Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record What Are The Real Reasons For Sp Transfersin Konaseema District

YCP : కోనసీమ జిల్లా ఎస్పీ పై వేటుకు అసలు కారణాలేంటి..?

Published Date :June 20, 2022 , 11:16 am
By Premchand Chowdary
YCP : కోనసీమ జిల్లా ఎస్పీ పై వేటుకు అసలు కారణాలేంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత నెల 24న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టవద్దని చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆ అల్లర్లలో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆందోళనకారులను.. వారు చేసే విధ్వంసాన్ని పోలీసులు అంచనా వేయలేకపోయారు. ఈ సందర్భంగా కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి తీరు చర్చకు వచ్చింది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 72 రోజుల తర్వాత ఆయన్ని బదిలీ చేశారు. దీంతో అమలాపురం అల్లర్లు.. తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఎస్పీ వేటుకు దారితీసిన సంఘటనలు పోలీస్‌ వర్గాల్లోనూ చర్చకు కారణం అయ్యాయి.

సుబ్బారెడ్డి డైరెక్ట్‌ IPS కాదు. అందువల్లే డిపార్ట్‌మెంట్‌పై ఆయన పట్టు సాధించలేకపోయారనే విమర్శ ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో ఆయనకు ఎస్పీగా అవకాశం వచ్చింది. కానీ.. పూర్తి స్థాయిలో కమాండింగ్‌ చేయలేక ఇబ్బంది పడ్డారని చెబుతారు. కొన్ని సందర్బాలలో డీఎస్పీ స్థాయి అధికారి కూడా ఎస్పీ సుబ్బారెడ్డి చెప్పిన ఆదేశాలు పాటించేవారు కాదని పోలీస్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే అమలాపురం అల్లర్ల తర్వాత DIG పాలరాజును రంగంలోకి దించారని విశ్లేషిస్తారు. గత నెల 24నే ఆయన అమలాపురం చేరుకుని.. అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా పని చేసి.. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రబాబును కూడా అమలాపురం పంపించారు.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

అల్లర్ల తీవ్రత ప్రపంచం మొత్తం చూసినా.. డీజీపీ స్థాయి అధికారులు అమలాపురం రాకపోవడంతో మంత్రి విశ్వరూప్‌ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. దాంతో ఘటన జరిగిన 15 రోజుల తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అమలాపురం వచ్చారని చెబుతారు. ఆందోళనకారులు తగులబెట్టిన మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను డీజీపీ పరిశీలించారు. ఆ తర్వాత ఎస్పీ ఆఫీసులో అల్లర్లపై సమీక్ష నిర్వహించారు డీజీపీ. సమగ్ర వివరాలు ఇవ్వాలని అప్పటికప్పుడు ఎస్పీ సుబ్బారెడ్డిని ఆదేశించారు DGP. అంతా DIGనే చూస్తున్నారని సంజాయిషీ ఇస్తూ.. ఆ ఘటనపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదట ఎస్పీ. దాంతో మీ జిల్లా పరిధిలోని విషయాలు మీకు తెలియకపోతే ఎలా అని ఎస్పీపై సీరియస్‌ అయ్యారట DGP.

నలుగురు అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని స్వయంగా మంత్రి విశ్వరూప్‌ ఎస్పీకి చెప్పారట. దర్యాప్తు చేసి క్లారిటీ ఇవ్వాలని కోరారట. ఆ విషయంలోనూ సుబ్బారెడ్డి చూసీచూడనట్టు వ్యవహరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమలాపురం వచ్చిన డీజీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారట మంత్రి. విచిత్రం ఏంటంటే.. డీజీపీ వచ్చి వెళ్లిన మరుసటి రోజే విశ్వరూప్‌ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కేర్‌లెస్‌గా వ్యవహరించడం ఏంటని ఎస్పీకి డీజీపీ క్లాస్‌ తీసుకున్నారట. ఆ తర్వాత సుబ్బారెడ్డిని బదిలీ చేశారని చర్చ జరుగుతోంది.

మొత్తానికి ఎస్పీ బదిలీ వేటుకు ముందు జరిగిన ఘటనల కంటే.. తర్వాత జరిగిన పరిణామాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. డీజీపీకి కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో ఎస్పీని పక్కన పెట్టారని అనుకుంటున్నారట. మొత్తానికి అసలు కథ ఇదా అని ఖాకీ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయట.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ambedkar
  • ap politics
  • konaseema district
  • Vishwaroop
  • ycp

తాజావార్తలు

  • Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..

  • Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!

  • Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

  • Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions