MLAల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం…స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా..? నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ? జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఆ ఎన్నికలు కూడా వస్తాయా..? ప్రతిపక్షం ఆశలు నెరవేరుతాయా..? ఒకరు కాదు… ఇద్దరి పైనా వేటు పడుతుందా..? అనర్హత వేటు నుండి బయటపడాలి అంటే… ఆధారాలు పక్కా ఉండాలి. ఇప్పుడా ఆధారాలు… ఆ ఇద్దరి విషయంలో ఉన్నాయా..? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుప్రీం ఆదేశాలతో ఇద్దరిపై అయిన వేటు తప్పదేమో అనే చర్చ నడుస్తోంది. మణిపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను సుప్రీం ఆదేశాలతోనే స్పీకర్ అనర్హత వేటు వేశారు. డైరెక్ట్‌గా ఇన్‌వాల్వ్ అయిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై వేటు తప్పదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… స్పీకర్ అభిప్రాయం ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. నిజంగా అనర్హత పిటిషన్లపై విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మొదలుపెడితే… ఇప్పటికే MLA లకు నోటీసులు ఇచ్చారు. MLA లు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే అనర్హత వేటు పడాలి అంటే… గెలిచిన పార్టీని ధిక్కరించారనే అభిప్రాయం… ఆధారాలు ఉండాలి. ఇవేమీ దొరకొద్దని కొందరు.. నేను పార్టీ మారలేదని కొందరు…అది కాంగ్రెస్ జెండా కాదు జాతీయ జెండా అని చెప్పుకొచ్చారు.
పాలమూరు జిల్లాలో ఎమ్మెల్యే అయితే…ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ఎవరి ఎత్తుగడ వాళ్ళు వేస్తున్నారు. అయితే వీటి నుంచి తప్పించుకునే పరిస్థితి ఇద్దరు నేతలకు లేదని చర్చ జరుగుతుంది. దీంట్లో ఒకరు ఖైరతాబాద్ MLA దానం నాగేందర్. Brs పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ బి ఫార్మ్ మీద సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. దీంతో దానం మీద కొంచెం ముందో… తర్వాతనో… వేటు ఐతే పడుతుంది అనేది చర్చ. మరో చర్చ ఏంటంటే… మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి…వ్యవసాయ శాఖపై అనుభవం ఉంది. దీంతో ఆయన సలహాలు ప్రభుత్వం తీసుకోవాలని…ఆయనకు సలహాదారు పదవి కట్టబెట్టింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారు పదవి ఎలా ఇస్తారు…? ఇది ఫిరాయింపుల చట్టం పరిధికి వర్తిస్తుందనే చర్చ. ఇద్దరు అనర్హత వేటు పడేవారిలో ఉంటారని టాక్. కోర్టు మూడు నెలలే సమయం ఇచ్చింది కాబట్టి.. ఇంతలో వేటు పడితే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు దానం, పోచారం నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… ఇంతకీ స్పీకర్ కి సుప్రీంకోర్టు తీర్పు అందిందా..? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందనేది క్లారిటీ వస్తే కానీ… ఎన్నికల వరకు తతంగం నడవదు. అప్పటి వరకు ఇలాంటి చర్చలు నడుస్తుంటే ఉంటాయి.
