NTV Telugu Site icon

Rainbow Hospital CSR Activity: ప్రభుత్వాసుపత్రులకు రెయిన్ బో చేయూత

Rainbow

Rainbow

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్‌లను శుభ్రంగా మరియు స్టెరిలైజ్ గా ఉంచడానికి అవసరమైన పరికరాలను విరాళంగా ఇచ్చింది రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్. రెయిన్‌బో తన CSR ప్రణాళికల్లో భాగంగా తెలంగాణల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 1.2 కోట్ల విలువైన 100 ఎయిర్ పెట్రీ శాంపిలింగ్ సిస్టం LA637 లను అందించడం జరిగింది. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తన CSR యాక్టివిటీ కింద తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 1.2 కోట్ల విలువగల 100 ఎయిర్ పెట్రీ శాంప్లింగ్ సిస్టమ్‌లను అందించింది. ఈ ఆటోమేటిక్ మరియు అధునాతన పరికరాలు, గాలిలోని బ్యాక్టీరియా మరియు ఫంగస్ ని కనిపెట్టడానికి సహాయపడతాయి.ఎయిర్ పెట్రీ శాంప్లింగ్ సిస్టమ్ LA637 అనేది పూర్తిగా ఆటోమేటిక్ & యూజర్ ఫ్రెండ్లీ పరికరం అవ్వడం చెప్పుకోదగ్గ విషయం.

దీని గురించి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మరియు ఆర్థిక శాఖల గౌరవనీయ మంత్రి టి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందన్నారు. హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ పెట్రి శాంప్లింగ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు సహకారం అందిస్తున్నందుకు, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు ధన్యవాదాలు తెలిపారు. సర్జికల్ మరియు పోస్ట్-ఆపరేటివ్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది చాలా సహాయపడుతుందని మెచ్చుకున్నారు.

మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. కె రమేష్ రెడ్డి రెయిన్‌బో యొక్క CSR కార్యాచరణ గురించి మాట్లాడుతూ, “పోస్ట్-ఆపరేటివ్ ఇన్‌ఫెక్షన్, మొత్తం ఇన్‌ఫెక్షన్లలో మూడవ వంతు ఉందని అధ్యయనాలు రుజువు చేశాయి. అయితే వీటిని నివారించడానికి, ఈ ఎయిర్ పెట్రీ శాంప్లర్‌ల ద్వారా గాలిలో బ్యాక్టీరియా మరియు ఫంగస్‌ 13 రెట్లు తగ్గించడం సాధ్యపడుతుంది.” డా రమేష్ కంచర్ల గారి నుండి ఎయిర్ పెట్రి శాంప్లింగ్స్ అందుకుంటూ, హోం శాఖా మంత్రి శ్రీ మహ్మూద్ ఆలి మాట్లాడుతూ,”ఈ ఎయిర్ పెట్రి శాంప్లర్స్ ఆపరేషన్ థియేటర్లలో సర్జరీ కి ముందే బాక్టీరియా మరియు ఫంగస్ యొక్క ఉనికిని కనుగొనడంలో చాలా సందర్భాలలో ప్రాణంతకమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది” అని తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలోని ఓటీలలో గాలిని మైక్రోబయోలాజికల్ మానిటరింగ్ చెయ్యడం అనేది, అంటువ్యాధుల నివారణలో ఒక చురుకైన విధానం. అంతే కాకుండా ఇది రోగి ని ఎన్నో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది.” అని తెలిపారు.

ఆరోగ్య మరియు ఆర్థిక శఖా మంత్రి శ్రీ టి హరీష్ రావు తరఫున తెలంగాణా రాష్ట్ర హోం శఖా మంత్రి శ్రీ మహ్మూద్ ఆలీ డా రమేష్ కంచర్ల వద్ద నుంది ఎయిర్ పెట్రీ శాంప్లింగ్స్ ను అందుకున్నారు. కమిషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, శ్రీమతి శ్వేత మొహంతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం డాక్టర్ ప్రశాంత్, గ్రూప్ క్లినికల్ డైరెక్టర్, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్: 99591-15050కి కాల్ చేయండి.

Read Also: Supreme Court Relief For Jagan Govt LIVE: రాజధాని కేసులో జగన్ సర్కార్ కి సుప్రీం ఊరట