Site icon NTV Telugu

Off The Record: హైకమాండ్కు ఉత్తరాంధ్ర నేతలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్?

Off The Record

Off The Record

Off The Record: ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తొందరపడ్డారా? డేటా సెంటర్స్‌ గురించి అధినేత మనసులో ఏముందో తెలుసుకోకుండా ముందే స్పందించారా? గూగుల్‌ విషయమై తాజాగా జగన్‌ రియాక్షన్‌కు, అంతకు ముందు వాళ్ళ స్పందనలకు మధ్య వ్యత్యాసాన్ని ఎలా చూడాలి? అది సమన్వయ లోపమా? లేక అధ్యక్షుడి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేద్దామనుకున్న నాయకుల అత్యుత్సాహమా? లెట్స్‌ వాచ్‌.

ఊరికి ముందే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకత్వం గూగుల్‌ డేటా సెంటర్‌కు వ్యతిరేక స్వరం వినిపించింది. అదో గోడౌన్‌ తప్ప ఉపయోగం లేదని ఒకరు, దానివల్ల వైజాగ్‌లో టెంపరేచర్‌ పెరుగుతుందని మరొకరు, అలాంటి ప్రాజెక్ట్‌ వస్తే… ఇంకేదో జరిగిపోతుందని ఇంకొకరు…. రకరకాలుగా కామెంట్స్‌ చేశారు. అదే సమయంలో ప్రభుత్వం సహజంగానే ఈ ప్రాజెక్ట్‌కు బీభత్సమైన ఎలివేషన్‌ ఇచ్చింది. వైసీపీ వాళ్ళకు సరిగా తెలియక ఏదేదో మాట్లాడుతున్నారుగానీ… గూగుల్‌ డేటా సెంటర్‌ వల్ల వైజాగ్‌లో ఒక ఎకో సిస్టం డెవలప్‌ అవుతుందని, మిగతా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రావడానికి రూట్‌ క్లియర్‌ అవుతుందని క్లారిటీ ఇస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ కన్ఫ్యూజన్‌లో… ఎవర్ని నమ్మాలో అర్ధంకాని స్థితిలో ప్రజలు ఉండగానే…. వైసీపీ అధినేత జగన్‌ తాజాగా మాట్లాడిన మాటల చుట్టూ కొత్త చర్చ మొదలైంది.

Off The Record: అందుకే నరసరావుపేట పరిధిలో యాక్టీవ్ అయ్యారా?

ఓవైపు ఉత్తరాంధ్ర నాయకులు వ్యతిరేక కామెంట్స్‌ చేస్తే… జగన్‌ మాత్రం డేటా సెంటర్స్‌కు అనుకూల స్వరం వినిపించారు. ఒకే ఇష్యూపై డిఫరెంట్ వెర్షన్స్ రావడంతో పార్టీ ప్రయోగించాలనుకున్న రాజకీయ అస్త్రం రివర్స్ అయిందా అనే చర్చకు తెరలేచింది. సరిగ్గా ఇదే పాయింట్‌ని వాడుకుంటూ… సర్కార్‌ వైపు నుంచి కూడా ఆల్రెడీ అటాక్‌ మొదలైపోయింది. వైసీపీ నేతలు దాగుడు మూతలతో జనాన్ని మభ్య పెట్టవద్దంటూ ప్రభుత్వం ఎదురు దాడి స్టార్ట్‌ చేసింది. నువ్వా నేనా అన్నట్టుగా ఉండే పొలిటికల్‌ సిచ్యుయేషన్స్‌లో ఏ మాత్రం తడబడ్డా… సంకట స్థితి తప్పదు. డేటా సెంటర్ల విషయంలో వైసీపీ ఇప్పుడు అదే స్థితిలోకి వెళ్ళిపోయిందా అంటూ మాట్లాడుకుంటున్నారు ఎక్కువ మంది. ఉద్యోగాలు, పర్యావరణ పర్యవసానాల చర్చల్ని కాసేపు అలా ఉంచితే… అమెరికా బయట గూగుల్ ఇంత భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. లక్షా 30వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. దాన్ని బేస్‌ చేసుకునే… విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఈ డేటా సెంటర్ పునాది అంటూ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. ఐతే… ఇందులోకి క్రెడిట్‌ పాలిటిక్స్‌ ఎంటరవడంతో మేటర్‌ రసకందాయంలో పడింది.

గూగుల్‌ డేటా సెంటర్‌ గురించి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోందని, వాళ్ళు చెబుతున్నట్టు లక్షల ఉద్యోగాలన్నది అభూతకల్పన అంటూ విభేదించారు ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు. ఆ విషయంలో కాస్త దూకుడు ప్రదర్శించి గట్టి స్టేట్‌మెంట్సే ఇచ్చేశారు. ఆ పొలిటికల్‌ గేమ్‌ అలా నడుస్తుండగానే… తాజాగా మీడియాతో మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు జగన్‌… డేటా సెంటర్స్‌ని మేం వ్యతిరేకించడం లేదు, స్వాగతిస్తున్నామని ప్రకటించారు. పైగా అదానీ డేటా సెంటర్‌కు పునాది వేసింది వైసీపీనేనని క్లారిటీ ఇచ్చేశారాయన. దీంతో మేటర్‌ కీలక మలుపు తిరిగింది. పార్టీ హైకమాండ్‌ ఆలోచనలకు, ఉత్తరాంధ్ర నాయకత్వానికి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందా? లేక పార్టీ విధానం ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు తొందరపడ్డారా అన్న అనుమానాలు వస్తున్నాయట పరిశీలకులకు. వాస్తవంగా… విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా తొలి అడుగు వైసీపీ హయాంలోనే పడింది. మధురవాడ ప్రాంతంలో300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్‌కు 2023లో సీఎం హోదాలో శంఖు స్థాపన చేశారు జగన్మోహన్‌రెడ్డి.

Off The Record: ఈ నాయకుడు మాకొద్దు.. కేడర్ గగ్గోలు..!

కేవలం డేటా సెంటర్ ఒక్కటే కాకుండా ఐటీ అనుబంధ పెట్టుబడులు పెట్టే విధంగా అప్పట్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అయితే… ప్రస్తుతం గూగుల్ ఏర్పాటు చేయబోతున్నది ఒక గిగావాట్ కెపాసిటీ. స్టోరేజ్‌ సామర్ధ్యం, పెట్టుబడి పరంగా రెండు ప్రాజెక్ట్‌ల మధ్య పొంతన లేకున్నా… ఇదే విశాఖలో డేటా సెంటర్‌కు వైసీపీ హయాంలో శంకుస్థాపన జరిగిందన్నది మాత్రం వాస్తవం. ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ఆ సంగతి మర్చిపోయి గూగుల్‌పై విమర్శలు చేసి తొందర పడ్డారా అన్న చర్చలు మొదలయ్యాయి రాజకీయవర్గాల్లో. గూగుల్‌కు తాము వ్యతిరేకం కాదంటూనే… డేటా సెంటర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో… ప్రభుత్వం కూడా ఎదురు దాడి ప్రారంభించింది. వైసీపీ అభివృద్ధికి వ్యతిరేకం కనుకనే గూగుల్‌ను ఆహ్వానించడానికి మనసు రావడం లేదని, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు అధికారపక్ష నేతలు. మొత్తం మీద ఈ విషయమై వైసీపీలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందన్న విషయం మాత్రం అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.

Exit mobile version