NTV Telugu Site icon

Apollo Dialysis Clinics: అపోలో డయాలసిస్ క్లినిక్స్ సమాజ సేవలో ముందడుగు

Appolo

Appolo

Apollo Dialysis Clinics: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట వికలాంగుల సేవా సంస్థలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పేద, అవసరమైన వారికి ఉచిత క్రియాటినిన్ పరీక్షలు అందించడంతో పాటు పోషకాహార భోజనం పంపిణీ చేయబడింది. ఈ ప్రోగ్రాంలో అపోలో డయాలసిస్ క్లినిక్స్ వైద్య నిపుణులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొని.. మూత్రపిండ ఆరోగ్యం, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD) ప్రమాదాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పుల గురించి అవగాహన కల్పించారు.

Read Also: Balochistan: “జిన్నా” చేసిన మోసం.. ఇప్పటికీ రగులుతున్న బలూచిస్తాన్..

ఈ సందర్భంగా అపోలో డయాలసిస్ క్లినిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర రావు మాట్లాడుతూ.. మేము అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని విశ్వసిస్తున్నాం.. ఈ సేవా కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు అవసరమైన మూత్రపిండ ఆరోగ్య పరీక్షలు, పోషకాహారాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ముందుగా కిడ్నీ వ్యాధిని గుర్తించడం చాలా అవసరం.. ఈ పరీక్షల ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు.

Read Also: Mohan Babu – Soundarya: మోహన్ బాబు తప్పేం లేదు.. సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు

ఇక, ఈ కార్యక్రమంలో 5,000 మందికి పైగా ఉచిత మూత్రపిండాల పరీక్షలు నిర్వహించబడగా.. ప్రజలు తమ ఆరోగ్య స్థితిని అర్థం చేసుకుని.. అవసరమైనప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా పొందాలనే విషయాన్ని గుర్తించారు. అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా నాణ్యమైన డయాలసిస్ చికిత్సతో పాటు మూత్రపిండ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోంది.. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి.. సమాజ శ్రేయస్సును మెరుగు పర్చేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపారు.