Site icon NTV Telugu

తెలకపల్లి రవి : సెకండ్‌వేవ్‌ మరణాల సంఖ్యపై సందేహం, మూడో వేవ్‌పై ఆందోళన

కోవిడ్‌ మూడోవేవ్‌ గురించిన భయాందోళనలు ఒకవైపున వెంటాడుతుండగా రెండవ వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా బయిటకువచ్చిందనే ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.దేశంలో పాలకుల పోకడలకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది, ఎందుకంటే మరణాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పుఅన్నట్టు కేంద్రం మాట్లాడుతున్నది.దేశంలో నమోదైన కోవిడ్‌ మరణాలసంఖ్యకు వాస్తవంగా సంభవించిన వాటికి చాలా తేడావున్నట్టు అంతర్జాతీయంగానూదేశంలోనూ కూడా కథనాలు వచ్చాయి. ప్రధాని మోడికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్‌ సుబ్రహ్మణ్యం బృందంనుంచి ఈ విధమైన అంచనాలురావడం గమనించవలసిన విషయం. సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం(సిఆర్‌ఎస్‌) ప్రకారం రాష్ట్రాలలో మరణాల శాతం అసాధారణంగా పెరిగిందా అనిపరిశీలించడం ఒక పద్ధతి.

కేంద్రం యాభై ఏళ్లుగా ఉపయోగించే శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌(ఎస్‌ఆర్‌ఎస్‌) మరో పద్దతి.అయితే ఇది 2019 వరకు మాత్రమే అందుబాటులో వుంది. సిఆర్‌ఎస్‌ ప్రకారం చూస్తే 2020 ఏప్రిల్‌2021 జూన్‌ మధ్య కాలంలో 34 లక్షల మరణాలుఅదనంగా నమోదైనట్టు అరవింద్‌ సుబ్రహ్మణ్యం బృందం చెబుతున్నది. కేంద్రం లెక్క ప్రకారం ఈ కాలంలో 4.18లక్షల మంది మాత్రమే కోవిడ్‌తో మరణించినట్టు చెబుతున్నారు. పాజిటివ్‌గాతేలినవ వాఇరిలో ఇది 1.34శాతం మాత్రమే. సిఆర్‌ఎస్‌ అంత ఖచ్చితంగా వుండదనే వాదన మరొకటవుంది.కాని 2019లో వివరాలు చూస్తే దక్షిణాది రాష్ట్రాలలో సిఆర్‌ఎస్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ రెండూ ఒకే విధంగా వున్నాయి.కొన్ని ఇతర రాష్ట్రాలలో మరణాలను తక్కువచేసి చూపడం కూడా కనిపించింది.కనుక అసలైన సంఖ్య మరింత ఎక్కువగా వుండవచ్చుననే సందేహాలు పెరుగుతున్నాయి.

read also : ‘జై భీమ్’ అంటున్న సూర్య!

జులై20 కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేస్తూ ఆక్సీజన్‌ కొరత వల్ల ఎవరూ మరణించినట్టు రాష్ట్రాలనుంచి నివేదికలు రాలేదని చెప్పడంతో ఈ చర్చ మరింత తీవ్రరూపం దాల్చింది.అయితే 2021ఏప్రిల్‌జూన్‌ మధ్య దేశమంతా ఆస్పత్రులు ఆక్సీజన్‌ కొరతతో అల్లాడిపోవడం చూశాం,మొత్తం కోవిడ్‌ మరణాలలో56శాతం అంటే 2.35 లక్షలు ఈ మూడు మాసాలలోనే సంభవించాయని కేంద్రం లెక్కకాగా ఆరవింద్‌ సుబ్రహ్మణ్యం వంటివారి లెక్కలు ఆమెరికా యూరప్‌ల అనుభవాలతో వేసే లెక్కలు అంతకంటే అనేకరెట్లు ఎక్కువగా వున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ జులై23న ఒక ప్రకటన చేస్తూ మరణాల శాతం 2020లో 1.45శాతంవుంటే 2021 మే జూన్‌ మధ్య వ్యాప్తిపెరిగినా మరణాల రేటు మాత్రం1.34శాతంమాత్రమే వుందని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన ఐసిడి-10కోడ్‌ ప్రకారం మాత్రమే కోవిడ్‌ మరణాలను లెక్కించాలని ఐసిఎంఆర్‌ 2020 మేలోనే ఆదేశాలు పంపింది, ఈ ప్రకారం రాష్ట్రాలు రోజూ మరణాల సంఖ్యనుకేంద్రానికి పంపిస్తూ వచ్చాయి.రాష్ట్రాలు పంపిన వివరాల ఆధారంగానే కేంద్రం నివేదికలు తయారు చేసింది అని కొత్త ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవియ ప్రకటించారు.

ఈ వివరాల విషయంలో ప్రామాణికత పాటించాలని కూడా చెబుతూ వచ్చాము.అయితే రెండోవేవ్‌ సమయంలో మొత్తం ఆరోగ్యవ్యవస్థచికిత్సపైనే కేంద్రీకరించడం వల్ల మరణాలనమోదులో పొరబాట్లు జరిగివుండొచ్చు.మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌,బీహార్‌ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన మరణాల సంఖ్య తక్కువగా వున్నట్టు గుర్తించి తర్వాత దిద్దుకోవడం ఇందుకో ఉదాహరణ అని ఆయనపేర్కొన్నారు. ఆక్సీజన్‌ అందక మరణించినట్టు తమకు రాష్ట్రాల నుంచినివేదికలు రాలేదని కేంద్రమంత్రి చెప్పినదాన్ని కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌,చత్తిస్‌ఘర్‌ తీవ్రంగా ఖండిరచాయి.కేంద్రం ఆ వివరాలు ఎన్నడూ అడగలేదని అవి స్పష్టంచేశాయి.రెండవ వేవ్‌లో అత్యధిక కోవిడ్‌ మరణాలు అక్సీజన్‌ కొరతతోనే సంభవించాయని రాజస్థాన్‌ఆరోగ్యమంత్రిరఘుశర్మ చెప్పారు.కోవిడ్‌తో మరణించిన వారిలో పాతవ్యాధులు వున్నవారు,అలాటివి లేకుండానే చనిపోయిన వారు అన్న రెండు రకాలుగా మాత్రమే కేంద్రం వివరాలు కోరిందని చత్తీస్‌ఘర్‌ ఆరోగ్యమంత్రిటిఎస్‌సింగ్‌దేవ్‌ తెలిపారు.

మూడోవేవ్‌ హెచ్చరికలు

ఇది ఇలా వుంటే కొన్ని రాష్ట్రాలలో పదిశాతంపైన కోవిడ్‌పాజిటివిటీ వున్న రాష్ట్రాల కారణంగా దేశంలో మూడో వేవ్‌ వచ్చే అవకాశం వుందని కేంద్రం హెచ్చరించింది, దేశం మొత్తం మీద నెల రోజులుగాపాజిటివిటీ రేటు మూడు శాతం మాత్రమే వున్నా ,కేరళ, మణిపూర్‌,రాజస్థాన్‌,మిజోరాం నాగాలాండ్‌ వంటివాటిలో పదిశాతం పైన పాజిటివ్‌ వున్న జిల్లాల సంఖ్య ఎక్కువగావున్నట్టు పేర్కొంది.మహారాష్ట్రలో ఆక్టివ్‌ కేసులు పెరుగుతూనే వున్నాయి.జులై14-21 మధ్యన అధికారిక వివరాల పకారం చూస్తే 47 జిల్లాలలో 10శాతంపైన, 55 జిల్లాలలో అయిదు పదిశాతం మధ్యన పాజిటివిటీ వుంది. రాజస్థాన్‌లోని జైసల్మార్‌లో అత్యధికంగా 44 శాతంపాజిటివిటీ నమోదైంది. కేరళలో తొమ్మిదిజిల్లాలలో అధికంగా వుంది. రానున్నరోజుల్లో మరింత విస్త్రతంగా నిరంతరంగా పరీక్షలు నిర్వహించడమే కోవిడ్‌2 ను అరికట్టే మార్గమని కేంద్రంచెబుతున్నది. ఈ రకరకాల వార్తలు ప్రజలలో భయాందోళనలు పెంచుతున్నమాట నిజం,

Exit mobile version