Site icon NTV Telugu

Off The Record : డేంజర్ జోన్ లో అజారుద్దీన్ మంత్రి పదవి..?

Azar

Azar

అజహరుద్దీన్‌ మంత్రి పదవి సేఫా? లేక డేంజర్‌ జోన్‌లో ఉందా? మినిస్టర్‌గా ప్రమాణం చేసి ఐదు నెలలు గడిచిన క్రమంలో ఆయన ఫ్యూచర్‌ ఎలా ఉండబోతోంది? ఇంకో నెల రోజుల్లో కచ్చితంగా చట్టసభకు ఎన్నికవుతారా? ఆ పరంగా కాంగ్రెస్‌ లెక్కలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారు? వాళ్ళ కాన్ఫిడెన్స్‌ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజారుద్దీన్. గవర్నర్ కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ… కేబినెట్ ఆమోదించింది. అజారుద్దీన్‌తోపాటు ప్రొఫెసర్‌ కోదండరాం పేరును కూడా క్లియర్‌ చేసింది కేబినెట్‌. కానీ… ఆ అంశం కోర్టులో పెండింగ్‌ పడటం, ఇప్పటికీ గవర్నర్ నుండి క్లారిటీ రాకపోవడం లాంటి కారణాలతో…. అజారుద్దీన్‌ మంత్రిగా అయితే బాధ్యతలు తీసుకున్నారుగానీ… ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ క్రమంలో…. రేపు ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ మంత్రి పదవి తీసుకుని ఆరు నెలల పూర్తవుతుంది. ఆలోగా ఆయన ఎమ్మెల్సీ అవకుంటే నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా మంత్రి పదవి పోతుంది.

ఆ లెక్కన చూస్తే…. అజహర్‌కు ఇంకా నెల రోజులే టైం ఉంది. దీంతో… ఆయన మంత్రి పదవి ఉంటందా? ఊడుతుందా అంటూ చర్చలు మొదలయ్యాయి తెలంగాణ రాజకీయవర్గాల్లో. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కోర్ట్‌ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న భావనలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. ఆలోగా ముందు గవర్నర్‌ను సంప్రదించాలని, అక్కడ క్లియర్ కాకుంటే హైకోర్టుకు వెళ్ళాలన్న ప్లాన్‌ ఉన్నట్టు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్ కూడా చిట్‌చాట్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా నెల రోజులు సమయం ఉంది కదా….. ఆ లోపు గవర్నర్ దగ్గర క్లియర్ అవుతుంది… ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారాయన. దీంతో… సమయం, సందర్భాన్నిబట్టి… మరోసారి అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు పంపుతారా? లేక ఇప్పటికే పంపిన సిఫారసు లేఖ రాజ్‌భవన్‌లో ఉంది కాబట్టి… దాన్నే పరిగణనలోకి తీసుకోమంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. కొత్తగా కోర్టు సూచన వచ్చింది కాబట్టి… ఇద్దరి పేర్లను మరోసారి పంపుతారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. అయితే… ఒక్క విషయంలో మాత్రం కాంగ్రెస్‌ వర్గాలు ధీమాగా ఉన్నాయి. రాజకీయ చర్చల సంగతి ఎలా ఉన్నా… అజహర్‌ పదవికి మాత్రం ఢోకా ఉండబోదన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్‌. అటు ప్రభుత్వ పెద్దలు కూడా గడువుకు ముందే.. గవర్నర్ దగ్గర ఫైల్ క్లియర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

Exit mobile version