OTR: పొంగులేటి, కొమ్మూరు మధ్య సంభాషణ.. ఆయన హార్ట్ అయ్యారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: మున్సిపల్ ఎన్నికల వేళ.. ఆ మంత్రి అన్న మాటలు మాజీ ఎమ్మెల్యేకు మేకుల్లా గుచ్చుకున్నాయా? పార్టీ ఇన్ఛార్జ్‌తో ఉన్న చనువుకొద్దీ మినిస్టర్ అలా మాట్లాడారా? లేక సీరియస్‌గానే మనసులో ఉన్నది ఆటోమేటిగ్గా బయటికి వచ్చేసిందా? సోషల్ వీధుల్లో చర్చలు మొదలయ్యాక అంతా సర్దుకున్నారా? ఎవరా ఇద్దరు నాయకులు? అంతలా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య?
Hyderabad: చీకటి పడితే చాలు.. రేసింగ్‌లు, స్టంట్‌లతో భయాందోళనలో వాహనదారులు!
Also Read
వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మధ్య జరిగిన మాటల గురించి ఉమ్మడి జిల్లా పాలిటిక్స్‌లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఇది బాగా వైరల్ అవుతోంది. కొమ్మూరును ఉద్దేశించి.. పొంగులేటి అన్న మాటలు తీవ్ర కలకలం రేపాయి. ఆ మాటలతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే.. ఒక దశలో నేను రాజకీయాలు మానేస్తానని అన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరిగింది.
ఈ ఘటన జరిగినప్పుడు పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి మరొకరు కూడా.. ఇదేదో చినికి చినికి గాలి వానలా మారుతుందేమో అనుకున్నారట. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరిగా పని చేయలేదని, మున్సిపల్ ఎన్నికల్లో అయినా సీరియస్ గా వర్కవుట్ చేయమని చెప్పే క్రమంలో పొంగులేటి.. కొమ్మూరును ఉద్దేశించి సగం బుర్ర వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఆ విషయంలో మంత్రి ఉద్దేశ్యం ఏదైనా… బయటికి మాత్రం వ్యతిరేక సంకేతాలు వెళ్ళాయి. మాజీ ఎమ్మెల్యే డీప్‌గా హర్టయ్యారని కూడా ప్రచారం ఊపందుకున్న క్రమంలో.. వెంటనే ఆయనే జోక్యం చేసుకుని వాతావరణాన్ని తేలికపరిచారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే మంత్రి పొంగులేటి అలా అన్నారని తాను అనుకున్న వాళ్ళందరికీ బీ ఫామ్స్ అందాయని, నాకేం అసంతృప్తి లేదన్నట్టుగా చెప్పుకొచ్చారాయన.
EV Owners Alert: మీ కారు బ్యాటరీ లైఫ్ పెంచే 7 మ్యాజిక్ టిప్స్ ఇవే.!
ఈ వ్యవహారం టీ కప్పులో తుఫాన్‌లా ముగిసిపోయినా… కొన్ని డౌట్స్ మాత్రం అలాగే ఉండిపోయాయట. ప్రస్తుతం నాయకులు ఎక్కడ ఏం చేసినా సోషల్ మీడియా ఠక్కున పట్టేస్తోంది. వీడియోలు ట్రెండింగ్‌లోకి వచ్చేసి ఎవరికి నచ్చిన భాష్యాలు వాళ్ళు చెప్పేస్తున్నారు. నాయకుల మధ్య ఫ్రెండ్‌షిప్ ఉండవచ్చు, వాళ్లు సరదాగా మాట్లాడుకోవచ్చుగానీ… ఇలా బహిరంగంగా మాట్లాడుకునే క్రమంలో… సోషల్ మీడియాలో ట్రోల్ అవడం మాత్రం పార్టీ నేతలకు కూడా రాంగ్ ఇండికేషన్స్ పంపినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నలుగురిలో ఉన్నప్పుడు నాయకులు జాగ్రత్తగా ఉండటం బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!