OTR : తెలంగాణలో ఫెవికాల్ బ్యాచ్! మాజీలు అయినా కుర్చీలు వదలరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఫెవికాల్ బ్యాచ్ తయారైందా? పదవీ కాలం ముగిసిపోయినా… కుర్చీలకు అంటుకుని పోయి… దిగడానికి ససేమిరా అంటోందా? వాళ్ళకు ఇప్పుడు జనం సొమ్ము అంటే… మంచినీళ్ళ ప్రాయంగా కనిపిస్తోందా? మాజీలు అయ్యాక కూడా… అనుభవించు రాజా…. అంటూ విచ్చలవిడిగా ప్రజా ధనంతో జల్సాలు చేస్తున్నారా? ఏదా ఎక్స్ట్రా బ్యాచ్? ఏంటా ఫెవికాల్ స్టోరీ? తాము మాజీలైపోయినా సరే… తాజాలమన్నట్టే వ్యవహరిస్తున్నారట తెలంగాణలోని కొన్ని కార్పొరేషన్స్ ఛైర్మన్లు. పదవీ కాలం ముగిసి పోయినా….ఆయా కార్పొరేషన్స్‌లో పట్టు తగ్గకుండా పెత్తనాల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొందరు నేతలు అజమాయిషీ చెలాయిస్తున్నారన్నది ఇప్పుడు కొన్ని కార్పొరేషన్స్‌లో జరుగుతున్న చర్చ. అయితే… వాళ్ళు పదవిలో ఉన్నప్పుడే అంతంత మాత్రంగా స్పందించిన అధికారులు ఇప్పుడసలు లెక్క చేస్తారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. పదవీకాలం ముగిశాక కూడా పెత్తనం చెలాయించడం అంత తేలికా అన్న సందేహాలు ఒకవైపు ఉన్నాసరే… కొంత మంది కార్పొరేషన్ మాజీ చైర్మన్స్ మాత్రం కుర్చీలకు ఫెవికాల్ పూసుకుని మరీ…అతుక్కుపోతున్నారని, అదేదో పర్మినెంట్ అన్నట్టు సీటు వదలడానికి అస్సలు ఇష్టపడటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే…తమకు రెన్యువల్ ఖాయం అనుకునే వాళ్లే… ఇలా సీటు కోసం పోటీ పడుతున్నారన్నది ఇంకో వెర్షన్.
ఇదే అంశంపై ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాత్రం… పదవిలో ఉండగానే మంత్రులు పట్టించుకోలేదు, అధికారులు చెప్పింది చేయలేదు. ఇప్పుడిక కుర్చీ లేనప్పుడు ఏం వింటారులే అంటూ నిష్టూరంగా చర్చ పెట్టినా… ఆ వాసనలు వదులుకోవడానికి మాత్రం ఇష్టపడలేదట. ఇక తాజాగా… జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలకు ప్రభుత్వం తరపున మంత్రి వాకిటి శ్రీహరితో పాటు శాట్ మాజీ చైర్మన్ శివసేనా రెడ్డి కూడా వెళ్ళారు. దీని గురించే ఇప్పుడు రచ్చ అవుతోంది. మాజీ అయ్యాక కూడా… ఆయన అధికారిక పర్యటనకు వెళ్లడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఐతే ప్రభుత్వమే అధికారికంగా ఒక టీంను ఎంపిక చేసింది కాబట్టి…. ఆయన వెళ్లినట్టు చెబుతోంది బృందం. శాట్ మాజీ చైర్మన్ గా… ప్రభుత్వం ప్రతినిధి బృందంలో శివసేనా రెడ్డిని చేర్చారని.. అందుకే విదేశీ పర్యటనకు వెళ్ళారన్నది అట్నుంచి వినిపిస్తున్న వివరణ. ఆయన అధికారిక ఛాంబర్లోకి వెళ్లడం లేదని, ప్రభుత్వం ఎంపిక చేసిన కమిటీలో సభ్యుడిగా జపాన్ వెళ్లినట్టు చెప్తున్నారు ఆ శాఖ అధికారులు. ఆయన సంగతి అలా ఉంచితే… కొంత మంది కార్పొరేషన్ మాజీ ఛైర్మన్స్ మాత్రం తామింకా ఆ పోస్ట్‌లోనే ఉన్నట్టు ఫీలైపోతూ… పెత్తనం చెలాయిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న కొందరు మాత్రం… ఎంతైనా అధికారం కదా…! ఆ టేస్ట్ తెలిశాక.. వదలటం అంత ఈజీ కాదులే అంటూ చమత్కరిస్తున్నారు. అయితే… అనుభవిస్తున్నది ప్రజా ధనం అన్నది సంగతి గుర్తుంచుకోవాలంటూ చురలకలంటిస్తున్నారు.
Also Read
- Tags
- NTV Telugu
- off the record
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..