Site icon NTV Telugu

Off The Record : తాము న్యూట్రల్ అని పదేపదే బీజేపీ చెప్పుకోవాల్సిన వస్తోందా?

Bjp

Bjp

అసెంబ్లీలో బీజేపీపై అటు కాంగ్రెస్…ఇటు BRS ఫైర్ అవుతున్నాయి. అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని BRS ఆరోపిస్తుంటే… బీజేపీ, BRS ఒక్కటేనని అధికార పార్టీ అంటోంది. తాము న్యూట్రల్‌గా ఉన్నాం కాబట్టే రెండు పక్షాలు విమర్శలు చేస్తున్నాయని కాషాయ పార్టీ కౌంటర్‌ ఇవ్వాల్సి వస్తోంది. అటు ఇటు మాట్లాడలేక అడకత్తెరలో పోక చెక్కలా కమలం పార్టీ పరిస్థితి తయారైందా? అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై హాట్ హాట్ చర్చే జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో సాగింది. BRS సభ్యులు సభ నుంచి సస్పెండ్ అయ్యారు కూడా. బీజేపీ కూడా తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహించామని అంటోంది. చాలా సమస్యలపై తమ వాదనను గట్టిగా వినిపించామని అంటున్నారు. అయితే ఒకట్రెండు విషయాల్లో ఆ పార్టీ సభ్యులు స్పాంటేనియస్‌గా స్పందించలేక పోయారనే విమర్శ కూడా రావడం కమలం పార్టీకి ఇబ్బందిగా మారింది.

అయితే ఈ సమావేశాల్లో బీజేపీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీని పలు సందర్భాల్లో టార్గెట్ చేస్తూ మాట్లాడాయి. అధికార పార్టీకి బీజేపీ వత్తాసు పలుకుతోందని BRS కామెంట్ చేసింది. ప్రతిపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని…BRS నేతల్ని బీజేపీ కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు విమర్శనాస్త్రాలు సంధించారు. అక్రమ మైనింగ్ విషయంలో ఫిర్యాదు చేసినా, కేంద్రం పట్టించుకోవడం లేదని BRS, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఇచ్చినా…సీబీఐని రంగంలోకి దించడంలేదని కాంగ్రెస్ పార్టీ, బీజేపీని విమర్శిస్తున్నాయి. అటు ఇటు ఆరోపణలతో కాషాయ పార్టీ శీల పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.

తాము ఎవరికీ వంత పాడటం బీజేపీ చెప్పుకోవాల్సి వస్తోంది. రెండు పక్షాలు తమను టార్గెట్ చేశాయని అంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. రెండు పార్టీలకీ తాము దూరమని చెప్పుకుంటున్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యలపైన చర్చ జరగకుండా….అటు అధికార పక్షం…ఇటు ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించాయని మండి పడుతున్నారు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు అలవాటయ్యిందని ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ విమర్శలను ఎదుర్కోవడమే బీజేపీకి పెద్ద టాస్క్‌గా మారింందన్న డిస్కషన్ జరగుతోంది.

Exit mobile version