కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లేదా..? ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా..? పక్క పార్టీ హడావుడి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సైలెంట్‌గా వుందా? ఊరంతా ఒకదారి లో ఉంటే.. వీళ్ళంతా ఏదో దారిలో ఉన్నట్టు కనిపిస్తుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు క్లారిటీ రావడం లేదా? ప్రత్యర్ధి తన ఘనతగా గగ్గోలు పెట్టీ చెబుతుంటే… అధికార పార్టీ నేతలకు మాత్రం ఇంకా ఏం చేయాలి అనే స్పష్టత ఉన్నట్టు లేదు. GST.. పై బీజేపీ ప్రజల మీద భారం భారీగా తగ్గించామని ఊరు వాడ ప్రచారం చేస్తూ ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకోవాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. GST భారం మోపింది బీజేపీ.దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ టాక్స్ అని ప్రచారం చేసినా… GST తగ్గించడానికి కాంగ్రెస్ కారణం అని చెప్పుకోలేక పోతుంది. బీజేపీనే భారం పెంచి… బీజేపీనే ట్యాక్స్ తగ్గించి… తన గొప్పతనమే అని చెప్పుకునే పనిలో బీజేపీ ఉంటే… కాంగ్రెస్ నేతలు మాత్రం ఏం చేయాలి అనే క్లారిటీ లేదు. ఒక్కొక్కరిది…ఒక్కో మాట అన్నట్టు ఉంది పరిస్థితి.
GST పై ప్రభుత్వ విధానం… పార్టీ అభిప్రాయం వేరు వేరుగా ఉందా..? అనే చర్చ నడుస్తుంది. ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తి వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి 2 వేల కోట్లు ప్రభుత్వం మీద GST తగ్గింపు భారం పడుతుందని… ప్రజల కోసం భరిస్తాం అని.. చెప్పుకుంటూ వచ్చారు. ఇక గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… బీజేపీ జనం జేబుకు చిల్లు పెట్టీ… ఇప్పుడేదో ట్యాక్స్ లు తగ్గించినట్టు ప్రకటించడాన్ని తప్పు పట్టారు. ఇన్నేళ్లు ప్రజల మీద పన్నులు మోత మోగించి… ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వాటిని తగ్గించి గొప్పలు చెప్పుకోవడం ఎంటని.. ప్రజలు దీన్ని గమనించాలని అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయంగా అయినా… వాస్తవానికి కూడా gst వేసింది ఎవరు..? తగ్గించింది ఎవరనే చర్చ చేయాల్సిన పార్టీ… దానిపై క్లారిటీ కూడా ఇవ్వలేకపోతుంది అనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తుంది.
స్పాట్
GST పై.. బలంగా వాయిస్ వినిపించాల్సిన కాంగ్రెస్ ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు…? నాయకులకు దిశా నిర్దేశం చేయకుండా.. ప్రభుత్వం లో ఉన్న వాళ్ళు ఒకలా… పార్టీ వేదిక పై మరోలా మాట్లాడితే… రాజకియంగా ఎలా ఫేస్ చేయగలం అనే ఆలోచన అయినా పార్టీ చేయలేదా అనే చర్చకు తావిచ్చినట్టు అవుతుంది అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
