Venkatagiri Seat: రసవత్తరంగా వెంకటగిరి రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గం టీడీపీలో సీటు కోసం పావులు కదిపేవారు ఎక్కువయ్యారా? నేతల మధ్య పోటీ పెరిగిందా? మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని కొత్త నాయకుడు కావాలంటున్నారట కార్యకర్తలు. దీంతో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఆ పోటీకాస్తా రసవత్తరంగా మారిపోయింది.
సొంత వ్యాపారాలపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఫోకస్
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ సరైన నేత లేక తీవ్ర అసంతృప్తిలో ఉంది కేడర్. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కురుగొండ్ల రామకృష్ణ 2019లో వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి టీడీపీ కార్యకలపాలకంటే సొంత వ్యాపారానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట రామకృష్ణ. దీంతో కొందరు టీడీపీ నేతలు వైసీపీతో టచ్‌లోకి వెళ్లారు. ఇది కేడర్‌కు మరింత అసంతృప్తి తీసుకొచ్చిందట.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
మాజీ ఎమ్మెల్యే తీరువల్లే వెంకటగిరి రాజాలు దూరం?
వెంకటగిరిలో టీడీపీ ఐదుసార్లు గెలిచింది. పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడుతున్నా.. నేతలతో సఖ్యత లేదు. దీంతో సైకిల్ పార్టీ బలహీనపడుతోంది. గత ఎన్నికల్లోనూ సేమ్ సీన్. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ వైఖరి వల్లే టీడీపీ ఓడిపోయిందని చెబుతున్నారట కార్యకర్తలు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న, కీలకమైన వెంకటగిరి రాజాలు.. రామకృష్ణ తీరు నచ్చకే టీడీపీకి దూరమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీకి పెద్ద దెబ్బ అని కేడర్ వాపోతుంది.
వెంకటగిరి వైసీపీలో అసంతృప్త నేతలను ఆకర్షించడం లేదా?
ఇంత జరిగినా టీడీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన రామకృష్ణ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేడర్ మండిపడుతోంది. వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఆనం రామనారయణరెడ్డి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏం చేయలేకపోతున్నా అని ఆయన ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తున్నారు. జిల్లాలోని మంత్రులు తనకు సహకరించకే వెంకటగిరి అభివృద్ధిలో వెనకపడుతోందని.. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదని పలు సందర్భాలలో ఆనం ఆరోపించారు. ఈ అంశాన్ని రాజకీయంగా టీడీపీ సద్వినియోగం చేసుకోవడం లేదన్నది కార్యకర్తల మాట.
గట్టి అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచన
ఇదే నియోజకవర్గానికి చెందిన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డికి కేబినెట్ హోదా ఉన్న పదవి ఇవ్వడంతో వెంకటగిరిలో వైసీపీ రెండు వర్గాలుగా వ్యవహరిస్తోంది. ఎవరికి మద్దతిస్తే ఏమౌతుందో తెలియక సతమతం అవుతోంది అధికారపార్టీ కేడర్. అలాంటి వారిని ఆకర్షించడంలో రామకృష్ణ వైఫల్యం చెందినట్టు స్థానిక టీడీపీ వర్గాల వాదన. ఈ విషయాలను పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లడంతో రామకృష్ణను తప్పించి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నారట.
లాబీయింగ్‌లో బీసీ నేతలు
బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో .. ఆ వర్గం నేతలు కొత్త వ్యూహాలతో వస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే లాబీయింగ్ చేస్తున్నారట. ఇలా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కురుగొండ్లను మారుస్తారో లేదో తెలియదు కానీ.. కొత్త కొత్త నేతలు.. వారి పేర్లు వెంకటగిరిలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇది తెలిసో ఏమో ఎప్పుడో ఒకసారి కనిపించే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ తరచూ రావడం మొదలుపెట్టారట. మరి.. కేడర్‌ను ఛార్జ్ చేయడానికి ఎవరిని ఇంఛార్జ్‌గా పెట్టి అభ్యర్థిని చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!