OTR : తెలంగాణలో గిగ్ వర్కర్స్ పాలసీ.. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..?

  • కాంగ్రెస్ సర్కార్ గిగ్ వర్కర్ల పాలసీ వ్యూహం ఏంటి?
  • రాహుల్ గాంధీ ఎత్తుగడ తెలంగాణలో పార్టీకి ఎంత వరకు బూస్టప్ ఇస్తుంది?
  • భారత్ సమ్మిట్, గిగ్‌ వర్కర్ల పాలసీపై కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి?
Otr

Otr

OTR : కాంగ్రెస్ సర్కార్ గిగ్ వర్కర్ల పాలసీ వ్యూహం ఏంటి..? రాహుల్ గాంధీ ఎత్తుగడ…తెలంగాణ లో పార్టీకి ఎంత వరకు బూస్టప్ ఇస్తుంది? భారత్ సమ్మిట్, గిగ్‌ వర్కర్ల పాలసీపై కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? తెలంగాణలో ఒక్కోసారి ఒక్కో అంశాన్ని అనుసరిస్తూ వస్తోంది కాంగ్రెస్. గతంలో డిక్లరేషన్ల పేరుతో ఒక్కొక్క విభాగానికి సంబంధించిన సమస్యలపై ఫోకస్ చేసింది. ఆయా సమస్యలను కేంద్రీకృతంగా ఫోకస్ చేయడంతో కాంగ్రెస్ కి కొంత కలిసి వచ్చింది. అయితే రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో భాగంగా తెలంగాణలో గిగ్ వర్కర్స్ తో సమావేశమయ్యారు. వాళ్లకు అండగా ఉంటానని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు రాహుల్ గాంధీ.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం గిగ్ వర్కర్స్ కి ఒక పాలసీని రూపొందించారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ సమ్మిట్ సందర్భంగా నేషనల్‌ లెవల్లో తెలంగాణ రాష్ట్రం హాట్‌ టాపికయ్యింది. దీంతో అటు భారత్ సమ్మిట్, ఇటు గిగ్ వర్కర్ల పాలసీని పార్టీకి బూస్టప్ గా ఉపయోగించే ఎత్తుగడగా వర్కౌట్ చేశారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం గిగ్ వర్కర్స్ కి పాలసీ తెచ్చినా… వాటికి ఇవాళ వెల్ఫేర్ స్కీమ్ లాంచింగ్‌ను రాహుల్ గాంధీతో చేయించారు. గిగ్‌ వర్కర్లలో పేదలే అత్యధికం. అందుకే వారి కోసం తామున్నామంటూ చేయూతనివ్వడం…దీని ద్వారా ఆయా వర్గాలకు మరింతగా చేరువ కావాలన్నది కాంగ్రెస్ స్ట్రాటజీగా కొందరు విశ్లేషిస్తున్నారు.