OTR : సారీ బ్రో.. నో ఎంట్రీ!” వైసీపీ నేతలకు కూటమి పార్టీల షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సారీ బ్రో…. సీట్లు ఖాళీ లేవు. అసలు మీకు నో ఎంట్రీ…. అంటూ అక్కడ వైసీపీ నాయకులు కొందరికి కూటమి పార్టీలు ముఖం మీదే చెప్పేస్తున్నాయట. ప్రస్తుతానికైతే.. గాలి వాటపు గందరగోళాలు వద్దని కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ముంగిట్లో బలమైన నేతలు వస్తామంటే వద్దనరు. కానీ… అక్కడ మాత్రం ఎందురు సారీ చెబుతున్నారు? ఏ ఉమ్మడి జిల్లాలో ఉందా పరిస్థితి? ఎన్నిక ఏదైనా…. టైం దగ్గర పడుతుందంటే చాలు…. జంపింగ్ జపాంగ్‌లకు కొదవే ఉండదు. పార్టీలు, సిద్ధాంతాలతో పనిలేని, అధికారమే పరమావధిగా భావించే పొద్దు తిరుగుడు పువ్వులు పక్క చూపులు చూస్తూనే ఉంటాయి. నిన్నటి దాకా ఉన్న పార్టీ కండువాను లెఫ్ట్ లెగ్‌తో తన్నేసి కొత్త కండువా కప్పుకోవడం షరా మామూలైపోయింది. అయితే… ఇప్పుుడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలాంటి కప్పదాటు వ్యవహారాలు కుదరవని చెప్పేస్తున్నారట.
Also Read
వైసీపీని వీడి కూటమి పార్టీల్లోకి జంప్ అవడానికి ఉమ్మడి చిత్తూరుకు చెందిన పలువురు కీలక నేతలు సూట్‌కేస్ సర్దుకుని రెడీగా ఉన్నా… కూటమి వైపు నుంచి సారీ… నో ఎంట్రీ అన్న సమాధానం వస్తోందట. ఈ పరిణామంతో అటు వైసీపీని వీడలేక, ఇటు కూటమిలోకి రాలేక పలువురు వలస నేతలు క్రాస్‌రోడ్స్‌లో నిలబడ్డారని చెప్పుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. అయితే.. చాలాకాలం పాటు వైసీపీ నుంచి కూటమి వైపు నేతలెవరూ పెద్దగా చూడలేదు. కానీ… ఇప్పుడు స్థానిక ఎన్నికల ముంగిట్లో… సూట్‌కేసులతో రెడీగా ఉన్నవారికి ఊహించని రీతిలో కూటమి పార్టీల గేట్లు మూసేస్తున్నారన్నది లోకల్ హాట్. జిల్లాలోని ఆరు మున్సిపల్ ఛైర్మన్లు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ సీట్లు హాట్ కేకుల్లా మారాయి. రెండు చోట్ల మేయర్ టికెట్ దక్కించుకుంటే చాలు గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారట చాలామంది. అందుకే మునుపెన్నడూ లేనంత పోటీ పెరిగిందని అంటున్నారు.
తిరుపతి టికెట్ కోసమైతే…. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యప్రసాద్, ఎన్నికల ఇన్చార్జి నూకసాని బాలాజీల వద్దకు పదేపదే విజ్ఞప్తులు వెళ్తున్నాయట. అటు నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లోనూ ఇదే సీన్ నడుస్తోంది. మున్సిపల్ చైర్మన్ పదవులపై కన్నేసిన కొందరు వైసీపీ నేతలు.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వద్దకు రాయబారాలు నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం…ఎంతైనా ఫర్లేదంటూ ఎమ్మెల్యే చెవిలో వేసినా ఆయన ఏమాత్రం కరగలేదని తెలిసింది. ఇప్పుుడు టెంప్ట్ అయిపోయి అలాంటి వారిని వైసీపీ నుంచి తీసుకుంటే… ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని, ఐదేళ్ళు లాఠీదెబ్బలు తిన్న క్యాడర్ ఊరుకోబోదని, అనవసరమైన తల నొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకని జిల్లా పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు చిత్తూరు కార్పొరేషన్, పలమనేరు మున్సిపాలిటీలోను ఈ పరిస్థితి తీవ్రంగానే ఉంది. మేయర్ పీఠంపై కన్నేసిన కొందరు వైసిపి నేతలు సైకిల్ ఎక్కేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినా, స్థానిక కూటమి నాయకత్వం మాత్రం ససేమిరా అంటోందట. ప్రస్తుతానికి కొత్త చేరికలకు గేట్లు పూర్తిగా మూసేయాలన్న భావనతోనే ఎమ్మెల్యేలు ఉన్నారన్నది లోకల్ టాక్. ఒకటి రెండు నియోజకవర్గాల్లో మినహాయిస్తే, మిగిలిన చోట్ల ఎక్కడా పెద్దగా చేరికలు కనిపించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు.
అటు వైసీపీ నేతలు పైకి మాత్రం తమకు పార్టీ మారే ఆలోచన లేదని చెబుతున్నా.. లోలోపల చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడమే అసలు కారణమని అంటున్నారు. ఆలా ఆగిన వాళ్ళలో ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఉన్నారట. ఇన్నాళ్లు క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి, తీరా ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తే.. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మన సినిమా మరోలా ఉంటుందన్న భయం చాలామంది ఎమ్మెల్యేల్లో ఉందట. ఇదే టైంలో తిరుపతి వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం వైసీపీ నుంచి వచ్చేవాళ్ళకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేయమని చెప్పినట్టు తెలిసింది. మరీ… పెద్ద స్థాయి లీడర్ అయితే ఆలోచిద్దాంగానీ…. కింది స్థాయిలో అయితే… అసలు డిస్కషనే వద్దని చెప్పారట. ఇదే దారిలో జనసేన నేతలు సైతం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా ఉమ్మడి చిత్తూరులో “మేం పార్టీలోకి వస్తాం మొర్రో అని అట్నుంచి అంటున్నా… సారీ బ్రో అన్నది ఇట్నుంచి సమాధానం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేంత వరకు ఈ విధానాన్నే కొనసాగించి, ముందుగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకులకు న్యాయం చేయాలన్నది కూటమి వ్యూహం అని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?