Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On 50 Thousand Jobs

అధికారులు ఇచ్చిన లెక్కలపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి !

Published Date :July 16, 2021 , 2:17 pm
By Lakshmi Narayana
అధికారులు ఇచ్చిన లెక్కలపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి !
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిత్తశుద్ధి లేని శివపూజలా ఉందట.. తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు. నెలల తరబడి కసరత్తు చేశామని చెబుతూ.. అధికారులు ఇచ్చిన జాబితాపై సీఎం సంతృప్తి చెందలేదు. వారికి మరో డెడ్‌లైన్‌ పెట్టారు. అసలు ఆఫీసర్లు వాస్తవ లెక్కలే ఇచ్చారా? లేక తిమ్మిని బమ్మిని చేయాలని చూశారా?

ఉద్యోగ ఖాళీల లెక్కలను అధికారులు సరిచూసుకున్నారు

గత డిసెంబర్‌లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. వెంటనే ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు కూడా. ఆ ఆదేశాలు అందుకున్న అధికారులు ఉద్యోగ ఖాళీలపై కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం అన్నిశాఖల కార్యదర్శులతో పలుమార్లు సమావేశం అయ్యారు. ఓ ప్రొఫార్మా ఇచ్చి ఆ ప్రకారం వివరాలు పంపించాలని కోరారు సీఎస్‌. అధికారులు లెక్కలు అందజేశారు. వాటిని ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకున్నారట.

read also : తెలంగాణ నా గడ్డ : వైఎస్ షర్మిల

57 వేల ఖాళీలు ఉన్నట్టు రిపోర్ట్‌లో తేల్చారు

ఇటీవలే ఉద్యోగ భర్తీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం కేసీఆర్‌ దృష్టి పెట్టడమే దానికి కారణం. ఆయా శాఖలు ఇచ్చిన లెక్కలపై ఫైనల్‌ కన్ఫర్మేషన్‌ కోసం ఆర్థికశాఖ ఆఫీసర్లు.. సంబంధిత శాఖల అధికారులతో భేటీ అయ్యారు. లెక్కలను మరోసారి రూడీ చేసుకున్న తర్వాత ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ వాటిని కేబినెట్‌ ముందు ఉంచింది. 57 వేల ఖాళీలు ఉన్నట్టు రిపోర్ట్‌లో తేల్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. రిపోర్ట్‌ చూసిన తర్వాత అందులోని లెక్కలు.. సంఖ్యలు ఆశ్చర్యపరిచాయట. కొన్ని శాఖల్లో ఖాళీలు కనీసం పది కూడా లేవట.

కొన్ని శాఖలు కావాలనే ఖాళీలు తక్కువ చేసి చూపించాయా?

ఒక్కో శాఖ ఒక్కో విధంగా లెక్కలు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఖాళీల సంఖ్య ఎక్కువ చూపెడితే ఇబ్బందులు వస్తాయేమోనని కొన్ని శాఖలు తక్కువ చేసి చూపించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అవన్నీ కాకి లెక్కలనే విమర్శలు వస్తున్నాయి. అందుకే రిపోర్ట్‌లోని లెక్కలను చూశాక.. ఈ అంకెలేంటి తూచ్‌ అన్నారు సీఎం కేసీఆర్‌. గణాంకాలు అసంపూర్తిగా ఉన్నాయని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య.. ఖాళీల వివరాలు సమగ్రంగా అందజేయాలని.. ఐదు రోజుల్లోగా వాటిని అందజేయాలని డెడ్‌లైన్‌ పెట్టారు సీఎం.

ఐదు రోజుల్లో కొత్త వివరాలు పక్కాగా ఇస్తారా?

దీంతో ఇన్ని రోజులు అధికారులు కసరత్తు చేసి పొడిచింది ఏంటి? సీఎం ఆదేశించినా చిత్తశుద్దితో పని చేయలేదా? తమకెందుకొచ్చిన గొడవ అనుకొని ఏదోఒక లెక్క పంపించేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయట. తగిన సమయం ఇచ్చినప్పుడే సరిగా పనిచేయని అధికారులు.. ఇప్పుడు ఐదు రోజుల్లో ఖాళీలు, ఉద్యోగుల వివరాలు పక్కాగా ఇస్తారా అన్న సందేహాలు ఉన్నాయట.

కచ్చితమైన లెక్కలు ఏ శాఖ దగ్గరా లేవా?

కొత్త గణాంకాలు అందాక.. మళ్లీ కొత్త జిల్లాలు, జోన్లు, కేడర్‌ వారీగా లెక్కలు తీయాల్సి ఉంటుంది. అసలు తెలంగాణలో ఏ కేడర్‌లో ఎన్ని శాంక్షన్‌ పోస్ట్‌లు ఉన్నాయి? అందులో రెగ్యులర్‌ ఉద్యోగులు ఎంత? కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల ఖాళీలు ఎన్ని అనే కచ్చితమైన లెక్కలు ఏ శాఖ దగ్గరా లేవని తెలుస్తోంది. ముంజూరైన పోస్టులు ప్రస్తుతం అవసరమా లేదా అన్నదీ ఆయా శాఖలకు క్లారిటీ లేదట. మరి.. ఉద్యోగ లెక్కలు తేలేదెప్పుడో.. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ అయ్యేది ఎన్నడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • off the record
  • telangana

తాజావార్తలు

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

  • Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?

  • CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions