Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం పొడిగింపుపై సస్పెన్స్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు ఉంటుందా? తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పొడిగింపుపై కేంద్రం మళ్లీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? సీఎస్ పదవిని మరికొంత కాలం పెంచాలని సీఎం రేవంత్ రాసిన లేఖకు సానుకూల స్పందన ఉంటుందా? తెలంగాణ సీఎస్ పదవిపై ఏం జరుగుతోంది?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. రామకృష్ణారావు పదవీ కాలం గతేడాది ఆగస్టులో ముగియగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి సీఎస్ పదవీ కాలం ఎక్స్ టెన్షన్ ఇవ్వాలని లేఖ రాశారు. సీఎం లేఖకు స్పందించిన పీఎం ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించేలా డీఓపీటీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏడు నెలలుగా పాటు సీఎస్ గా కొనసాగుతున్న రామకృష్ణా రావు మరోసారి తన పదవీ కాలం పొడిగించాలని ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్నట్లు సెక్రటేరియట్ లో చర్చ జరుగుతోంది.

సీఎస్ రామకృష్ణారావుకు మరో 3 నెలల ఎక్స్ టెన్షన్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి మార్చి 5న లేఖ రాయడంపై బ్యూరోక్రాట్స్ లో చర్చ జరుగుతోంది. కాగా ఈనెల 31తో సీఎస్ పదవీకాలం ముగుస్తుండటం.. వచ్చే వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, జనగణనల ప్రారంభం కానుండటంతో సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని పీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సీఎస్‌లకు ఏడాదిపాటు పదవీకాలం పొడిగిస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఉత్తరప్రదేశ్ సీఎస్ కు రెండేళ్ల పాటు

రెసిడ్యూయరీ రూల్స్ ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఏ నిబంధననైనా సడలించుకునే వెసులుబాటు ఉంటుందని ఐఏఎస్ లు చర్చించుకుంటున్నారు. రూల్ 3 ప్రకారం రాష్ట్ర అవసరాల మేరకు రామకృష్ణరావుకు మరొకసారి పదవీకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా సీఎం లేఖ అందిన 15 రోజుల్లోపు అంటే మార్చి 20 కంతా, ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రిప్లై వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదిలావుంటే సీఎస్ రేసులో ఉన్న మిగతా సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎస్ పదవికి పోటీలో ఉన్న వారిలో ఒకరిద్దరు త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు.

ఐఏఎస్‌ల సర్వీస్ మొత్తంలో ఒక్కసారైనా సీఎస్ కావాలని అనుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్పెషల్ సీఎస్ లుగానే పదవీ విరమణ చేయాల్సి వస్తుందని… వాస్తవానికి, సీనియారిటీ ప్రకారం ప్రభుత్వం డీఓపీటీకి ముగ్గురితో కూడిన జాబితా పంపించాల్సి ఉంటుంది. ఈ లెక్కన తమకు సీఎస్ పదవి దక్కుతుందని పలువురు పెట్టుకున్న ఆశలు ప్రధానికి సీఎం రాసిన లేఖతో అడియాశలు అయినట్లు సహచర ఐఏఎస్ లకు చెప్పుకుని బాధపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. మరి సీఎం లేఖపై పీఎం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Exit mobile version