Bakasura Restaurant Movie Review: బకాసుర రెస్టారెంట్ మూవీ రివ్యూ!
- కమెడియన్ ప్రవీణ్ హీరోగా నటించిన కొత్త హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 8న విడుదల!
- వైవా హర్ష టైటిల్ రోల్‌లో బకాసుర రెస్టారెంట్
- ఎస్‌జే శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Praveen, Harsha Chemudu, Garuda Ram
- DIRECTOR: SJ Shiva
- MUSIC: Vikas Badisa
- PRODUCER: Janardhan Achari, Lakshmaiah Achari
కమెడియన్ ప్రవీణ్ ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో బకాసుర రెస్టారెంట్ అనే ఒక సినిమా రూపొందించారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచి ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు వైవాహర్ష టైటిల్ రోల్ అని చెప్పడంతో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఎదురు చూశారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇది హంగర్ కామెడీ అనే కొత్త జానర్‌తో రాబోతోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకందా? లేదా? సినిమా అసలు ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
బకాసుర రెస్టారెంట్ కథ:
పరమేష్ (కమెడియన్ ప్రవీణ్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నిజానికి అతనికి ఒక హోటల్ పెట్టి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఇష్టం లేకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. పరమేష్ ఇద్దరు అనాధ కుర్రాళ్లను తానే పోషిస్తూ ఉంటాడు. ఇక ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు కూడా అదే బ్యాచిలర్ రూంలో ఉంటారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరందరూ కలిసి ఒక ఘోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానల్ మొదలు పెడతారు. అందులో భాగంగా ఒక బంగ్లాకి వెళ్ళినప్పుడు ఒక చేతబడికి సంబంధించిన పుస్తకం దొరుకుతుంది. అందులో ప్రయోగాలు చేస్తుండగా 200 ఏళ్ల క్రితం చనిపోయిన బక్క సూరి అలియాస్ బకాసురుడు (వైవాహర్ష) ఆత్మ నిద్రలేస్తుంది. ఒక చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన అంజి (షైనింగ్ ఫణి) శరీరంలో దూరుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అంజి శరీరం నుంచి బకాసురుడి ఆత్మ బయటకు వచ్చిందా? లేదా? ప్రవీణ్ తాను స్టార్ట్ చేయాలనుకున్న రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాడా? చివరికి ఏం జరిగింది అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
విశ్లేషణ:
ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాని మాత్రం కాస్త జానర్ మార్చి, హారర్ కామెడీ అనకుండా హంగర్ కామెడీ చేశాడు దర్శకుడు. సినిమా ఓపెనింగ్‌తోనే అసలు ఏం జరగబోతోంది అనే విషయం ఈజీగా అర్థమయిపోయేలా చాలా సరళంగా రాసుకున్నాడు. స్క్రీన్‌ప్లేతో కూడా పెద్దగా మ్యాజిక్ చేయాలి అనే ప్రయత్నం చేయకుండా, సూటిగా చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ని చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ముందుగా క్యారెక్టర్‌లను పరిచయం చేసి కథలోకి చాలా త్వరగానే తీసుకువెళ్లాడు. అయినా సరే, ఎందుకో ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ అనిపించిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు కథలోకి వెళ్ళిపోతున్నాం అనే సమయానికి విరామం వస్తుంది. ఇక ఆ తర్వాత మాత్రం కథను వేగంగా నడిపించాడు. అలా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించినా, సెకండ్ హాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఉప్పల్ బాలు బ్యాచ్ ట్రాక్ కొంత వర్కౌట్ అయింది, అయితే అది కొంతమందికి క్రింజ్ అనిపించొచ్చు కూడా. అయితే, డైరెక్టర్ పురాణాల మీద పెద్దలు చెప్పే మాటల మీద చాలా రీసెర్చ్ చేసి ఈ సినిమా కథ రాసుకున్నాడు అనిపించింది. కథగా బాగున్నా, ఎగ్జిక్యూషన్ విషయంలో కొంచెం తడబడ్డాడు. బహుశా దర్శకుడికి ఇది మొదటి సినిమా కావడంతో అలా జరిగి ఉండొచ్చు.
నటీనటుల విషయానికొస్తే:
ప్రవీణ్ ఎప్పటిలాగే తనదైన శైలిలో నటించాడు. ఒకరకంగా సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని నడిపించాడు. అతని తర్వాత అంతలా నటించే స్కోప్ ఉన్న పాత్ర షైనింగ్ ఫణికి దక్కింది. వైవా హర్ష కనిపించే అంతసేపు ఆకట్టుకున్నాడు. అలాగే మిగతా పాత్రలలో నటించిన కుర్రాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సినిమాలో మిగతా పాత్రధారులు అందరూ పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే, వికాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇరగదీశాడు. పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక స్టార్ హీరో సినిమాకి కొట్టినట్టు కొట్టాడు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిడివి ఇంకాస్త తగ్గించొచ్చు.
ఫైనల్‌గా: ఈ బకాసుర రెస్టారెంట్లో ఓసారి ఈ రుచి చూడొచ్చు.
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!