ఉదయగిరి వైసీపీలో ఆగని రగడ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఆ ఎమ్మెల్యే విస్మరించారా? ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారా? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?
ఉదయగిరి వైసీపీలో వర్గపోరు తీవ్రం..!
Also Read
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే. వైసీపీ నేత. విపక్షపార్టీలు ఆందోళన చేయాల్సిన చోట.. తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైసీపీ కేడర్ రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉదయగిరిలో ఉంది. పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలు ఎమ్మెల్యేకు.. కేడర్‌కు మధ్య దూరం పెంచింది. సొంతపార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా విమర్శలు చేస్తున్నారు నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వైరం బయటపడింది. వింజమూరు ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు వైసీపీ నేతలు. ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. వైసీపీ జిల్లా నేతలు జోక్యం చేసుకున్నా సమస్యను సర్దుబాటు చేయలేకపోయారంటే వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే కేడర్ ఆరోపణలు..!
వరికుంటపాడులో పార్టీ పదవులను అమ్ముకుంటున్నారనే ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. మండల పార్టీ అధ్యక్షుడిని మూడుసార్లు మార్చడమే దానికి కారణమన్నది వారి వాదన. ఇదే సమయం అనుకున్నారో ఏమో.. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు సొంతపార్టీ నేతలు. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా మామూళ్లు తప్పడం లేదని వారు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు ముందుగానే ప్రసన్నం చేసుకోవాలట. ఈ అంశాన్ని ఓపెన్‌గా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చాకిరేవు పెట్టేశారు వైసీపీ నాయకులు.
బాబాయ్ విషయంలో జోక్యం చేసుకోనని చెప్పిన మంత్రి గౌతంరెడ్డి..!
పార్టీ పదవుల అమ్మకాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదన్నది ఉదయగిరిలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం చేస్తున్న వాదన. పార్టీ అధినేత జోక్యం చేసుకుంటేగానీ పరిస్థితులు గాడిలో పడబోవనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 2014 ఎన్నికల్లో స్థానిక నేతలను దూరం చేసుకోవడం వల్లే చంద్రశేఖర్‌రెడ్డి ఓడిపోయారని.. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు లేదన్నది అసమ్మతి నేతల ఆర్గ్యుమెంట్. దీంతో ఎమ్మెల్యే అన్న కుమారుడు.. మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి దగ్గరకు ఈ విషయాన్ని కొందరు తీసుకెళ్లారట. అయితే ఆ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని మంత్రి స్పష్టం చేశారట.
ఎమ్మెల్యేను అదృశ్యశక్తి నడిపిస్తోందా?
బాబాయ్ తీరు నచ్చకే మంత్రి గౌతంరెడ్డి సైతం చంద్రశేఖర్‌రెడ్డితో అంటీముట్టనట్టు ఉంటున్నారని వైసీపీ వర్గాల కథనం. పైగా ఎమ్మెల్యేను ఒక అదృశ్యశక్తి నడిపిస్తోందని.. ఆ శక్తిని ఆర్థికంగా ప్రసన్నం చేసుకుంటేనే పనులు సాఫీగా సాగుతాయని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. మరి.. ఉదయగిరిలో ఎమ్మెల్యేకు పార్టీ నేతలకు మధ్య వచ్చిన గ్యాప్‌ను పూడ్చేందుకు వైసీపీ పెద్దలు ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!