Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Tdp Leaders Focus On Venkatagiri Seat

Venkatagiri Seat: రసవత్తరంగా వెంకటగిరి రాజకీయం

Published Date :March 9, 2022 , 11:28 am
By NTV WebDesk
Venkatagiri Seat: రసవత్తరంగా వెంకటగిరి రాజకీయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ నియోజకవర్గం టీడీపీలో సీటు కోసం పావులు కదిపేవారు ఎక్కువయ్యారా? నేతల మధ్య పోటీ పెరిగిందా? మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని కొత్త నాయకుడు కావాలంటున్నారట కార్యకర్తలు. దీంతో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఆ పోటీకాస్తా రసవత్తరంగా మారిపోయింది.

సొంత వ్యాపారాలపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఫోకస్‌
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ సరైన నేత లేక తీవ్ర అసంతృప్తిలో ఉంది కేడర్‌. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కురుగొండ్ల రామకృష్ణ 2019లో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి టీడీపీ కార్యకలపాలకంటే సొంత వ్యాపారానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట రామకృష్ణ. దీంతో కొందరు టీడీపీ నేతలు వైసీపీతో టచ్‌లోకి వెళ్లారు. ఇది కేడర్‌కు మరింత అసంతృప్తి తీసుకొచ్చిందట.

మాజీ ఎమ్మెల్యే తీరువల్లే వెంకటగిరి రాజాలు దూరం?
వెంకటగిరిలో టీడీపీ ఐదుసార్లు గెలిచింది. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడుతున్నా.. నేతలతో సఖ్యత లేదు. దీంతో సైకిల్‌ పార్టీ బలహీనపడుతోంది. గత ఎన్నికల్లోనూ సేమ్‌ సీన్‌. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ వైఖరి వల్లే టీడీపీ ఓడిపోయిందని చెబుతున్నారట కార్యకర్తలు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న, కీలకమైన వెంకటగిరి రాజాలు.. రామకృష్ణ తీరు నచ్చకే టీడీపీకి దూరమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీకి పెద్ద దెబ్బ అని కేడర్‌ వాపోతుంది.

వెంకటగిరి వైసీపీలో అసంతృప్త నేతలను ఆకర్షించడం లేదా?
ఇంత జరిగినా టీడీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన రామకృష్ణ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేడర్‌ మండిపడుతోంది. వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఆనం రామనారయణరెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏం చేయలేకపోతున్నా అని ఆయన ఓపెన్‌గానే కామెంట్స్‌ చేస్తున్నారు. జిల్లాలోని మంత్రులు తనకు సహకరించకే వెంకటగిరి అభివృద్ధిలో వెనకపడుతోందని.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదని పలు సందర్భాలలో ఆనం ఆరోపించారు. ఈ అంశాన్ని రాజకీయంగా టీడీపీ సద్వినియోగం చేసుకోవడం లేదన్నది కార్యకర్తల మాట.

గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచన
ఇదే నియోజకవర్గానికి చెందిన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డికి కేబినెట్‌ హోదా ఉన్న పదవి ఇవ్వడంతో వెంకటగిరిలో వైసీపీ రెండు వర్గాలుగా వ్యవహరిస్తోంది. ఎవరికి మద్దతిస్తే ఏమౌతుందో తెలియక సతమతం అవుతోంది అధికారపార్టీ కేడర్‌. అలాంటి వారిని ఆకర్షించడంలో రామకృష్ణ వైఫల్యం చెందినట్టు స్థానిక టీడీపీ వర్గాల వాదన. ఈ విషయాలను పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లడంతో రామకృష్ణను తప్పించి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నారట.

లాబీయింగ్‌లో బీసీ నేతలు
బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో .. ఆ వర్గం నేతలు కొత్త వ్యూహాలతో వస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే లాబీయింగ్‌ చేస్తున్నారట. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కురుగొండ్లను మారుస్తారో లేదో తెలియదు కానీ.. కొత్త కొత్త నేతలు.. వారి పేర్లు వెంకటగిరిలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇది తెలిసో ఏమో ఎప్పుడో ఒకసారి కనిపించే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ తరచూ రావడం మొదలుపెట్టారట. మరి.. కేడర్‌ను ఛార్జ్‌ చేయడానికి ఎవరిని ఇంఛార్జ్‌గా పెట్టి అభ్యర్థిని చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anam ramanayarana reddy
  • ap politics
  • chandrababu
  • Ex Mla Ramakrishna
  • off the record

తాజావార్తలు

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

  • Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన శేష్!

  • Assembly Election Voting: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జోరు.. భారీగా ఓటింగ్ నమోదు.!

  • Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions