NTV Telugu Site icon

Star Hospitals: స్టార్ హాస్పిటల్ స్పెషలైజ్డ్ క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) క్లినిక్ ప్రారంభం..

Star Hospital

Star Hospital

Star Hospitals: ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా స్టార్ హాస్పిటల్ డెడికేటెడ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించింది. స్టార్ హాస్పిటల్ తన అత్యాధునిక క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ఈరోజు ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈ క్లినిక్ COPDతో బాధిత రోగులకు ప్రత్యేక సంరక్షణ అందించడంతో పాటు వ్యాధి నిర్వహణ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం కోసం స్టార్ హాస్పిటల్ ఎక్స్‌పీరియన్స్ కలిగిన ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది.

స్టార్ COPD స్పెషాలిటీ క్లినిక్‌లోని అనుభవజ్ఞులైన పల్మోనాలజిస్ట్‌ల
ప్రత్యేక బృందం ..
డా. చందనా రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ పల్మోనాలజీ & క్రిటికల్ కేర్
డాక్టర్ అనురాధ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ
డా. కిషన్ శ్రీకాంత్ జువ్వ, కన్సల్టెంట్ క్లినికల్ & ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ
డాక్టర్ కనిష్క కావూరి, పల్మోనాలజీ కన్సల్టెంట్
డాక్టర్ లక్ష్మీ భావన చుక్కపలి, పల్మనాలజీ కన్సల్టెంట్

ఈ పత్యేక బృందం COPD రోగుల జీవన నాణ్యతను పెంపొందించడానికి సమగ్ర సంరక్షణ మరియు ఈ రంగంలో తాజా పురోగతిని అందించడానికి కట్టుబడి ఉంది. COPD స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభించడంతో పాటు, స్టార్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పల్మోనాలజీకి చెందిన సభ్యులు ఊపిరితిత్తుల ఆరోగ్యం మరియు పర్యావరణ అవగాహన ప్రోత్సహించడానికి అర్ధవంతమైన చొరవలో నిమగ్నమయ్యారు. ప్రపంచ COPD దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, శ్వాసకోశ శ్రేయస్సును నిర్వహించడంలో ఆరోగ్యకరమైన వాతావరణం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పేందుకు బృందం మొక్కలు పంపిణీ చేసింది.

స్టార్ హాస్పిటల్ COPD స్పెషాలిటీ క్లినిక్ అత్యాధునిక సాంకేతికతను మరియు అత్యున్నత ప్రమాణాల సంరక్షణను నిర్ధారించడానికి రోగి-కేంద్రీకృత విధానాన్ని కలిగి ఉంది. ఇది COPD తో పోరాడుతున్న వ్యక్తులకు ఆశాజ్యోతిగా ఉపయోగపడుతుంది మరియు సమాజంలో శ్వాసకోశ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే విస్తృత లక్ష్యానికి దోహదం చేస్తుంది.

మరింత సమాచారం కోసం లేదా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి, దయచేసి 07969250191 నంబర్‌ను సంప్రదించండి.