Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Political Pressure In Ycp Leader Ganji Prasad Murder Case

YCP: వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్లు..?

Published Date :June 27, 2022 , 11:54 am
By Premchand Chowdary
YCP: వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్లు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసిపి నేత గంజి ప్రసాద్ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. అధికారపార్టీలో ఆధిపత్యపోరు చర్చకు వచ్చింది. నిందితులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి తానేటి వనిత ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరుకు మంత్రి స్టేట్‌మెంట్‌కు పొంతన ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్ట్‌ చేసినా.. రాజకీయ ఒత్తిళ్లతో విచారణ ముందుకెళ్లడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. దానికితోడు నిందితులతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నారు నాయకులు.

రిమాండ్‌లో ఉన్న నిందితులకు రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసులో A8 నిందితుడిగా ఉన్న కోడూరి రవితేజ అనారోగ్యం పేరుతో జైలు నుంచి బయటకొచ్చారని చెబుతున్నారు. అర్దరాత్రి వేళ బయటకొచ్చి చాలా యవ్వరాలు చక్కబెట్టారట రవితేజ. ఛాన్స్‌ తీసుకుని ఒకరోజు రవితేజ పోలీసులు కళ్లుకప్పి తప్పించుకుని పారిపోయాడు. దాంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు ప్రయత్నించినా బయటకు పొక్కడం.. వెంటనే రవితేజను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయింది. అయితే హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఈజీగా పారిపోవడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదట. పైగా నిందితుల్లో కొందరు అనారోగ్యం పేరుతో జైలు నుంచి బయటకొచ్చి ఆస్పత్రిలో చేరి.. ప్రైవేట్‌ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారని వైసీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే నిందితులకు జైల్లోనూ.. ఆస్పత్రిలోనూ రాచమర్యాదలు అందుతున్నాయనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గంజి ప్రసాద్‌ హత్య కేసులో ఇప్పటికే పలువురు పోలీసులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ నిందితుల విషయంలో కఠినంగా వ్యహరించకపోవడం.. చర్చగా మారుతోంది. ఖైదీ పరారీ ఘటనలో నలుగురిపై పోలీసు అధికారులు వేటు వేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి.. నిందితులకు కొమ్ము కాస్తున్న తెరవెనుక ఖాకీలపై వేటు ఉంటుందా అనేది వైసీపీలోని కొందరి ప్రశ్న. అందుకే ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ ఉలిక్కి పడుతున్నారట కొందరు పోలీసులు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dwaraka tirumala
  • G Kotthapalli
  • Ganji Prasad case
  • home minister taneti vanitha
  • YCP Leader

తాజావార్తలు

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions