Sri Sri Holistic Hospitals: కేవలం 860 గ్రాముల బరువుతో జన్మించిన పసికందును రక్షించిన శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన విజయం సాధించింది. కేవలం 28 వారాల గర్భధారణకే 860 గ్రాముల బరువుతో జన్మించిన పసికందును విజయవంతంగా చికిత్స చేసి, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసింది. SSHH నిజాంపేట్‌లో ఎమర్జెన్సీ రూంలో పుట్టిన పసికందును, అత్యంత క్లిష్ట పరిస్థితిలోనే మొదటి రోజే SSHH కొండాపూర్‌కి తరలించారు.
ఆసుపత్రిలో చేరినప్పుడు పసికందుకు తీవ్రమైన ఇన్ఫెక్షన్, షాక్, శ్వాసకోశ వైఫల్యం వంటి సమస్యలు ఉండటంతో వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైంది. పసికందును ఇన్క్యుబేటర్‌లో ఉంచి అత్యవసర వైద్య సంరక్షణ అందించారు. ఆధునిక యాంటీబయాటిక్స్, ఊపిరితిత్తుల కోసం సర్ఫాక్టంట్ థెరపీ, గుండె స్థిరీకరణ కోసం మందులు వాడటం ద్వారా పసికందు పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. మెకానికల్ వెంటిలేషన్ నుంచి మొదలుకొని, నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ (NIV), ఆపై హై-ఫ్లో నాజల్ కాన్యులా (HFNC), చివరికి సహజ శ్వాస (రూం ఎయిర్) వరకు దశలవారీగా తగ్గించారు.
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
ఆసుపత్రి ఉన్నంత కాలంలో మూడు సార్లు పసికందుకు జాండిస్ వచ్చింది. కానీ సమయానికి ఇంటెన్సివ్ ఫోటోథెరపీ ఇవ్వడం ద్వారా పూర్తిగా కోలుకుంది. ముఖ్యంగా, బ్రాంకోపల్మనరీ డిస్‌ప్లాసియా, నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్ (NEC), ఇంట్రా వెన్‌ట్రిక్యులర్ హీమరేజ్ (IVH) వంటి పెద్ద సమస్యలు ఏవీ రాలేదు.
50 రోజులపాటు NICU సంరక్షణ అనంతరం, పసికందు 1.57 కిలోల బరువుతో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యింది. తల్లి కంగారూ మదర్ కేర్ (KMC), పలడై ఫీడింగ్, ఇంటి సంరక్షణ పద్ధతులపై శిక్షణ పొందింది.
ఈ పసికందు SSHH సిబ్బందిలో ఒకరికి మనవడు/మనవరాలు. ఆర్థికంగా భరించలేని కారణంగా, తక్కువ ఖర్చుతోనే ఆసుపత్రి నిర్వహణ మరియు వైద్య బృందం అండగా నిలిచాయి. పిల్లల వైద్యులు, నయోనటాలజీ టీమ్ కృషితో, ఆసుపత్రి మేనేజ్‌మెంట్ సహకారంతో పసికందు ప్రాణం దక్కింది.
ఈ సందర్భంగా పిల్లల వైద్య బృందం ఇలా పేర్కొంది:
“సమయానికి సరైన చికిత్స, నిపుణుల కృషి, కరుణతో కూడిన వైద్య సంరక్షణ ఉంటే అతి చిన్న పసికందులు కూడా ఆరోగ్యంగా బతికి బట్టకాగలరు. ఇది మా ఆసుపత్రి యొక్క హోలిస్టిక్ వైద్య విధానానికి నిదర్శనం.”
శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ మేనేజ్‌మెంట్ మాట్లాడుతూ, సమాజానికి అందుబాటులో ఉండేలా అధునాతన వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించడం, సిబ్బంది కుటుంబాలు సహా ప్రతి ఒక్కరికీ వైద్యానికి మించిన సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!