Site icon NTV Telugu

Off The Record : మౌనం వీడి మళ్లీ యాక్షన్ లోకి ధర్మాన.. తెరవెనుక ఏం జరిగింది..?

Dharamana

Dharamana

సైలెన్స్ వీడిన ధర్మాన.. కేడర్ లో ఉత్చాహం.. ఇదే ఊపు కొనసాగిస్తారా.. మరలా సైలెంట్ మోడ్ లోకి జారుకుంటారా.. ఇదే అంశం నేడు జిల్లా పార్టీలో ఆశక్తికర చర్చగా మారిందట. ఇంతకీ ఎవరా నేత. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో అంతా తానై వ్యవహరించిన ధర్మాన ప్రసాద రావు…కొంతకాలంగా సైలెంట్‌ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఈమధ్య మళ్లీ జిల్లా పార్టీ ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా కనిపిస్తుండటంతో, అసలేం జరిగింది? మళ్లీ ఎందుకు యాక్టివ్ అయ్యారు…తెర వెనక ఏం జరిగిందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది.

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ధర్మాన ప్రసాద రావు అలికిడి తగ్గింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఆయన పెద్దగా కనిపించలేదు. పార్టీ ఇంచార్జీలు వచ్చినా, సీనియర్ నేతలు ధర్మాన ఇంటికి వెళ్ళడం తప్ప ఆయన గడప దాటి వచ్చింది లేదు. అటు సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ తను పోటీలో ఉండడం లేదని, తన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించి అస్త్రసన్యాసం చేశారు. అలాంటి నేత నేడు జిల్లా పార్టీ బాధ్యులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసాద రావు కూడా మౌనంగా వుండటం పార్టీ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. గ్రూపుల గోల ఎన్నా…పార్టీలో అందరూ కలిసికట్టుగా వుండాలని, సీనియర్లు క్యాడర్‌ను ముందుండి నడిపించాలని అధిష్టాన పెద్దలు సైతం సూచించారు. దీంతో ధర్మాన ప్రసాద రావు గడప దాటి…మళ్లీ జనంలో కనిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

Exit mobile version