Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Komatireddy Venkat Reddy

Off The Record : నల్గొండ డీసీసీ నియామకం.. అన్నకు నాట్ ఓకే.. తమ్ముడికి ఒకే..

Published Date :November 26, 2025 , 8:21 pm
By Gogikar Sai Krishna
  • నల్గొండ జిల్లాలో డీసీసీ వివాదం
  • పున్నా కైలాష్‌ వద్దంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ
  • పున్నా బీసీ కావడంతో కాక రేపుతున్న కోమటిరెడ్డి లేఖ
  • మునుగోడు ఉప ఎన్నిక టైంలో మొదలైన వివాదం
Off The Record : నల్గొండ డీసీసీ నియామకం.. అన్నకు నాట్ ఓకే.. తమ్ముడికి ఒకే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఆ మంత్రి తన అసంత్రుప్తిని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు… తన లేఖలో ఆ సీనియర్ నేత పేర్కొన్న అంశాలేంటి.. డీసీసీ అధ్యక్షుడి నియామకానికి అన్న నై అంటుంటే.. తమ్ముడు మాత్రం సై అని ఎందుకు అంటున్నారు… డీసీసీ నియామకంతో ఉమ్మడి జిల్లా నేతలంతా ఒకవైపు… ఆ సీనియర్ నేత, క్యాబినెట్ మంత్రి మాత్రం మరోవైపు ఎందుకయ్యారు… తాజా ఎపిసోడ్ లో గతం తవ్వుకుంటే అందరి నష్టమేనని కాంగ్రెస్ క్యాడర్ ఎందుకంటుంది… నల్లగొండ జిల్లా హస్తం పార్టీలో డిసిసి అధ్యక్షుడి నియామకం చిచ్చు రాజేసింది. పున్నా కైలాష్‌ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అసంతృప్తిని తెలియజేస్తూ… సీఎంకు లేఖ రాశారాయన. గతంలో తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకూడదన్నది కోమటిరెడ్డి అభ్యంతరం. క్యాబినెట్‌ మినిస్టర్‌ హోదాలో ఆయన రాసిన లేఖ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు మరోసారి ఆజ్యం పోసినట్టయిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పున్నా కైలాష్‌ బీసీ, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం… బీసీ రిజర్వేషన్లు రాష్ట రాజకీయాల్లో కీలకంగా మారిన క్రమంలో ఇప్పుడు కోమటిరెడ్డి లేఖ కాకరేపుతోంది. దాదాపుగా మూడేళ్ళ క్రితం అప్పటి రాజకీయ పరిస్దితుల్లో జరిగిన వ్యవహారాలను సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి ప్రస్తతం ప్రస్తావించడం, సీయంకు లేఖ రాయడంపై హస్తం పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లినప్పుడు మునుగోడు ఉపఎన్నిక జరిగింది. అప్పుడు కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి…. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓ కార్యకర్తతో మాట్లాడిన వాయిస్… నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన మునుగోడు నియోజకవర్గానికే చెందిన అప్పటి టి-పిసిసి స్పోక్స్ పర్సన్, తాజాగా డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్‌… వెంకట్ రెడ్డి మీద ఓ రేంజ్ లో తిట్లపురాణం అందుకున్నారు. ఎంత తమ్ముడు అయితే మాత్రం కాంగ్రెస్‌ ఎంపీగా ఉండి బీజేపీ అభ్యర్థిని గెలిపించమని కోరడం ఏంటన్నది ఆయన అభ్యంతరం. ఆ ఊపులోనే… పున్నా కైలాష్‌ మాట్లాడిన మాటలు.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను రక్తికట్టించాయి. ఇక ఆ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడం, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ తరపున మునుగోడు ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ కూడా ఉంది. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పున్నా కైలాష్ గట్టిగా పనిచేయడం వల్లే మెజార్టీ పెరిగిందన్న అభిప్రాయం ఉంది. కానీ… ఆల్‌సెట్‌ అనుకుంటున్న టైంలో… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా లేఖ రాయడం వివాదాస్పదమైంది. ఆ వివాదం నివురుగప్పిన నిప్పులానే ఉందని, ఇప్పుడు బయటపడిందని చెప్పుకుంటున్నారు. తన కీలక అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి కూడా డీసీసీ రేసులో ఉన్నటైంలో ఆ పీఠం పున్నాకు దక్కడాన్ని వెంకట్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారన్న చర్చ జరుగుతోంది.

తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన పున్నా కైలాష్‌కు డీసీసీ ఇవ్వడం ఇష్టం లేదా… లేక తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజవవర్గానికి చెందిన వ్యక్తిని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నా అన్నది తేలాలంటున్నారు కొందరు. అయితే… కీలక, ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన అన్న మాటల్ని రాజకీయ విమర్శగానే చూడాలన్నది హస్తం పార్టీలోనే ఉన్న ఓ అభిప్రాయం. అంతకు మించి పున్నాను కాంగ్రెస్‌పట్ల నిబద్ధత ఉన్న నాయకుడిగా చూడాలన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. గతాన్ని తవ్వుకుంటే అందరికీ చాలా ఉన్నాయని.. అలా తవ్వుకుంటూ పోతే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని అంటున్నారు మరికొందరు కాంగ్రెస్‌ నాయకులు. మీకు మీకు అన్నదమ్ముల మధ్య ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండిగానీ… బీసీ బిడ్డకు అవకాశం వస్తే అడ్డుపడతారా అంటూ సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయినా…. AICC ప్రతినిధి ఒకరు వచ్చి నల్లగొండ జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి, నేతల అభిప్రాయాలు తీసుకుని… నియామక ప్రక్రియ పూర్తి చేస్తే ఇప్పుడేంటి ఈ పంచాయితీ అంటున్నారు జిల్లా కాంగ్రెస్‌ నాయకులు. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉమ్మడి జిల్లా కీలక నేతలు పున్నా కైలాష్‌కు మద్దతు ప్రకటిస్తుంటే…. వెంకటరెడ్డి మాత్రం ఇలాలేఖ రాయడం తన గౌరవాన్ని తగ్గించుకోవడమేనని అంటున్నారు ఇంకొందరు నల్గొండ నేతలు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Komatireddy Venkat Reddy
  • NTV Telugu
  • OTR

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions