Site icon NTV Telugu

Off The Record: రాజకీయంగా విష్ణు సంతృప్తికరంగా లేరా?

Vishnu Otr

Vishnu Otr

ఆ సీనియర్‌ ఎమ్మెల్యే మిత్రపక్షాలను గట్టిగా టార్గెట్‌ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? చేతకాకుంటే సన్యాసం తీసుకోవాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చాయి? ఆ కాషాయ నేత కొత్త అగ్గి రాజేస్తున్నారా? అసలు ఆయన కోపానికి కారణం ఏంటి? ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవర్ని కాల్చాలనుకుంటున్నారు? పెన్మత్స విష్ణుకుమార్ రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్‌ బీజేఎల్పీనేత. వైసీపీ అంటే అస్సలు గిట్టదని చెప్పుకుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా వున్నా… బహిరంగ వేదికల మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసి వేడి పుట్టిస్తుంటారాయన. 2014లో తొలిసారి విశాఖ ఉత్తర స్ధానం నుంచి పోటీ చేసి గెలిచారాయన. 2019లో ఆయనది నాలుగో స్థానం. ఇక 2024 వచ్చేసరికి ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులతో మళ్ళీ ఈ సీనియర్ నేతకు చాన్స్ దక్కింది. సమీకరణలన్నీ కలిసి వచ్చి…ఈ సారి బంపర్‌ మెజార్టీతో గెలిచారాయన.

నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఓకే అనుకుంటున్నా…. రాజకీయంగా మాత్రం సంతృప్తిగా లేరట విష్ణుకుమార్‌ రాజు. అందుకే ఇటీవల కూటమి పెద్దల మీద చిటపటలు పెరిగిపోతున్నాయంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సమయం కోసం ఎదురు చూస్తున్న రాజు ఇక ఓపెన్ అయిపోవడమే కరెక్ట్ అని భావించినట్టు కనిపిస్తోంది. అధికారంలో వుండీ యాక్షన్ లేకపోతే సన్యాసమే బెటర్ అంటూ ఇటీవల మిత్రపక్షాల మీదే విరుచుకుపడ్డం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది. దీని వెనుక బలమైన కారణం మాత్రం తన రాజకీయ ప్రత్యర్ధి, వైసీపీ సమన్వయకర్త కేకేరాజును ఇరకాటంలో పడేయడమేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

టీడీపీ భుజం మీద తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తున్నారట విష్ణు. 2020 ఫిబ్రవరి 27న ప్రతిపక్షనేత హోదాలో ప్రజాచైతన్య యాత్ర కోసం విశాఖకు వచ్చారు చంద్రబాబు. అప్పుడు ఆయన్ని ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నాయి వైసీపీ శ్రేణులు. ఆ తర్వాత జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు కాస్త డిఫరెంట్ గా విశాఖలో ఇటువంటి అనుభవమే ఎదురైం ది. ఆయనను హోటల్ దాటి రాకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ రెండు ఎపిసోడ్స్‌లో నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకేరాజు పేరు ప్రముఖంగా వుంది. కూటమి అధికారంలోకి రాగానే… ముఖ్య నేతలు ఇద్దర్నీ అడ్డుకున్న కేకే రాజుకు చుక్కలు చూపిస్తారని భావించారట అంతా. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించడం లేదన్న అసహనం టీడీపీ కేడర్‌లో పెరుగుతోందట. ఇటీవల సీఎం చంద్రబాబు భీమిలి నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో కూడా ఎయిర్పోర్ట్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసు కోవాలన్న డిమాండ్‌ వినిపించింది.అన్నీ గుర్తున్నాయని….ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రస క్తేలేదని సముదాయించారు సీఎం. మరోవైపు, ఎన్నికలలో ఓటమి తర్వాత రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్ళిన కేకేరాజులో వైసీపీ అధిష్టానం ధైర్యం నింపింది.రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కోవడం కోసమే అన్నట్టు కీలకమైన విశాఖజిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.

ప్రస్తుతం బాబూ ష్యూరిటీ-మోసం గ్యారెంటీ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కేకేరాజు. ఈ పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు మరోసారి గతాన్ని తవ్వడం ఆసక్తికరంగా మారింది. అప్పట్లో ఇబ్బందులు పడ్డ వంగలపూడి అనిత హోంమంత్రి అయ్యారు కదా….మరి చర్యలకు ఎందుకు ఆలస్యం అంటున్నారు ఎమ్మెల్యే. పైగా, అన్నీ దేవుడే చూసుకుంటాడన్న ఆధ్యాత్మిక ధోరణి ఉంటే… పదవులు ఎందుకు సన్యాసం తీసుకుంటే బెటర్ అనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారాయన. ఈ స్ధాయిలో విష్ణు కుమార్ రాజు మిత్రపక్షాన్ని టార్గెట్ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. దీనిని బట్టి చూస్తుంటే… టీడీపీ, జనసేన పెద్దలు యాక్షన్‌ తీసుకుని కేకే ారజుకు చెక్‌ పెడితే… నియోజకవర్గంలో నేను కూడా సేఫ్‌ జోన్‌లో ఉంటానన్నది ఆయన అభిప్రాయంగా విశ్లేషిస్తున్నారు కొందరు. మరి విష్ణుకుమార్ రాజుది ధర్మాగ్రహమని కూటమి పెద్దలు నిగ్రహించుకుంటారా…..?. లేక యాక్షన్లోకి దిగుతారా ….? అన్నది ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.

 

Exit mobile version