Site icon NTV Telugu

VIGNAN MAHOTSAV 2026: ప్రతిభకు గుర్తింపు ఇచ్చే జాతీయ యువజనోత్సవం.. యువతకు లక్కీ ఛాన్స్‌

Vignan Mahotsav 2026

Vignan Mahotsav 2026

VIGNAN MAHOTSAV 2026: కళ, క్రీడలు, సృజనాత్మకత అన్నింటినీ ఒకే వేదికపై ఏకతాటిపై నిలిపే జాతీయ స్థాయి యువజనోత్సవం VIGNAN MAHOTSAV – 19వ ఎడిషన్ మరోసారి యువతను ఆహ్వానిస్తోంది. For Eternal Harmony అనే సందేశంతో ఈ మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిభకు హద్దులు లేవని చాటే వేదికగా ఈ మహోత్సవం నిలవనుంది. దేశం నలుమూలల నుంచి వచ్చే యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇక్కడ 80కి పైగా క్రీడలు, నైపుణ్యాలను వెలికి తీసే పోటీలు ఉన్నాయి. ఈవెంట్స్‌లో Performing Arts, Visual Arts, Literary Events, Gaming & Multimedia, Robo Games వంటి సృజనాత్మక విభాగాలతో పాటు Sports, Track & Field, Para Sports వంటి క్రీడా విభాగాలు ఉండటం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కళాకారులు, క్రీడాకారులు, రచయితలు, సాంకేతిక నిపుణులు అందరికీ తమ తమ కలలను సాకారం చేసుకునే వేదికగా ఈ ఈవెంట్ నిలుస్తోంది.

READ MORE: Thiruveer : నిర్మాతల మాయమాటలు నమ్మి మోసపోతున్నాను: తిరువీర్ ఆవేదన.

ఇక్కడ ప్రతి పోటీ ఒక సవాల్ కాదు, ఒక ప్రేరణగా ఉండనుంది. ప్రతి అడుగు గెలుపు వైపునకు నడిపించే అనుభవంగా మారనుంది. ఈ ఈవెంట్లో ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు మిగులుతాయి. అంతేకాదు, ప్రతిభకు తగిన గుర్తింపుగా రూ.15 లక్షల వరకు క్యాష్ ప్రైజెస్ అందించనున్నారు. ఈ ప్రైజెస్ యువత టాలెంట్‌కు గౌరవంగా ఇస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు VIGNAN’S University ఈ పోటీలు జరగనున్నాయి. మీలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపించాలని అనుకునే వారికి.. మీ సత్తాను ప్రదర్శించేందుకు సరైన వేదిక కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇప్పుడే రిజిస్టర్ చేసి ఈ జాతీయ స్థాయి యువజనోత్సవంలో భాగమవ్వండి. VIGNAN MAHOTSAV 2026 మీ ప్రతిభ.. మా వేదిక.. మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

READ MORE: Instant Ragi Dosa Recipe: పది నిమిషాల్లో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఇన్‌స్టంట్ రాగి దోశ ఎలా చేయాలో తెలుసా?

Exit mobile version