ఆ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పడిగాపులు కాస్తున్నారా?పార్టీ అధికారంలోకి వచ్చినా…ఇప్పటి వరకు హైకమాండ్ వాళ్ల వైపు ఎందుకు చూడలేదు?గత ప్రభుత్వ హయాంలో నిర్బంధాలు ఎదుర్కొన్న నేతలకు గుర్తింపు లేకపోవటానికి కారణం ఏంటి?జనం కోసం కేసులు, కోర్టు మెట్లెక్కినా ప్రయోజనం లేకుండా పోయిందా?పార్టీ అధికారంలోకి రావటానికి కీలకమైన ఆ జిల్లాలో ఏం జరుగుతోంది?పక్క పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి…సొంత వాళ్లను ఎందుకు వదిలేశారు?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నానా కష్టాలు పడ్డారు ఆ పార్టీ క్యాడర్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పడ్డ కష్టాలు అన్నీఇన్నీకావు. పోలీసు స్టేషన్‌లు, కోర్టులు, కేసులు ఇలా ఎన్నో చూడాల్సి వచ్చిందట. కానీ..ఇప్పుడు కథ మారింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో తమకు నామినేటెడ్ పదవులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారట కార్యకర్తలు. అధికారంలోకి రావడానికి ముందే కొంతమంది బీఆరెస్‌లో పనిచేసిన వాళ్లు కాంగ్రెస్‌లో చేరిపోయారు. వాళ్ల అనుచర వర్గం కూడా పార్టీ కండువాలు కప్పుకుంది. ఆనాడు బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్లకు మంత్రి పదవులు వచ్చాయి. వాళ్ల అనుచర వర్గం కార్పొరేషన్, మార్కెట్ కమిటి సహా ఇతరత్రా పదవులు దక్కించుకున్నారు. పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లు మాత్రం ఇంకా తమకు పదవులు ఎప్పుడు వస్తాయా?అని ఎదురు చూస్తున్నారట. మరోవైపు…కొంతమంది పార్టీ కోసం తాము చేసింది చాలు అంటూ ఇంటి వద్దే ఉంటున్నారని తెలుస్తోంది.
Off The Record: టీడీపీలో అశోక్ గజపతి రాజు తర్వాత ఎవరు..? బంగ్లా మాటకు విలువ తగ్గిందా..?
పని చేసిన వాళ్లకే పదవులు రావాలి అంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టితో పాటు హైకమాండ్ వద్ద ఇదే డిమాండ్‌ను ప్రస్తావిస్తున్నారట. అందుకే అధిష్ఠానం సైతం ప్రత్యేకంగా ఓ నిర్ణయం తీసుకుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 2014 నుంచి 2023 వరకు పార్టీలో పని చేసిన వాళ్లకే పదవులను ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇది పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లకు సంతోషం కలిగిస్తోందట. కార్పొరేషన్ పదవుల్లోనూ ఎక్కువ మందికి పదవులు ఇచ్చామని భట్టి విక్రమార్క క్యాడర్‌కు చెబుతున్నారని తెలిసింది. ఇటీవల ఇచ్చిన కార్పొరేషన్ పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులైన బీసీ కమిటి, ఎస్‌సి కమిటి అధ్యక్షులకు, పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులుగా చేసిన వాళ్లకు చైర్మన్ పదవులను ఇచ్చామని చెబుతున్నారనే టాక్ వినిపిస్తోంది. చివరకు ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడుగా పని చేసిన వ్యక్తికి ఎంఎల్‌సి పదవిని, రైతుసంఘం అధ్యక్షులకు కార్పొరేషన్ పదవులను ఇచ్చిన విషయాన్ని గుర్తించాలంటున్నారని తెలుస్తోంది. ఇదే స్ఫూర్తిగా రానున్న కార్పొరేషన్ పదవుల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించారని సమాచారం.
ఇక…ఇదే జరిగితే పార్టీకి పెద్ద వరంగా మారనుందని అంటున్నారు కార్యకర్తలు. జిల్లాలో పార్టీ కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని పని చేసిన వాళ్లకు పదవులు రావడం శుభ పరిణామమనే చర్చ సాగుతోందట. పదవులు వస్తే మరింత పని చేస్తామని అంటున్నారు కార్యకర్తలు. అందుకే పార్టీ నాయకత్వం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క చెబుతున్నారని సమాచారం. మొత్తానికి…పార్టీ పదవులు తమకు వచ్చే వరకు చూడాలంటున్నారట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ క్యాడర్.
Off The Record: వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్‌లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారా..? ఫోకస్ పెట్టలేదా..?
