Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Why The Party In Charge Silent Even When The Party Leader Comes

పార్టీ అధినేత వచ్చినా ఇంఛార్జి ఎందుకు మౌనంగా ఉన్నారు..?

Published Date :May 11, 2022 , 11:44 am
By Premchand Chowdary
పార్టీ అధినేత వచ్చినా ఇంఛార్జి ఎందుకు మౌనంగా ఉన్నారు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటనలో టచ్‌ మీ నాట్‌గా కనిపించినట్టు పార్టీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట. వాస్తవానికి కాంగ్రెస్‌లో రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి తర్వాతే ఎవరైనా. కానీ రాహుల్ గాంధీ టూర్ మొదటిరోజు.. ఠాగూర్ కాస్త దూరం అన్నట్టుగా ఉన్నారని టాక్‌. సాధారణంగా రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తే.. రిసీవ్ చేసుకునే వారిలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ముందు ఉంటారు. కానీ రాహుల్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగే సమయానికి మాణిక్యం ఠాగూర్‌ వరంగల్‌లో పార్టీ సభా వేదిక దగ్గరలో ఉన్నారు. ఎయిర్‌పోర్టులో పీసీసీ చీఫ్‌ రేవంత్‌.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌గౌడ్‌లు రాహుల్‌కు స్వాగతం పలికారు.

హైదరాబాద్‌లో జరిగిన టూర్ షెడ్యూల్‌లోనూ ఇంఛార్జ్‌ ఠాగూర్‌ ఎక్కడా కీలకంగా లేనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజులు టూర్‌ మొత్తం పీసీసీ చీఫ్‌, సీఎల్పీ నేతలే కీలకంగా వ్యహరించారని గాంధీభవన్‌ వర్గాలు గుసగసలాడు కుంటున్నాయి. అయితే రాహుల్‌ గాంధీ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకున్నారో ఏమో.. ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. రాహుల్‌ గాంధీతో ఠాగూర్‌కు ఏదైనా విషయంలో గ్యాప్‌ వచ్చిందా? అని కొందరు ఆరా తీస్తున్నారట.

మాణిక్యం ఠాగూర్‌ తమిళనాడు పీసీసీ చీఫ్‌ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రయత్నాల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో కొందరు ఠాగూర్‌కు మోకాలడ్డుతున్నట్టు తెలుస్తోంది. చాలా మంది కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఠాగూర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారట. పైగా తమిళనాడు రాజకీయాలు అన్నీ పీసీసీ చీఫ్‌ పదవి నియామకం చుట్టూ జరుగుతుండటంతో రాహుల్‌ గాంధీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే తెలంగాణలో రెండు రోజులపాటు పర్యటించిన రాహుల్‌ గాంధీకి మాణిక్యం ఠాగూర్‌ కొంత దూరంగా ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కారణం ఏదైనా.. అగ్రనేత రెండు రోజుల పర్యటనలో ఠాగూర్‌ తీరు పార్టీలో పెద్ద చర్చే అయింది. ఈ విషయంలో ఎవరికి తెలిసిన అంశాలు వారు ప్రచారంలో పెట్టేస్తున్నారు. మరి… అసలు లోగుట్టు ఏంటో ఆ తమిళ తంబికే తెలియాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress politics
  • Manickam Tagore
  • rahul gandhi
  • revanth reddy
  • tcongress

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions