Site icon NTV Telugu

Munugode By Election: మునుగోడు లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు..?

Monugode

Monugode

Munugode By Election :మునుగోడులో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల వడపోతలు ఎంతవరకు వచ్చాయి? TRS, కాంగ్రెస్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి? మునుగోడు సభలో TRS అభ్యర్ధిని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారా? కాంగ్రెస్ లెక్కలు ఏం చెబుతున్నాయి?

మునుగోడు ఉపఎన్నిక హీట్ షెడ్యులు కంటే ముందే మొదలైంది. అధికార…విపక్ష పార్టీలు ఉపఎన్నికలో గెలిచే ప్రయత్నాల్లో ఉన్నాయి. బిజేపి నుంచి కొమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పోటిలో ఉండేది ఎవరు అన్నదే ఆసక్తి కలిగిస్తోంది. అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అధిష్టానాలు ఒక అభిప్రాయానికి వచ్చినా .. అధికారికంగా ప్రకటించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడే క్యాండిడేట్స్‌ను ప్రకటించేస్తే… ఎటువంటి పరిమాణాలు ఎదురవుతాయోనని విశ్లేషణలు చేస్తున్నారట.

మునుగోడులో టిఆర్ఎస్ ఈ నెల 20న బహింగ సభ నిర్వహిస్తోంది. గులాబీ దళపతి కేసిఆర్ పాల్గోనే ఈ సభను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటుంది. భారీ జన సమీకరణకు అధికారపార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. బహిరంగసభలో మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్దిని ప్రకటిస్తారా అనే చర్చా ఉంది. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే అభ్యర్ధి అని క్లారిటి ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కూసుకుంట్ల అభ్యర్ధిత్వంపై ఆసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి లీడర్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుంది అనే లెక్కలు వేస్తోందట టీఆర్ఎస్‌.

కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణా రెడ్డి, పాల్వయి స్రవంతి రేసులో ఉన్నారు. మునుగోడులో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన కాంగ్రెస్ వరసగా ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. అయితే అధికారికంగా అభ్యర్ధిని ఎప్పుడు ప్రకటిస్తుందన్నదే ప్రశ్న. అభ్యర్ధిని ఇప్పుడే డిక్లేర్‌ చేసేస్తే.. టికెట్‌ ఆశించిన నేతలు వేరే దారి చూసుకుంటారా అనే అనుమానాలు ఉన్నాయట. అందుకే అభ్యర్థి ప్రకటన కంటే ముందు ఆశావాహులను బుజ్జగించడం టీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది.

మొత్తంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగే ఈ ఉపఎన్నికను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం.. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా ఆచితూచి ఆలోచనలు చేయడం ఉత్కంఠ పెంచుతోంది.

 

Exit mobile version