Site icon NTV Telugu

CMR Shopping Mall: సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో ‘కాస్మోటిక్స్‌, ఫుట్‌వేర్‌, హోం నీడ్స్‌.!

Cmr

Cmr

విశాఖలోని జడ్జీ కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో కాస్మోటిక్స్‌, ఫుట్‌ వేర్‌, హోంనీడ్స్‌ను ఆదివారం ఆ సంస్త యాజమాన్యం ప్రారంభించింది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్‌ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరై మాల్‌ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ విశాఖకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎంఆర్‌ తలమానికంగా నిలిచిందని కొనియాడారు. నాణ్యమైన వస్త్రాల్ని సరసమైన ధరలకే అందించడం సీఎంఆర్‌ ప్రత్యేకతన్నారు. అనేక సమాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న వ్యక్తి మావూరి వెంకటరమణ అని అభినందించారు.

పల్లా శ్రీనివాస్ , గణ బాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్ మరియు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ రమణ గారు వ్యాపారం మాత్రమే కాక ప్రతీ విధమైన సేవా కార్యక్రమాలలో ముందుంటారని కొనియాడారు . సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ 1984లో ప్రారంభమైన తమ సంస్థల్ని ఆదరిస్తున్న ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పండుగల సందర్బంగా అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నామని తెలియ చేశారు.

అతిథులంతా నాలుగు అంతస్తుల్లోనూ కలియ తిరుగుతూ సరకును పరిశీలించి, అన్నీ బాగున్నాయన్నారు. అతి తక్కువ సమయంలోనే సీఎంఆర్‌ 40కి పైగా బ్రాంచీల్ని ఏర్పాటు చేసి పది వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం అతిథులకు శాలువాలు కప్పి జ్ఞాపికలందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి కంకటాల మళ్లిక్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జబర్దస్త్‌ టీం, బుల్ల్లితెర ఆర్టిస్టులు జబర్దస్త్‌ భాస్కర్‌, నరేష్‌, వినోద్‌ సందడి చేశారు. ఖాతాదారుల వద్దకు వెళ్లి మాటా మంతీ కలిపారు. అందర్నీ నవ్వులతో ముంచెత్తారు.

Starlink: కక్ష్య నుంచి పడిపోయిన స్టార్‌లింక్ శాటిలైట్.. నెట్ వర్క్ పై ప్రభావం చూపుతుందా?

Exit mobile version