Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Road About Ycp In Charge Burrra Madhusudans Fleeting Visits Trigger Confusion In Kandukur

Off The Road: చుట్టపు చూపుగా కందుకూరు వైసీపీ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ !

Published Date :January 27, 2026 , 11:05 pm
By Sudhakar Ravula
  • చుట్టపు చూపుగా కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్‌ బుర్రా..
  • పార్టీ కార్యక్రమాలతో అంటీ ముట్టనట్టుగా ఇన్ఛార్జ్‌..
  • భారం మొత్తం ద్వితీయ శ్రేణి మీదే, వాళ్ళలో ఫ్రస్ట్రేషన్..
  • గత ఎన్నికల్లో బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు టిక్కెట్‌..
  • సైలెంట్‌ అయిపోయిన మానుగుంట అనుచరగణం..
  • తిరిగి కనిగిరి వెళ్ళాలన్న ప్రయత్నాల్లో బుర్రా..
  • ఆఫీస్‌ ఖర్చులకు కూడా డబ్బుల్లేక అల్లాడుతున్న ద్వితీయ శ్రేణి..
  • పార్టీ వ్యవహారాలతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టు మహీధర్‌రెడ్డి..
  • జిల్లా మార్పు, పోర్ట్‌ క్రెడిట్‌తో జోష్‌ మీదున్న కందుకూరు టీడీపీ..
  • ఎవరూ పట్టించుకోక దిక్కులు చూస్తున్న వైసీపీ కేడర్‌..
Off The Road: చుట్టపు చూపుగా కందుకూరు వైసీపీ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ !
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Road: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిస్థితి అయోమయం.. గందరగోళం అన్నట్టు మారిపోయింది. ఇన్ఛార్జ్‌ బుర్రా మధుసూదన్ యాదవ్ చుట్టుపు చూపుగా వచ్చి వెళ్తుండటం.. ముఖ్యమైన కార్యక్రమాలు సైతం ద్వితీయ శ్రేణి నేతలే పర్యవేక్షించాల్సి రావటంతో కేడర్‌లో నైరాశ్యం పెరుగుతోంది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ లాంటి కార్యక్రమంలో కూడా బుర్రా మమ అనిపించడంతో.. భారమంతా ద్వితీయ శ్రేణి నేతలే మోయాల్సి వచ్చింది. దీంతో… ఇలా ఇంకెన్నాళ్ళంటూ… తీవ్రంగా ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారు నాయకులు. ఇలాగే వదిలేస్తే…. బలంగా ఉన్న నియోజకవర్గాన్ని శాశ్వతంగా మర్చిపోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు నాయకులు. గ్రూప్‌ పాలిటిక్స్‌కు పెట్టింది పేరైన కందుకూరు నియోజకవర్గం రాజకీయం మొత్తం దాదాపు ఆరు దశాబ్దాల పాటు మానుగుంట, దివి కుటుంబాల మధ్యే నడిచింది. అయితే గత ఎన్నికల్లో తొలిసారి ఆ రెండు ఫ్యామిలీల ప్రమేయం లేకుండా పోయింది. టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఇంటూరి నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పై గెలిచారు. ఎన్నికల టైంలో చేసిన మార్పుల్లో భాగంగా… అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం కనిగిరి నుంచి బుర్రాను ఇంపోర్ట్‌ చేసింది. దీంతో ఎన్నికల ముందు నుంచే మహీధర్ రెడ్డి సహా ఆయన ప్రధాన అనుచర గణం అంతా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పార్టీ ఓటమికి అది కూడా ఒక కారణం అంటారు. ఈ పరిస్థితుల్లో ఓటమి తర్వాత కందుకూరు వైసీపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు చెబుతున్నారు కార్యకర్తలు.

తిరిగి కనిగిరి వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ కందుకూరును లైట్ నియోజకవర్గాన్ని లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏదో… పెద్దోళ్ళు ఓ బాధ్యత నెత్తినేశారు. మనం కూడా కాదనకుండా కొన్నాళ్ళ పాటు అలా… అలా టైంపాస్‌ చేసేస్తే పోలా అన్న ధరణితో నొప్పింపక.. తానొవ్వక అన్నట్టు పండక్కో.. పబ్బానికో మెరుపు తీగలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారట. సరే… సార్‌ రాకపోతే పోయారు. కనీసం ఆఫీస్‌ ఖర్చుల కోసమైనా డబ్బులిస్తారా అంటే… అదీ లేదంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణ భారం కలగలిసి తడిసి మోపెడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది కందుకూరు వైసీపీ ద్వితీయ శ్రేణి. అదే సమయంలోమహీధర్ రెడ్డి కందుకూరులోని తన సొంత కార్యాలయానికి తరచూ వస్తూ అనుచరులకు అందుబాటులో ఉంటున్నా… వైసీపీ వ్యవహారాలతో మాత్రం టచ్‌ మీ నాట్‌ అంటున్నారు. అసలాయన వైసీపీలో ఉన్నారా.. లేరా అన్న చర్చ సైతం జరుగుతోంది నియోజకవర్గంలో. 2029 ఎన్నికల్లో కచ్చితంగా కందుకూరు నుంచే పోటీ చేస్తానని సన్నిహితులతో చెబుతున్న మానుగుంట ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదట.

మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపింది. ఆ క్రమంలో ఈ ప్రాంతానికి కీలకమైన రామాయపట్నం పోర్టు కూడా ప్రకాశం జిల్లాలోకి వచ్చినట్లైంది. జిల్లా మార్పు, పోర్ట్‌ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుని పట్టు తగ్గకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ. దీన్ని ఇలాగే కొనసాగిస్తే… కందుకూరు తమ కంచుకోట అవుతుందన్నది తెలుగుదేశం నేతల అభిప్రాయం. ఇలాంటి టైంలో ఇన్ఛార్జ్‌ ఉన్నా లేనట్టుగా మారిపోవడం, కీలక నేత మహీధర్ రెడ్డి సైలెంట్ కావటంతో వైసీపీ కేడర్‌లో గందరగోళం పెరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం కంటే ముందుగానే మేల్కొవటం మంచిదంటూ అధిష్టానానికి విన్నవించుకుంటోంది కేడర్‌. కందుకూరు ఫ్యాన్‌ ఎప్పుడు గిరగిరా తిరుగుతుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh political news
  • Burra Madhusudan Yadav
  • Kandukur YCP
  • Kandukur YCP internal crisis
  • Kandukur YSRCP politics

తాజావార్తలు

  • AP Assembly Special Session: రేపే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Ancient Human Secrets: స్త్రీ, పురుషుల కలయిక ఎలా జరిగింది..? ప్రాచీన రహస్యాన్ని బయటపెట్టిన కొత్త అధ్యయనం..

  • IPL vs PSL: “బాప్ బాప్ హోతాహై”.. పాక్ లీగ్ మొత్తం కలిపినా ఆర్సీబీ విలువకు సరిపోదు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

  • Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions