Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Cinema Reviews Balagam Movie Review

Balagam Movie Review: బలగం రివ్యూ

Published Date :March 2, 2023 , 11:00 am
By Prasanna Pradeep
Balagam Movie Review: బలగం రివ్యూ
  • Follow Us :

Rating : 2.75 / 5

  • MAIN CAST: Priyadarshi, Kavya Kalyanram, Venu, Racha Ravi
  • DIRECTOR: Venu
  • MUSIC: Bheems Ceciroleo
  • PRODUCER: Harshith Reddy, Hanshitha Reddy

రివ్యూ: బలగం
నటీనటులు: ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, వేణు, రచ్చ రవి తదితరులు
సంగీతం: భీమ్స్ సెసిరోలియో
సినిమాటోగ్రఫి: ఆచార్య వేణు
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
దర్శకత్వం: వేణు యెల్దండి

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత, ఆయన సోదరుని కుమారుడు హర్షిత్ రెడ్డి కలసి నిర్మించిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. హాస్యనటుడు వేణు యెల్దండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యారు. పలు చిత్రాల ద్వారా నటునిగా మంచి గుర్తింపు సంపాదించిన ప్రియదర్శి ఇంతకు ముందు ‘మల్లేశం’ అనే బయోపిక్ లో హీరోగా నటించారు. దాని తరువాత ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఈ ‘బలగం’.

కథ ఏమిటంటే- కొమురయ్య అనే ముసలాయన ఊరిలో అందరితోనూ అన్యోన్యంగా ఉంటాడు. ఆయన మనవడు సాయిలు అప్పుచేసి ఊళ్లో పలు వ్యాపారాలు చేసి ఉంటాడు. ఏదీ అచ్చిరాదు. దాంతో కట్నంపైనే అతని ఆశలు. త్వరలో అతని పెళ్ళి అనగా అప్పుఇచ్చినవారు పెళ్ళికి ముందు రోజే అప్పులో పదిలక్షలు కట్టకపోతే, మా సంగతి తెలుసుకదా అని బెదిరిస్తారు. ‘వరపూజ’లో వచ్చే డబ్బుతో ఆ మొత్తం చెల్లించవచ్చని ఆశిస్తాడు సాయిలు. కానీ, ఆ ముందు రోజే కొమురయ్య కన్నుమూస్తాడు. ఆయన మరణంతో ఊరిలోని బంధుమిత్రాదులందరూ ఆయన శవంపై పడి ఆయనతో తమ అనుబంధాన్ని మననం చేసుకుంటారు. ఆయన కుటుంబంలోని ఇద్దరు కొడుకులు, వారి భార్యలు, ఎన్నో ఏళ్ళ నుంచీ ఇంటి ముఖం చూడని కూతురు, అల్లుడు, మనవరాలు అందరూ వస్తారు. ఆయన పిండాకూడును కాకి ముట్టదు. మూడో రోజు అలాగయితే, ఐదో రోజు అల్లుడు చేసిన దివసంలోనూ అదే తంతు. ఆ రెండు భోజనాలలో మితిమీరి తిన్న ఒక పెద్దాయన, అందరితో పాటు కొమురయ్య దివసంలో నుంచోని కాళ్ళు పట్టేసిన ఓ ఆవిడ, కొమురయ్య చావాలని తిట్టుకున్న ఓ దర్జీ కారణంగా వారిమీద ఆ ముసలాయన పట్టినాడని ఊరి జనం భావిస్తారు. అలా అనిపించడానికీ సాయిలు పథకరచన చేసి ఉంటాడు. పదకొండో రోజు పిండాకూడు పిట్ట ముట్టకుంటే ఊరి నుంచి వారిని వెలివేస్తామని పెద్దలు చెబుతారు. ముసలోడు చచ్చి తనకు ఇన్ని ఇబ్బందులు కలిగించాడని సాయిలు భావిస్తూ ఉంటాడు. అతని పెళ్ళి సంబంధం కూడా చెడిపోతుంది. దాంతో మేనత్త కూతురును లైన్ లో పెడితే, వారికి ఉన్న కోట్ల ఆస్తి ద్వారా తన అప్పు తీరుతుందని భావిస్తాడు. ఓ నాటి ముచ్చట గుర్తు చేసి, అతనికి, మరదలుకు మనువు ఖాయం చేసుకుంటాడు. తన స్వార్థం కోసం తాత చావును ఉపయోగించుకున్నానని పశ్చాత్తాపం చెందుతాడు. ఆ తరువాత ఏమయింది అన్నదే మిగిలిన కథ.

సెల్ ఫోన్స్ వాడుతున్న ఈ కాలంలోనూ తెలంగాణ మారుమూల పల్లెల్లోని మూఢనమ్మకాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు వేణు సఫలీకృతులయ్యారు. సినిమాలో పతాకసన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది. సెన్సిటివ్ గా ఉండేవారికి తప్పకుండా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అసలు ఈ కథను సినిమాగా తీయడానికి పూనుకున్న నిర్మాతలు హన్సిత, హర్షిత్ ను అభినందించాలి. ఎన్నో కమర్షియల్ సక్సెస్ లు చూసిన దిల్ రాజు తమ పిల్లలు, ఫార్ములాకు దూరంగా జరిగి, ఈ సినిమాను నిర్మించడం, వారికి దన్నుగా నిలచిన ఆయననూ అభినందించకుండా ఉండలేం. చిత్రం చూస్తోంటే, 2015లో కన్నడలో రూపొంది, పలు అవార్డులు సంపాదించిన ‘తిథి’ చిత్రం పలు మార్లు గుర్తుకు వస్తుంది. కాసర్ల శ్యామ్ సందర్భోచితంగా పాటలు పలికించారు. ఇందులోని నటీనటుల్లో చాలామంది అంతగా పరిచయం లేనివారే, అయితే దాదాపుగా అందరూ తమపాత్రల్లో జీవించారనే చెప్పాలి. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
– దిల్ రాజు ప్రొడక్షన్ కావడం
– నిర్మాతలు ఈ కథను ఎంచుకోవడం
– పతాక సన్నివేశాలు
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– సీన్స్ సాగదీసినట్టుగా ఉండడం

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: ‘బల’మైన సెంటిమెంట్ ‘గమ్’!

  • Tags
  • Balagam Movie Review
  • Bheems Ceciroleo
  • Dil Raju Productions
  • Director Venu
  • Hanshitha Reddy

WEB STORIES

అవకాశాల కోసం  విప్పి చూపిస్తున్న భామలు...

"అవకాశాల కోసం విప్పి చూపిస్తున్న భామలు..."

World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే..

"World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే.."

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

"పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.."

Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు

"Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు"

ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే..

"ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే.."

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్

"Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్"

Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

"Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.."

నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే..

"నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే.."

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే..

"ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే మీరు మానసిక ఒత్తడికి గురవుతున్నట్లే.."

RELATED ARTICLES

Venu, Abhay: ఈ కమెడియన్స్ డైరెక్టర్స్ గా సక్సెస్ సాధిస్తారా!?

Dil Raju Daughter Harshitha Reddy Exclusive Interview Live: దిల్ రాజు కొడుకు హన్షిత్ రెడ్డి, కూతురు హర్షిత రెడ్డి ఇంటర్వ్యూ

Comedy stock exchange : దిల్ సే నవ్వుకోండి దిల్ కు మంచిదంటున్న అనిల్ రావిపూడి!

Harikatha: ప్రియదర్శి ఆవిష్కరించిన ‘పిల్లా నీ చేతి గాజులు’ గీతం!

Priyadarshi: నల్లగా, హీరో కంటే పొడుగ్గావున్నావని రిజక్ట్ చేశారు

తాజావార్తలు

  • World Championships : అదరగొట్టిన అమ్మాయిలు.. ఫైనల్ కు నిఖత్, నీతూ, లవ్లీనా, స్వీటీ

  • Marriage Fraud: కోరుకున్న పెళ్లాం దొరికింది అనుకున్నాడు.. పెళ్లాయ్యాక కానీ అర్థం కాలేదు..

  • UK Parliament: “ఖలిస్తానీ పోకిరీల”పై చర్యలు తీసుకోవాలి.. యూకే పార్లమెంట్ లో ఎంపీల డిమాండ్..

  • Satyam Shivam Sundaram: జీనత్ అందాలపర్వం – ‘సత్యం శివం సుందరం’!

  • Kavya Thapar: ఏక్ మినీ కథ పాప.. సైజ్ తో పనేం లేదు

ట్రెండింగ్‌

  • Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

  • Most Valuable Celebrity: బ్రాండ్ వాల్యూ సెలబ్రెటీ.. కోహ్లీని దాటేసిన బాలీవుడ్ స్టార్

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions