NTV Telugu Site icon

105 Minutes Movie Review: 105 మినిట్స్ మూవీ రివ్యూ

105 Minutes Movie Review: ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్గా అనేక సినిమాలు చేసిన హన్సిక ఇప్పుడు మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్, లేడీ ఓరియంటెడ్ అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగా ఆమె 105 మినిట్స్ అనే సినిమాతో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సింగల్ షాట్ మూవీగా సింగిల్ క్యారెక్టర్ తో ఈ సినిమాను తెరకెక్కించడంతో ఒక రకంగా దీన్ని ప్రయోగాత్మక సినిమా అని చెప్పొచ్చు. మరి ఈ ప్రయోగాత్మక సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం.

Also Read: NTR: దేవర ఔట్? రిలీజ్ కి రెడీ అవుతున్న రౌడీ…

కథః
ఈ సినిమా మొత్తం జాను(హన్సిక) పాత్ర చుట్టూ సాగుతుంది. ఇందులో ఆమె తప్ప మరే పాత్ర ఉండదు. జాను ఏదో పని మీద బయటకు వెళ్లి ఇంటికి వస్తుంది. ఇంట్లోకి రాగానే ఏదో అదృశ్య శక్తి ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాసేపటికి ఆమె పిల్లర్‌కి ఇనుప గొలుసుతో బంధించబడి ఉంటుంది. అసలు ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎవరు చేశారో తెలియదు కానీ కొన్ని భయానక శబ్దాలతో పాటు ఆమెను భయపెట్టేలా ఒక వాయిస్ వినిపిస్తుంటుంది, ఆమెను కొన్ని పనులు చేయమని ప్రలోభ పెడుతూ ఉంటుంది. ఆ వాయిస్ ఎవరిదో ఆమెకు తెలియదు.ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లర్‌ నుంచి గొలుసులను తెంపుకొని తప్పించుకుంటుంది. కానీ గొలుసును మాత్రం ఆమె ఎంత తప్పించాలన్న అది ఆమె కాలి నుండి తప్పుకోదు. మేల్‌ వాయిస్‌ మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమని, అందుకే ఇదంతా అనుభవించాలంటూ చెబుతూ ఉండడంతో ఆమె బాగా భయపడిపోతుంది. ఇలాంటి పరిస్థితి నుంచి జాను బయటపడిందా? జాను ఆ పరిస్థితి నుంచి బయట పడడానికి ఏం చేసింది? ఆ మేల్‌ వాయిస్‌ ఎవరిది? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.

Also Read: Raviteja: సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది… డైరెక్టర్ మాంత్రికుడేనా?

విశ్లేషణ:
ఈ మధ్యకాలంలో అన్ని కమర్షియల్ సినిమాలు , రొటీన్ డ్రామాలు తప్ప ప్రయోగాత్మక సినిమాలు చాలా తక్కువ అయ్యాయి. ఒకరకంగా మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమా తర్వాత ఆ స్థాయిలో ప్రయోగాత్మ సినిమాలు రాలేదు. ముఖ్యంగా స్టార్ క్యాస్ట్ తో అసలు రాలేదు.
సింగిల్‌ షాట్‌ తో సినిమా తీయడం, అది కూడా రెండు గంటలు గ్యాప్‌ లేకుండా తీయడమంటే అది పెద్ద సాహసం. ఇలాంటి ఆలోచన వచ్చిన మేకర్స్ కి, కథ ఒప్పుకున్న హీరోయిన్ కి హ్యాట్సాఫ్‌. ఇక. ఇలాంటి సినిమాని నిర్మించాలంటే ధైర్యంతో పాటు అభిరుచి కూడా ఉండాలి. అయితే ఇలాంటి సినిమాని కన్విన్సింగ్‌గా, ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసేలా చేయడం చాలా కష్టం. ఆ విషయంలో 105 మినిట్స్ మూవీ డైరెక్టర్ రాజు దుస్సాని కాస్త అభినందించాల్సిందే. ఆయన పడ్డ కష్టం ఏంటో ఈ మూవీలో కనిపిస్తుంది కానీ అది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదు అనిపించింది. గుర్తుతెలియని ఒక శక్తి హీరోయిన్‌ హన్సికని బంధించి ఆమెను భయపెడుతుంది. బయటకు వెళ్లనివ్వదు, కూర్చోనివ్వధు, నిలబడ నివ్వదు అలాగే ఇంట్లో ఉండనివ్వదు, ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ఎంగేజింగ్‌గాఆడియెన్స్ దృష్టి పక్కకు వెళ్లకుండా తీయాలి. ఈ మేకర్స్ ఆ విషయంలో చాలా శ్రమించారని సినిమా చూస్తే అర్ధం అవుతుంది. అయితే బీజీఎం బాగా వర్కౌట్‌ కావడంతో ఆడియెన్స్ లోనూ ఆ ఉత్కంఠని, భయాన్ని సస్టెయిన్‌ చేస్తూ సినిమాని కొనసాగించడంలో కొంతవరకు యూజ్ అయింది. హీరోయిన్‌ హన్సిక సినిమా అంతా ఏడుస్తూనే ఉంటుంది? అది బోర్‌ కొట్టేస్తుంది. సినిమాలో ఎంత సేపు ఆమె ఎలా బయటపడాలి అని ప్రయత్నిస్తున్నట్టు చూపించారు, కానీ ఎలా ఎదుర్కోవాలనేది సరిగా చూపించలేకపోయారనిపించింది.. క్లైమాక్స్ కన్విన్సింగ్‌గా లేదు సరికదా తేలిపోయినట్టు ఉంది. కానీ ఫినిషింగ్ బాగుంది. ఇంతా చేసి అసలు హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది, ఇంట్లో ఉన్న శక్తి ఉద్దేశ్యం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారనేది క్లారిటీగా చెప్పలేదు. ఆ విషయాల్లో క్లారిటీ ఇచ్చి బలమైన అంశాన్ని చెబితే బాగుండేది కానీ అదే మిస్ అయింది.

టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి కెమెరా వర్క్ ప్రాణం, ఆ విషయంలో కిషోర్‌ బీ కెమెరామెన్‌ గా అదరగొట్టాడు. ఈ సినిమా మొత్తం ఒక ఇంట్లోనే సాగుతుంది. చాలా పెద్ద రిస్క్ తో కూడిన ప్రయోగం కావడంతో ఆ పాత్ర కాకుండా వేరే పాత్రలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా సింగిల్‌ షాట్‌ అనేదానికి అర్థం లేదు.

ఫైనల్గా అనేక సవాళ్ల మధ్య వచ్చిన 105 మినిట్స్ మూవీ ఒక మంచి ప్రయత్నం.

Show comments