భారతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను పెంచాలి అనే వాటిపై అవగాహన కొరకు మామ్ టు బి 2023 అనే కార్యక్రమాన్ని.. డా. ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్వహించారు.. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రులు పిల్లలు ఏగా సరిచేసుకోవాలి? పిల్లల్లో వచ్చేటువంటి ఆటిజం, ఏడీహెచ్, హైపర్ ఆక్టివ్ మరియు ప్రవర్తన లోపాల గురించి విశ్లేషణ జరుపుతూ సమాజంలో పిల్లల కొరకు ఎవరైతే అంకితభావంతో పనిచేశారో వారిని అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది.
Read Also: IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుట్
డాక్టర్ ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మామ్-2023 అవార్డు కార్యక్రమాన్ని ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేర్ హోమియోపతి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏఎం రెడ్డి మాట్లాడుతూ.. అతిగా వ్యాక్సిన్ వాడటం వల్లే అటిజం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.. హోమియోపతి వైద్యంలో ఆటిజం నిర్యూలనలో 80 శాతం సక్సెస్ రేటు సాధించామని వివరించారు. ఆటిజంతో పుట్టిన పిల్లల వలన తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతమన్నారు. ఇక, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి మాట్లాడుతూ అతిగా యాంటీబయటిక్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటిజం నిర్మూలనకోసం డాక్టర్ ఏఎం రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. ఆటిజం నిర్మూలన కోసం ప్రభుత్వ విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. నెలలు నిండకుండానే డెలివరీ కావడం కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణంగా గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సన, బిల్బాగ్ ఫేమ్ జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.