Site icon NTV Telugu

Off The Record : ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు, కౌంటర్ ఇచ్చేందుకు నాయకులూ లేరా ?

Congress

Congress

మంత్రుల గొంతు మూగబోయిందా?పార్టీ, ప్రభుత్వంపై ఆ రేంజ్‌లో విపక్షం విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్‌ కూడా ఇవ్వలేకపోతున్నారా?అప్పోజిషన్‌ గ్యాప్‌ కూడా ఇవ్వకుండా సర్కార్‌పై ఎటాక్‌ చేస్తుంటే వీళ్లంతా మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారు?చెప్పుకోవడానికి ఊరంతా బలగమే ఉన్నా…అసలు ఉపయోగమే లేకుండాపోయిందా?రాజకీయ పదవులు అనుభవిస్తూ…పెదవులు మూసుకున్న ఆ నేతలెవరు? మాకెందుకు..తిట్టింది మమ్మల్ని కాదుగా అనుకుంటున్నట్టున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు. అలా అని తనదాకా వస్తే మాత్రం…చూశారా?ఎవరు మద్దతుగా లేరు అని అనుకోవడం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందట. కాంగ్రెస్ పార్టీ మీద కానీ… ప్రభుత్వం మీద కానీ ప్రతిపక్షం విమర్శలు చేస్తే.. MLC అద్దంకి దయాకర్…బల్మురి వెంకట్.. Mp చామల కిరణ్..ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…వీళ్లు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. ఉన్నంతలో పార్టీ కోసం…నాయకుల మీద వచ్చే ఆరోపణలపై స్పందిస్తూ ఉన్నారు.

పదవుల్లో ఉండి స్పందించేది…కేవలం ఈ నలుగురేనట. ఇక మిగిలిన నాయకులకు అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదా?పార్టీ మీదనో…ప్రభుత్వం మీదనో అసంతృప్తి ఉంటే అది అంతర్గత అంశం. కానీ ప్రతిపక్షం తిడితే కనీసం స్పందించడం లేదట. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒకరిద్దరు మంత్రులు కనీసం మాట్లాడే వాళ్లు. ఇప్పుడు వాళ్ళు కూడా మానేసినట్టు ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్.. సీతక్క లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్లు. కానీ ఈ మధ్య వాళ్లు కూడా సెలెక్టెడ్‌గా మాత్రమే స్పందిస్తున్నారని తెలుస్తోంది.

కేసీఆర్ ప్రభుత్వం మీద మాట్లాడితే..మంత్రులు కొంత స్పందించారు. దానికి కొనసాగింపుగా సీఎం రేవంత్…BRS నాయకులపై జోరుగా విమర్శలు చేశారు. దీంతో సీఎం రేవంత్‌పై.. brs నాయకులు mlaలు అంతా మూకుమ్మడిగా మాటల దాడిచేశారు. కేటీఆర్…సీఎం రేవంత్‌ను ఇష్టారాజ్యంగా తిట్టినా.. పార్టీ నాయకులకు చలనం లేకుండా పోయిందని పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. CM రేవంత్ కోటరిలో ఉండే వాళ్ళు కూడా స్పందించడం లేదట. సీఎం రేవంత్ రెడ్డిని తిడితే…ఆయనే రిప్లై ఇచ్చుకోవాలి అన్నట్టుగా ఉందట పార్టీ పరిస్థితి. మరి ఎవరిని తిడితే వాళ్లే రిప్లై ఇచ్చుకోవాలా? సీఎంను తిడితేనే స్పందించకపోతే.. ఇక మంత్రుల పరిస్థితి ఏంటి?మంత్రుల మీద ప్రతిపక్షం స్పందిస్తే కౌంటర్లు ఏ రేంజ్‌లో ఉంటాయో కూడా అంచనా వేసుకోవచ్చు. పార్టీ నాయకత్వం కూడా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అధికార ప్రతినిధుల నియామకం చేస్తే కనీసం వాళ్ళైనా స్పందించేవాళ్లు. కానీ అదీలేదు. పార్టీ కోసం పని చేయాలనుకున్న వాళ్లకు పదవులు లేవు..! పదవులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇదెక్కడి విచిత్ర పరిస్థితి అనేది అర్దం కావటం లేదట.

ఇంత పెద్ద పార్టీలో ప్రతిపక్షాల నుండి వచ్చే కౌంటర్‌కి రిప్లై ఇవ్వడానికి నాయకులు లేరా? మాట్లాడాలి అనుకున్న వాళ్లకు.. అసలు పార్టీ లైన్ ఏంటి..? ప్రభుత్వం ఆలోచన ఏంటన్న క్లారిటీ కూడా లేనట్లుగా తెలుస్తోంది. మంత్రులు కూడా అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారా?ప్రతిపక్షం నుండి వచ్చే విమర్శలకే కాదు..ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైనా మాట్లాడే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ పార్టీ..ప్రభుత్వం దీని గురించి పెద్దగా పట్టించుకునేట్టు ఇప్పట్లోనైతే కనిపించడం లేదు.

Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధికి పవన్ కళ్యాణ్

Exit mobile version