Site icon NTV Telugu

Off The Record : జిల్లా నాయకత్వాలకు కాంగ్రెస్ పెద్దల దిశా నిర్దేశం?

Congress

Congress

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల విషయంలో కాంగ్రెస్‌ ఆలోచన ఎలా ఉంది? రిజల్ట్స్‌పై ఆ పార్టీకున్న లెక్కలేంటి? గాంధీభవన్ నుంచి జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు వెళ్ళాయి? టఫ్‌ అనుకున్న జిల్లాల్లో రెడీ చేసుకుంటున్న స్కెచ్‌ ఏంటి? క్యాంప్‌ పాలిటిక్స్‌కు ఛాన్స్‌ ఉందా? లెట్స్‌ వాచ్‌. అన్నీ గెలిచి తీరాల్సిందే..! అవకాశం ఉన్న చోటల్లా… వచ్చే వాళ్లను కలుపుకుని పోండి..అంతేగానీ…. అవకాశం మాత్రం చేజారొద్దు. జిల్లా నాయకత్వాలకు కాంగ్రెస్‌ పార్టీ పెద్దల దిశా నిర్దేశం ఇది. ఈ ఆదేశాల చుట్టూనే ఇప్పుడు రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. మున్సిపల్ ఫలితాలు వచ్చిన వెంటనే అధికార పార్టీ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ కూడా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా సీట్లు గెలుస్తామని ధీమాగా ఉంది కాంగ్రెస్‌ అధినాయకత్వం.

అయినాసరే… ఛాన్స్‌ తీసుకోకూడదన్న ఉద్దేశ్యంతో… ఎన్నికల పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా ఇన్చార్జ్‌లు, ఇన్ఛార్జ్‌ మంత్రులను అప్రమత్తం చేస్తూ వచ్చింది. అలాగే ఫలితాల వెల్లడి, ఛైర్మన్స్‌ ఎన్నికలు పూర్తయ్యే దాకా… ఈ అలర్ట్‌నెస్‌ను కొనసాగించాల్సిందేనని డిసైడయ్యారట పార్టీ పెద్దలు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ ఎలక్షన్స్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఛైర్మన్స్ ఎన్నిక టైంలో కూడా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా పావులు కలపాలని ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ఇప్పటిదాకా ఎలా ఉన్నా… రేపు ఒక్కొక్కటిగా ఫలితాల వెల్లడి మొదలయ్యాక పరిస్థితుల్లో మార్పులు జరగవచ్చని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్‌ పెద్దలు. అందుకే కింది స్థాయికి అలర్ట్‌ పంపుతున్నారట.

మున్సిపాలిటిలో అయినా, కార్పొరేషన్‌లోనైనా… గెలుపునకు అవసరమైన మేజిక్‌ వస్తే సరేసరి. లేదంటే… ప్రత్యర్థులకు ఛాన్స్‌ ఇవ్వకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతూ నిర్ణయాలు తీసుకునేలా స్కెచ్‌ రెడీ అయ్యిందట. క్యాంప్ రాజకీయాలు కూడా పెరుగుతున్నందున ఛైర్మన్, మేయర్ ఎన్నికలు అయ్యే వరకు పార్టీ నేతలు ఎవరూ జారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఎంత అధికారంలో ఉన్నా… మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్‌ కదా అన్నది కాంగ్రెస్‌ పెద్దల అభిప్రాయం. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న సిపిఐ, సిపిఎంలతో కలిసి కొన్నిచోట్ల, ఒంటరిగా ఎక్కువ చోట్ల పోటీ చేసింది కాంగ్రెస్‌. ఇక ఫలితాల తర్వాత అవసరాన్ని బట్టి అందర్నీ కలుపుకుని పోవాలని, కొత్తగూడెం లాంటి చోట్ల మరింత ఫోకస్ చేయాలని గాంధీభవన్‌ నుంచి ఆదేశాలు వెళ్ళాయట.

ఇక ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి చోట్ల పరిస్థితి కొంత టఫ్ గా ఉన్నా… అక్కడ ఎంఐఎం కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ బలాన్ని కూడా తనతో కలుపుకుని పోవాలని, అవసరాన్నిబట్టి కలిసి వచ్చే వాళ్ళతో పాటు సొంత పార్టీ నాయకులను క్యాంప్‌లకు తీసుకువెళ్ళాలన్న ఆదేశాలు కూడా ఉన్నాయట. ప్రత్యర్ధి పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు… వాళ్ళలో తమతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరో జాగ్రత్తగా గమనించి లెక్కలు తీసి పెట్టుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్టు సమాచారం. ఈ బాధ్యత మొత్తాన్ని ఇన్ఛార్జ్‌ మంత్రులకు అప్పగించారట. ఏది ఏమైనప్పటికీ వీలైనన్ని ఎక్కువ మేయర్, ఛైర్మన్‌ పీఠాలు తమ ఖాతాలో ఉండాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోంది కాంగ్రెస్‌. ఆ ప్రకారం క్యాంప్‌ రాజకీయాలు కూడా గట్టిగానే ఉండవచ్చంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version