలో శివధనస్సు విరిచే ఘట్టం లాంటి క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ బాగుంది. అయితే గ్రీకు కధలు, ట్రాజన్ వార్ గురించి తెలియని వారు అయోమయానికి గురికాక తప్పదు. కానీ నోలన్ మార్క్ సినిమా అనే ఫీల్ కలిగించింది. నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే మ్యాట్ డామన్ ఒడిస్సియస్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఒక యోధుడిగా, భార్యాపిల్లల కోసం తపించే భర్తగా, తండ్రిగా ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాణి పెనెలోప్ పాత్రలో ఆన్ హాత్వే నటన అద్భుతం. శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడుకునే ధీర వనితగా ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించారు. ఒడిస్సియస్ కొడుకుగా కీలకమైన పాత్రలో టామ్ హాలాండ్ నటించారు. తండ్రిని చూడకపోయినా ఆయన కథలు వింటూ పెరిగిన యువకుడిగా, తల్లిని కాపాడుకునే కొడుకుగా అద్భుతమైన ఎమోషన్స్ పండించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ‘యాంటినస్’ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ క్రూరత్వాన్ని బాగా పండించి మెప్పించగా, హిమేష్ పటేల్ కమాండర్ పాత్రలో తన పరిధి మేర బాగా చేశాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే కనుక సాంకేతికంగా ఈ సినిమా ఒక మంచి మూవీ. హోయ్టే వాన్ హోయ్టెమా ఐమాక్స్ కెమెరా విజువల్స్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో గ్రాండ్‌గా చూపించాయి. లుడ్విగ్ గోరాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లలో బాక్సులు బద్దలయ్యేలా ఉంటూ సినిమా మూడ్‌లోకి మనల్ని తీసుకెళ్తుంది. నోలన్ మార్క్ నాన్-లీనియర్ శైలిని ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకునేలా ఎడిటర్ జెన్నిఫర్ లేమ్ తన కత్తెరకు పదును పెట్టారు.
ఒక్కమాటలో చెప్పాలంటే నోలన్ మార్క్ తో సాగే గ్రీకు చందమామ కథ ‘ది ఒడిస్సీ’.(గ్రీకు నాలెడ్జ్ కంపల్సరీ)
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు