Site icon NTV Telugu

Off The Record : శేరిలింగంపల్లిపై బీఆర్ఎస్ హైకమాండ్ ఫోకస్

Brs

Brs

గ్రేటర్‌ లో ఏ నియోజకవర్గంపై పెట్టని ఫోకస్…బీఆర్ఎస్ ఆ ఒక్క సెగ్మెంట్‌పై పెట్టింది. అక్కడే చేరికలు ఎక్కువగా నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోనే కార్యక్రమాలు చేపడుతోంది. ఎందుకంటే, కేటీఆర్ పర్సనల్‌గా ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత పట్టుదల? గ్రేటర్‌పై ఏ నియోజకవర్గంపై పెట్టని ఫోకస్…బీఆర్ఎస్ ఆ ఒక్క సెగ్మెంట్‌పై పెట్టింది. అక్కడే చేరికలు ఎక్కువ నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎందుకంటే, కేటీఆర్ పర్సనల్‌ ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత పట్టుదల?

తెలంగాణలో అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి. గ్రేటర్‌లో బీఆర్ఎస్ గెలిచిన అత్యధిక నియోజకవర్గాల్లో ఇదొకటి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ భీఫాంతో గెలిచిన అరికెపూడి గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. మొన్న జరిగిన డివిజన్ల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గ పరిధిలో 24 డివిజన్ లు ఏర్పడ్డాయి. అందుకే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులే ఎక్కువ మంది గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అయితే గాంధీ పార్టీ మారడంతో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఇక్కడ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఐటీ ఓటర్లు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న శేర్లింగంపల్లిలో గతంలో తాము చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తే కలిసి వస్తుందని అనుకుంటున్నారు. అందుకోసమే శేర్లింగంపల్లి నుంచి పార్టీలోకి ఎక్కువగా జాయినింగ్ లు చేసుకుంటున్నారు కేటీఆర్. గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఆరు జాయినింగ్ ప్రోగ్రాంలలో కేటీఆర్ స్వయంగా పాల్గొన్నారు.

మరోవైపు పార్టీకి సంబంధించిన కీలక ప్రోగ్రాంలు కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. మొన్న జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకలతో పాటు నిన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు కేటీఆర్ స్వయంగా హాజరయ్యారు. ఇలా ఎక్కువ డివిజన్లు ఉన్న శేర్లింగంపల్లి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. అయితే ఒకే నియోజకవర్గంలో ఎక్కువ ఫోకస్ పెట్టి చేరికలను ప్రోత్సహిస్తుండటం బీఆర్ఎస్‌కు మరో తలనొప్పిగా మారింది. ఉద్యమ కాలం నుంచే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న తమను పట్టించుకోకుండా కొత్తవారిని జాయిన్ చేసుకొని వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని అంటున్నారట. అరికెపూడి గాంధీని డౌన్ చేసేందుకే ఆయన అనుచరులను పార్టీలో జాయిన్ చేర్చుకుంటున్నామని చెబుతున్నారు పార్టీ సీనియర్ నేతలు. మొత్తానికి బీఆర్ఎస్ టార్గెట్‌ శేరిలింగంపల్లి వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

 

 

Exit mobile version