ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని AEE సూర్యకిరణ్‌పై ఇరిగేషన్ ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెచ్చారట. కానీ.. ఇంజనీర్ల అసోసియేషన్ బాసటగా నిలవడంతో సమస్య పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. ఇంతలో తుని సర్కిల్ SE శ్రీనివాసయాదవ్, EE శ్రీనివాసరెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారట. ఇంతలో రాజకీయ ఒత్తిళ్లు పెరిగినట్టు తెలుస్తోంది. మంత్రి రాంబాబు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లడంతో కొందరు ఇంజనీర్లను అక్కడికి రమ్మని ఉన్నతాధికారులు చెప్పారట. మంత్రి సమక్షంలో ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పిద్దామని హైయ్యర్ అఫీషియల్స్ సూచించారట. అయితే పోలవరం దగ్గరకు ఐదారుగురు ఇంజనీర్లే రావాలని.. ఎక్కువ మంది వద్దని వారించారట. దీంతో సూర్యకిరణ్ పోలీస్‌స్టేషన్ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యే కొట్టారు.. రేపటి రోజున రోడ్డుపై పార్టీ కార్యకర్తలు వచ్చి చెయ్యి చేసుకోరని గ్యారెంటీ ఏంటని ఇంజనీర్లు ప్రశ్నించారట.
సమస్య తీవ్రత పెరుగుతుండటంతో సూర్యకిరణ్ బంధువు ద్వారా ఎమ్మెల్యే అనుచరులు చర్చలకు ఒత్తిడి తెచ్చారట. చివరకు బాలాజీపేట సెంటర్‌లోని ఒక వైసీపీ నేత ఇంట్లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఎమ్మెల్యే రాజా, ఇంజనీర్ల మధ్య జరిగిన చర్చల్లో రాజీపడ్డట్టు చెబుతున్నారు. ఆ తర్వాత ఇంజనీర్లు వెనక్కి తగ్గి.. ముందుగా ప్రకటించిన పెన్‌డౌన్ ఆందోళన నిర్ణయాన్ని విరమించుకున్నట్టు టాక్. అయితే ఎమ్మెల్యే AEEపై చెయ్యి చేసుకున్నారనే వివాదం మీడియాలో ప్రముఖంగా రావడం.. రాజకీయంగా దుమారం రేపడంతో సీఎం జగన్ ఆఫీస్ నుంచి జక్కంపూడి రాజాకు ఫోన్ వెళ్లిందట. దాంతో MLA మంగళగిరి వెళ్లినట్టు చెబుతున్నారు. జక్కంపూడి రాజా గతంలోనూ ఈ తరహా వివాదాల్లో చిక్కుకున్నారు. 2016లో ఒక SI చొక్కా పట్టుకోవడంతో కేసు నమోదైంది. 2017లో సీతానగరం మండలం జాలిమూడి దగ్గర ప్రభుత్వ ఉద్యోగిపై చెయ్యి చేసుకున్నారు. 2018లో కారు పార్కింగ్ విషయంలో రామచంద్రపురంలో SI నాగరాజుతో గొడవ పడ్డారు. 8 నెలల క్రితం ప్రభుత్వ అద్యాపకుడు దీపక్‌పై దాడి చేయడంతో 14 మందిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ప్రస్తుతం AEE వంతు వచ్చింది. మరి.. ఈ రగడలో వైసీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.