Beast Movie Review : ఫీస్ట్ ఇవ్వని ‘బీస్ట్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Vijay, Pooja Hegde
- DIRECTOR: Nelson Dilipkumar
- MUSIC: Anirudh Ravichander
- PRODUCER: Kalanithi Maran
Beast Movie Review Rating: 2.25/ 5
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై అభిమానులను అలరించింది. తెలుగులో ఆశించిన స్థాయి విజయం సాధించపోయినా… ఫర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలో విజయ్ – నెల్సన్ దిలీప్ కుమార్ ఫస్ట్ కాంబోలో రూపుదిద్దుకున్న ‘బీస్ట్’ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. విశేషం ఏమంటే… ఇది విజయ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ!
Also Read
కథ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే… వీర రాఘవ (విజయ్) ‘రా’ ఏజెంట్. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్ట్ ఉమర్ అబ్దుల్లాను పట్టి తెచ్చే క్రమంలో వీర కారణంగా ఓ పాప చనిపోతోంది. దాంతో మనస్తాపం చెందిన అతను ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ పీడకల నుండి మామూలు మనిషి కావడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలో ఊహించని విధంగా అతని జీవితంలోకి ప్రీతి (పూజా హెగ్డే) అడుగుపెడుతుంది. తాను పనిచేసే సెక్యూరిటీ కంపెనీలో అతనికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆ పనిలో భాగంగా వారంతా ఈస్ట్ కోస్ట్ మాల్ కు వెళతారు. సరిగ్గా అదే సమయంలో కొందరు టెర్రరిస్టులు ఆ భవంతిని తమ చేతుల్లోకి తీసుకుంటారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అందులోని కస్టమర్లను చంపేస్తామని బెదిరిస్తారు. అదే మాల్ లో సెంట్రల్ మినిస్టర్ భార్య, కూతురు సైతం టెర్రరిస్టుల చేతుల్లో బందీలవుతారు. ఇటు ప్రభుత్వానికి, అటు టెర్రరిస్టులకు మధ్య మీడియేటర్ గా గతంలో ‘రా’లో పనిచేసిన అల్తాఫ్ హుస్సేన్ (సెల్వ రాఘవన్) ఎంట్రీ ఇస్తాడు. మాల్ లో ఉన్న మాజీ ‘రా’ ఆఫీసర్ వీర రాఘవ టెర్రరిస్టుల ఆగడాలు కట్టించాడా? హోమ్ మినిస్టర్ భార్య, కూతురు ఆ టైమ్ లో మాల్ లో ఎందుకు ఉన్నారు? అల్తాఫ్ మధ్యవర్తిత్వం ఫలించిందా? ఇదంతా మిగతా కథ.
దేశానికి హాని తలపెట్టే టెర్రరిస్టుల కార్యకలాపాలకు అడ్డు కట్ట వేసే హీరోల చిత్రాలు వివిధ భాషల్లో అనేకానేకం వచ్చాయి. ఇదీ అదే కథ. కాకపోతే… పొలిటీషియన్లు తమ స్వార్థం కోసం టెర్రిస్టులతోనే చేతులు కలిపితే ఏం జరుగుతుందనేది చూపించారు. గతంలో ఒకటి రెండు సందర్భాలలో ఇలాంటి సంఘటనలు ఈ దేశంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇదేదో అసాధ్యమైన అంశంగా మనం భావించాల్సిన అవసరం లేదు. అలానే రాజకీయ నేతలు ఎన్నికల కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, తమకు లబ్ది చేకూరుతుందని భావించినప్పుడు వాటికి ఎలా ఈల్డ్ అవుతారనేది ఇందులో ప్రధానంగా చూపించారు. హీరో పాక్ ఆక్రమిత కశ్మిర్ నుండి టెర్రరిస్టును తీసుకొచ్చి, తిరిగి అదే చోట అతన్ని అంతం చేయడంతో కథకు ఓ సంపూర్ణత లభించింది. అయితే షాపింగ్ మాల్ లో జరిగే కిడ్నాప్ డ్రామాలో టెన్షన్ కంటే ఎంటర్ టైన్ మెంట్ కే డైరెక్టర్ ప్రాధాన్యం ఇచ్చాడు. దాంతో తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్సుకతను ప్రేక్షకులు ఫీల్ కారు. ఇక సెంట్రల్ హోమ్ మినిస్టర్ పాత్ర అయితే మరీ కామెడీగా ఉంది. ఇది రెండున్నర గంటల పాటు సరదాగా చూసే సినిమానే కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఆడియెన్స్ మీద కలిగించదు.
సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ విజయ్ వన్ మ్యాన్ షోగానే సాగింది. అతని అభిమానులు ఎలాంటి యాక్షన్ సన్నివేశాలను ఎక్స్ పెక్ట్ చేస్తారో అదే ఇందులో ఉంది. దానికి అదనంగా కావలసినంత వినోదాన్ని దర్శకుడు నెల్సన్ అందించాడు. విశేషం ఏమంటే… నెల్సన్ కు ఇది మూడో చిత్రం. అతని ముందు రెండు చిత్రాలు ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’ కథాపరంగా సీరియస్ అంశాలను డీల్ చేసేవే. కానీ వాటిని నెల్సన్ కామెడీ ఎంటర్ టైనర్స్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఎంచుకున్న కథ, అందులోని అంశం సీరియస్ వే అయినా… బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను నెల్సన్ ఇందులో దట్టించాడు. అనువాద చిత్రాల రచయితగా చక్కని పేరు తెచ్చుకుంటున్న హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి తనదైన శైలిలో సంభాషణలు సమకూర్చాడు. డైలాగ్ రైటర్ గా అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నెల్సన్ – అనిరుధ్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అనిరుధ్ ఇటు విజయ్ తోనూ, అటు నెల్సన్ తోనూ చేసిన మూడో సినిమా ఇది. యువతను ఓ ఊపు ఊపేసిన ‘హలమిత్తి హబీబూ’ పాట హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే వచ్చేసింది. ఆ తర్వాత సినిమా చివరి వరకూ మరో పాట అనేది లేకపోవడం పెద్ద లోటు! రెండో పాట ‘జాలీ ఓ జింఖానా’ ఎండ్ టైటిల్ కార్డ్స్ సమయంలో వస్తుంది. దాంతో సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ తప్పితే, సాంగ్స్ పరంగా రిలీఫ్ లేకుండా పోయింది. దర్శకుడు దీనిపై దృష్టి పెట్టి ఉండాల్సింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది.
నటీనటుల విషయానికి వస్తే విజయ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. చాలా ఈజ్ తో చేసేశాడు. రెండు పాటల్లోనూ తనదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టాడు. దాదాపు పదేళ్ళ క్రితం పూజా హెగ్డే తమిళంలో ‘ముగమూడి’ సినిమాలో నటించింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆమె కోలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఉన్నా… ఆమె పాత్రకు పెద్దంత ప్రాధాన్యం అయితే లేదు. మిగిలిన పాత్రలలో చెప్పుకోవాల్సింది దర్శకుడు సెల్వరాఘవన్ గురించి. మీడియేటర్ పాత్రలో చాలా సహజ నటనను ప్రదర్శించాడు. నటుడిగా మొదటి చిత్రమైన ‘బీస్ట్’ విడుదల కాకుండానే, మరో రెండు మూడు చిత్రాల్లో సెల్వ రాఘవన్ నటిస్తుండటం విశేషం. ఇందులో ఇతర ప్రధాన పాత్రల్లో పృథ్వీ, యోగిబాబు, రెడిన్ కింగ్ స్లే, వీటీవీ గణేశ్, అపర్ణాదాస్, షైన్ టామ్ చాకో తదితరులు చేశారు. అందరూ పాత్రల పరిధి మేరకు నటించారు. కథలో కొత్తదనం లేకపోయినా ఎంటర్ టైన్ మెంట్ తో ఎలాగో నెట్టుకురావాలని నెల్సన్ ప్రయత్నించాడు. ప్రథమార్ధం ఆసక్తికరంగా ఉన్నా ద్వితీయార్ధంకు వచ్చేసరికీ సినిమా తేలిపోయింది. పైగా మెయిన్ కల్ ప్రిట్ ఎవరో తెలిసిపోయిన తర్వాత కిక్ పోయింది. వినోదాత్మక చిత్రాలను, విజయ్ సినిమాలను ఇష్టపడేవారికి ‘బీస్ట్’ నచ్చొచ్చు. అంతే!!
ప్లస్ పాయింట్స్:
- విజయ్ నటన
- యాక్షన్, ఎంటర్ టైన్మెంట్
- అనిరుధ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- కథలో కొత్తదనం లేకపోవడం
- పొలిటికల్ డ్రామా కావడం
Beast Movie Review Rating: 2.25/ 5
ట్యాగ్ లైన్: ఫీస్ట్ ఇవ్వని ‘బీస్ట్’!
తాజావార్తలు
-
Kotha Cinema: బొగ్గుబావి నుంచి టాలీవుడ్‌కి వంద మంది
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ ఎడముఖం.. పెడముఖం.. వీడియో వైరల్
-
Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
-
Trump–Ukraine: ఉక్రెయిన్‌కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..