Brahmastra Movie Review: బ్రహ్మాస్త్ర పార్ట్ 1 – శివ రివ్యూ (హిందీ డబ్బింగ్)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, Nagarjuna Akkineni
- DIRECTOR: Ayan Mukerji
- MUSIC: Simon Franglen, Pritam
- PRODUCER: Karan Johar, Apoorva Mehta, Namit Malhotra, Ranbir Kapoor
‘బ్రహ్మాస్త్ర’ నుంచీ అందరిలోనూ ఆసక్తి కలిగించడానికి కారణం రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించడమే. పెళ్ళి కాకముందు రణబీర్ నటించిన ‘యే దిల్ హై ముస్కిల్’ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన అలియా, భర్తతో కలసి జోడీ కట్టిన తొలి సినిమాగా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1- శివ’ తెరకెక్కింది. ఒకటిన్నర నెల క్రితం వచ్చిన రణబీర్ ‘షంషేరా’ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దాంతో రణబీర్, ఆయన భార్య అలియా ఆశలన్నీ ‘బ్రహ్మాస్త్ర’పైనే ఉన్నాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్ వంటి వారు కూడా కనిపించడంతో పాటు దక్షిణాదిన రాజమౌళి భాగస్వామి కావడంతో ‘బ్రహ్మాస్త్ర’కు మరింత క్రేజ్ లభించిందని చెప్పవచ్చు. అలా వీరందరి అభిమానులు సైతం ‘బ్రహ్మాస్త్ర’ను చూడాలని ఆత్రుత పడ్డారు. వారందరి అభిలాష తీరుస్తూ ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
కథ విషయానికి వస్తే శివ అనేది ఒక వ్యక్తి తన స్వంత సూపర్ పవర్స్‌ని కనుగొనే కథ. శివ (రణబీర్ కపూర్) ముంబైలో డిజెగా పనిచేస్తుంటాడు. అనాథ అయిన తను కొంత మంది అనాథ పిల్లలతో ఉంటుంటాడు. అతను ఇషా (ఆలియా భట్)ని చూసిన వెంటనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతని పట్ల ఆకర్షితులవుతుంది. అయితే అతనికి అప్పుడప్పుడు మెరుపులుతో కూడిన కలలు వస్తుంటాయి. అందులో దుష్టురాలైన జునూన్ (మౌని రాయ్) మోహన్ భార్గవ్ (షారూఖ్ ఖాన్) అనే శాస్త్రవేత్తను చంపి బ్రహ్మాస్త్రలో ఓ భాగాన్ని తీసుకోవడం కనిపిస్తుంది. భార్గవ చనిపోబోయే ముందు బ్రహ్మాస్త్రలో ఇంకో భాగం వారణాసిలో ఉండే అనీష్ శెట్టి (నాగార్జున అక్కినేని) అనే ఆర్టిస్ట్‌తో ఉందని తనలో ఉన్న శక్తి ద్వారా చెప్పిస్తుంది జునూన్. ఇది కలలో చూసిన శివ అనీష్‌ని హెచ్చరించడానికి ఇషాతో కలసి వారణాసికి వెళతాడు. అక్కడ జునూన్ బారి నుంచి అనీష్‌ని తప్పించి అందరూ కలసి గురు (అమితాబ్ బచ్చన్) ఆశ్రమానికి బయలు దేరతారు. మార్గంలో అనీష్ జునూన్ బృందాన్ని ఎదుర్కొని శివ, ఇషాను గురు ఆశ్రమానికి పంపి ప్రాణాలు కోల్పోతాడు. ఆశ్రమం వద్దకు చేరుకున్న శివ, ఇషాను జునూన్ అనుచరుడు అడ్డగిస్తే తనలో తనకే తెలియకుండా ఉన్న అగ్ని శక్తిని ఉపయోగించి అతనిని నాశనం చేస్తాడు శివ. అసలు శివకు ఎందుకలా కలలు వస్తుంటాయి. శివ తల్లిదండ్రులు గురించి గురువు ఏం చెబుతాడు. దుష్టశక్తులను శివ బృందం ఎదిరించి గెలవగులుగుతుందా? వీటన్నింటికి సమాధానమే ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ వన్ శివ సినిమా.
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
‘బ్రహ్మాస్త్ర’ను చూస్తే ఖచ్చితంగా కొన్ని హాలీవుడ్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ‘అస్త్ర గురుకులం’ చూడగానే ‘ఎక్స్-మెన్’ ప్రొఫెసర్ బోధించే అంశాలే గుర్తుకు వస్తాయి. హారీ పాటర్ లోని డంబుల్ డోర్ కూడా గుర్తుకు రాకమానడు. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’లో మౌంట్ డూమ్ కు రింగ్ ను తీసుకుపోయే ఫ్రోడో సీన్ కూడా గుర్తుకు వస్తుంది. ఇలా మరికొన్ని హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెచ్చినా, ‘బ్రహ్మాస్త్ర’ కూడా విజువల్ ఫీస్ట్ గా నిలచిందనే చెప్పాలి. హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్ మాయాజాలం చేయగలమని ఇప్పటికే కొందరు భారతీయ దర్శకనిర్మాతలు చాటి చెప్పారు. ఆ కోవలో ‘బ్రహ్మాస్త్ర’ కూడా చేరుతుంది.
శివగా రణబీర్, ఇషాగా అలియా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయింది. అమితాబ్ బచ్చన్ గురువుగా తనదైన బాణీ పలికించారు. నాగార్జున పోషించిన పాత్ర నిడివి తక్కువ. ఇది ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఆరంభంలో షారుఖ్ ఖాన్ కాసేపు కనిపించటంతో జనం ఉత్సాహ పడ్డా ఆ పాత్రను చంపడంతో నీరసపడ్డారు. మౌనీ రాయ్ మాత్రం డార్క్ క్వీన్ గా అదరగొట్టింది. ఆమె పాత్రను చూస్తే మన తెలుగు చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’లోని మంచు లక్ష్మి పాత్ర గుర్తుకు రాకమానదు. డింపుల్ కపాడియా పాత్ర సినిమాకు వేస్ట్ అనే చెప్పాలి. ఇక దర్శకుడుగా అయాన్ ముఖర్జీ తన ప్రతిభను చాటుకున్నాడు. కథ ఎత్తుగడ బాగున్నా చెప్పే విధానం ఇంకా స్పీడ్ గా ఉంటే బాగుండేది. ప్రీతమ్ సంగీతంలో తెరకెక్కిన పాటలు వాటి చిత్రీకరణ ఆకట్టుకునేలా ఉన్నా తెలుగులో ఏ ఒక్కటి తిరగి పాడుకునేలా లేవు. సైమన్ నేపథ్య సంగీతం కథకు తగినట్టుగా ఉంది. సినిమాకు విఎఫ్ ఎక్స్ మాత్రం ప్రాణం పోశాయనే చెప్పాలి. అయితే ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం తేలిపోయింది. కథలో పలు లూప్ హోల్స్ ఉన్నాయి. సెకండ్ పార్ట్ గా రాబోయే ‘దేవా’లో చూపనున్న శివ తల్లిదండ్రులు ఎవరన్నది రివీల్ చేసి పార్ట్ వన్, టు అని కాకుండా మొత్తం కథ ఒకే సినిమాగా చెప్పి ఉంటే మరింత ఆసక్తి కరంగా ఉండేది. ఏది ఏమైనా పిల్లలకు కొంతలో కొంత నచ్చే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్:
– ఆకట్టుకునే విఎఫ్ ఎక్స్
– చిత్రంలోని భారీతనం
– పలువురు అగ్రనటుల కలయిక
– రణబీర్, అలియా జోడీ
మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– సాగదీసినట్టుగా ఉండటం
– మితిమీరిన గ్రాఫిక్స్
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: ‘బ్రహ్మాస్త్ర’ వ్యర్ధాస్త్ర
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..