Site icon NTV Telugu

Off The Record : మంత్రి అచ్చెన్నాయుడు పేషీలో ఆయన అరాచకాలు శృతిమించాయ?

Atchannaidu

Atchannaidu

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అచ్చెన్నాయుడి పేషీలో అరాచకాలు జరిగిపోతున్నాయా? వాటన్నిటికీ కారణం ఒకే ఒక్కడా? విషయం తెలిసినా, ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతున్నా… మంత్రి ఆయన్ని ఎందుకు పక్కన పెట్టలేకపోతున్నారు? ఇద్దరి మధ్య అంత అనుబంధం ఏంటి? పైగా అచ్చెన్నాయుడు ఈ విడత మంత్రి అయ్యాక సదరు వ్యక్తిని ఏరికోరి పేషీలోకి తెచ్చుకున్నారన్నది నిజమేనా? అచ్చెన్న పేషీలో అసలేం జరుగుతోంది? అంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖలో ఏదేదో జరిగిపోతోందట. ఏపీ అగ్రోస్‌లో అవకతవకలపై అంతర్గత విచారణ నడుస్తోంది. ఆ విషయంలో రచ్చ రచ్చ అవుతున్న వేళ అన్ని వేళ్ళు మంత్రి అచ్చెన్నాయుడి వైపే చూపిస్తున్నాయి. ఆయన పేషీలో జరుగుతున్న వ్యవహారాలు, మంత్రి ఓఎస్‌డీ… పోలి నాయుడి తీరు గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి ఇటు శ్రీకాకుళం జిల్లాలో, అటు సచివాలయంలో. అచ్చెన్న పేషీ అరాచకాలపై నిఘా వర్గాలు కూడా నివేదిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏపీ ఆగ్రోస్‌లో తాజా పరిణామాలపై సీఎంకు నివేదిక ఇవ్వబోతున్నారట సంస్థ ఛైర్మన్‌. వాటర్‌షెడ్‌ పరికరాల టెండర్ల నిబంధనలు మార్చిన విషయమై కాంట్రాక్ట్‌ ఉద్యోగిని బదిలీ చేశారు.

Punjab : వరద ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి ఇండియన్ స్పెషలిస్ట్ మొబిలిటీ వెహికల్

కంపెనీలకు, మంత్రి కార్యాలయానికి మధ్యవర్తిగా వ్యవహరించాలని ఓఎస్డీ ఒత్తిడి చేస్తున్నారని, మాట వినలేదని బదిలీ చేయడంతో సెలవుపై వెళ్తున్నానంటూ ఆగ్రోస్‌ జనరల్‌ మేనేజర్‌ రాసిన లేఖ బయటకు రావడం కలకలం రేపింది. ఆగ్రోస్‌ వ్యవహారం ఇప్పుడు బయటపడ్డది కాగా… గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినా… మంత్రి అచ్చన్న మాత్రం పోలినాయుడిని వదలడం లేదట. 2014 నుంచి 2019 మధ్య కూడా అచ్చెన్నాయుడి దగ్గరే పని చేసిన పోలినాయుడు అంతా తానై వ్యవహరిచారు. అప్పట్లో మంత్రి ఎదుర్కొన్న అనేక ఆరోపణలకు మూల కారకుడు పోలినాయుడేనని అంటారు కింజరాపు అభిమానులు. ఇక వైసీపీ హయాంలో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడి దగ్గర చేసిన పోలినాయుడిని ఆ తర్వాత ఎవరూ దగ్గరికి రానివ్వలేదట. తిరిగి ఇప్పుడు అచ్చన్న ఏరికోరి ఆయన్ని ఓఎస్డీగా నియమించుకోవడంతో…ఇద్దరి మధ్య ఫెవికాల్‌ బంధానికి కారణాల గురించి వెదుకుతున్నాయి రాజకీయ వర్గాలు. కాస్త లోతుల్లోకి వెళ్తే… అచ్చెన్నాయుడి వెనకుండి కథ నడిపించేదంతా…పోలినాయుడేనన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో.

చిన్న ట్రాన్స్‌ఫర్‌ మొదలు పెద్ద కాంట్రాక్టుల దాకా… మంత్రి ఓకే చెప్పాలంటే… ముందు ఓఎస్ డి పోలినాయుడిని కలవాల్సిందేనట. ఒకరకంగా అతనే షాడో మినిస్టర్‌ అన్నది జిల్లా రాజకీయవర్గాల్లో నడుస్తున్న టాక్‌. ఓఎస్డీ పరంగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదురవుతున్నా… అచ్చెన్న ఆయన్నే కొనసాగించడం, రెండోసారి కూడా ఏరికోరి తెచ్చుకోవడం గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రికి తెలియకుండా ఆయన ఓఎస్డీ అంత తెగిస్తారా అన్నది బిగ్‌ క్వశ్చన్‌. ఓఎస్ డి పోలినాయుడు ఊ అంటేనే అచ్చెన్న దగ్గరుండే ఏ ఫైల్ అయినా కదులుతుందన్నది సిక్కోలు టాక్‌. ఈ వ్యవహారంలో టీడీపీ కేడర్‌ కూడా గుర్రుగా ఉందట. పోలినాయుడి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

Malaika Arora : బాబోయ్.. 50 ఏళ్ల ఏజ్ లో కత్తిలాంటి అందాలు

Exit mobile version