Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record What Are The Goals Of Those Two

Telangana Congress : ఆ ఇద్దరి లక్ష్యాలేంటి?

Published Date :August 17, 2022 , 11:31 am
By Premchand Chowdary
Telangana Congress  : ఆ ఇద్దరి లక్ష్యాలేంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కుంపట్లు.. కుమ్ములాటలతో కుదేలవుతున్న కాంగ్రెస్‌కు హైకమాండ్‌ చికిత్స మొదలుపెట్టిందా? కొత్త ఇంఛార్జుల రాక వెనక వ్యూహం అదేనా? కొత్తగా వచ్చిన ఇద్దరు నేతల బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటీ? వారి లక్ష్యాలేంటి? లెట్స్‌ వాచ్‌..!

మునుగోడు ఉపఎన్నిక.. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు హీట్‌ మీద ఉన్న సమయంలో పార్టీ హైకమాండ్‌ ఇద్దరు AICC కార్యదర్శులను రాష్ట్రానికి పంపింది. గతంలో ఇక్కడ పనిచేసిన AICC కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్‌ వెళ్లిపోవడంతో.. ఆయన ప్లేస్‌లో ఇద్దరు వచ్చారు. కొత్తగా నదీం జావెద్‌.. రోహిత్‌ చౌదరిలను ఎంపిక చేసి.. తెలంగాణకు పంపడం వెనక పార్టీ పరంగా పెద్ద వ్యూహమే ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

నదీం.. రోహిత్‌ ఇద్దరూ గతంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీతో కలిసి పనిచేశారు. ప్రియాంక కోటరీలో నమ్మకస్తులుగా ముద్ర ఉంది. సమన్వయ కర్తలుగా సమర్థంగా పనిచేస్తారని రాహుల్‌ గాంధీకి కూడా గురి ఉందట. వీరిద్దరికీ ప్రియాంక, రాహుల్‌ గాంధీలు 45 రోజులు గడువు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అగ్రనేతలు స్వయంగా ఎంట్రీ ఇచ్చి.. AICC కార్యదర్శులను హైదరాబాద్‌లో ల్యాండ్‌ చేయించారని టాక్‌.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది? ఎవరు చెప్పేది నిజం? గ్రౌండ్‌లో పరిస్థితి ఏంటి? అనే అంశాలపై ఇద్దరు AICC కార్యదర్శులు నదీం.. రోహిత్‌లు హైకమాండ్‌కు నివేదికలు ఇస్తారని సమాచారం. ఈ విషయంలో ప్రియాంకా గాంధీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారట. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు నేతలు.. పని కూడా మొదలుపెట్టేశారు. PJR కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుతో నదీంజావెద్‌ భేటీ అయ్యారు. కొద్దిరోజులుగా విష్ణు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆపై పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీతోనూ నదీం జావెద్‌ సమావేశం అయ్యారు. పార్టీ వ్యవహారాలు.. అంతర్గత అంశాలు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ పనితీరుపై నదీం ఆరా తీస్తున్నారట.

మరో AICC కార్యదర్శి రోహిత్ చౌదరి సైతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఆకళింపు చేసుసుకునే పనిలో పడ్డారు. త్వరలోనే ఫీల్డ్‌ ఎంట్రీ ఇస్తారట. దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉంది హైకమాండ్‌ భావిస్తోంది. అందుకే ఇక్కడి వ్యవహారాలను ప్రియాంకా గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తారని చర్చ జరుగుతోంది. అందుకే ఆమె టీమ్‌లో కీలకంగా ఉన్న ఇద్దరిని తెలంగాణ పంపినట్టు చర్చ సాగుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితితోపాటు.. పార్టీ నేతల్లో ఎవరేంటి? వివాదాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్టీ ఎందుకు పుంజుకోలేదు? 2014, 2018 ఎన్నికల ఫలితాలు.. 2018 తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరు. పీసీసీకి కొత్త సారథ్యం వచ్చాక జరిగిన కార్యక్రమాలు.. నేతల అలకలు.. అసంతృప్తులు.. ఆరోపణలు.. విమర్శలపైనా ఫోకస్‌ పెడతారని తెలుస్తోంది. అసలు కాంగ్రెస్‌లో ఈ పంచాయితీలు ఏంటి? వీటి వెనక ఎవరు ఉన్నారు? ఇలా అన్ని అంశాలను 45 రోజుల్లో వడపోసి.. పూర్తి స్థాయి అధ్యయనం నివేదికను హైకమాండ్‌కు అందజేస్తారట. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌లో రానున్న 45 రోజులు అందరిపైనా ఫోకస్‌ ఉంటుందని.. అందరి జాతకాలు ప్రియాంకా గాంధీ దూతల చేతికి చిక్కినట్టేనని లెక్కలేస్తున్నారు. మరి.. అధిష్ఠానం చేపట్టిన ఈ చికిత్స పార్టీకి ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Manickam Tagore
  • Mr. Rohit Chaudhary
  • Nadeem Javed
  • Priyanka Gandhi
  • telangana Congress

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions